Oscars 2023: RRR, Kantara, The Kashmir Files and Gangubai Kathiawadi on Reminder List - Sakshi
Sakshi News home page

Oscars 2023: సర్‌ప్రైజ్‌.. ఆస్కార్‌ రేసులో నాలుగు ఇండియన్‌ సినిమాలు

Published Tue, Jan 10 2023 12:54 PM | Last Updated on Tue, Jan 10 2023 3:20 PM

Oscars 2023: RRR, Kantara And Gangubai Kathiawadi On Reminder List - Sakshi

ఆస్కార్‌ నామినేషన్స్‌లోకి మన సినిమా వెళ్తే ఆ కిక్కే వేరు. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ సెన్సేషన్‌ కాంతార సినిమా కూడా ఆస్కార్‌ పోటీలోకి వచ్చింది. రెండు విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్‌ అవార్డుల కోసం పోటీపడుతుంది. కేవలం రూ. 16కోట్లతో రూపొందిన  ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆస్కార్‌ అవార్డుల‌కు కాంతార క్వాలిఫై అయ్యింది.ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. కాంతార చిత్రం రెండు విభాగాల్లో ఆస్కార్‌కి అర్హత లభించింనందుకు సంతోషంగా ఉంది. మాకు మద్దతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు అంటూ ట్వీట్‌ చేసింది.

ఇక ప్రస్తుతం కాంతార, ఆర్‌ఆర్‌ఆర్‌లతో పాటు ది కశ్మీర్‌ ఫైల్స్‌, గంగూబాయ్‌ కతియావాడి చిత్రాలు కూడా ఆస్కార్‌ రిమైండర్‌ రేసులో ఉన్నాయి. మార్చ్‌12న ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమం జరగనుంది. మరి క్వాలిఫైకి అర్హత సాధించిన మన ఇండియన్‌ సినిమాల ఆస్కార్‌ కల తీరుతుందా అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement