Oscar nomination entry
-
ఆస్కార్ బరిలో చిన్న సినిమా.. అవార్డ్ దక్కేనా?
కేరళ వరదల నేపథ్యంలో రూపొందించిన చిత్రం 2018. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. చిన్న సినిమాగా వచ్చి భారీ వసూళ్లు సాధించింది. అయితే తాజాగా ఈ చిత్రం భారత్ తరఫున ప్రతిష్టాత్మక ఆస్కార్ రేసులో నిలిచింది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మలయాళంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. (ఇది చదవండి: 2018 మూవీ రివ్యూ) ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్‌తోనే భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. 2024 ఆస్కార్ అకాడమీ అవార్డులకు భారతదేశం అధికారిక ఎంట్రీ చిత్రంగా ఎంపిక చేసినట్లు కన్నడ చిత్ర దర్శకుడు గిరీష్ కాసరవల్లి నేతృత్వంలోని జ్యూరీ ప్రకటించింది. నామినేషన్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంటేనే ఈ చిత్రం అవార్డుకు అర్హత సాధిస్తుంది. కాగా.. 96వ ఆస్కార్ వేడుకలు మార్చి 10, 2024న లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్లో జరగనున్నాయి. (ఇది చదవండి: ఈ అమ్మాయి ఎవరో తెలుసా?.. ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్!) ఆస్కార్-2023 ఏడాదిలో ఎంట్రీకి ఛెలో షో (2022), కూజాంగల్ (2021), జల్లికట్టు (2020), గల్లీ బాయ్ (2019), విలేజ్ రాక్‌స్టార్స్ (2018), న్యూటన్ (2017), విసరాని (2016) చిత్రాలు ఎంపిక కాగా.. ఏది ఎంపిక అవ్వలేదు. ఇప్పటివరకు మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్ చిత్రాలు మాత్రమే ఆస్కార్‌కు నామినేట్ భారతీయ సినిమాలుగా నిలిచాయి. ఆస్కార్ 2023లో ఇండియా సినిమాలు రెండు అవార్డులను గెలుచుకుని చరిత్ర సృష్టించాయి. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ రాగా.. డాక్యుమెంటరీ ఫిల్మ్ ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. కార్తికీ గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో దక్కించుకుంది. -
ఆస్కార్ అవార్డుకు క్వాలిఫై అయిన 'కాంతార'.. ఆర్ఆర్ఆర్కు పోటీగా
ఆస్కార్ నామినేషన్స్‌లోకి మన సినిమా వెళ్తే ఆ కిక్కే వేరు. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ సెన్సేషన్ కాంతార సినిమా కూడా ఆస్కార్ పోటీలోకి వచ్చింది. రెండు విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడుతుంది. కేవలం రూ. 16కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ అవార్డులకు కాంతార క్వాలిఫై అయ్యింది.ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కాంతార చిత్రం రెండు విభాగాల్లో ఆస్కార్‌కి అర్హత లభించింనందుకు సంతోషంగా ఉంది. మాకు మద్దతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. ఇక ప్రస్తుతం కాంతార, ఆర్ఆర్ఆర్లతో పాటు ది కశ్మీర్ ఫైల్స్, గంగూబాయ్ కతియావాడి చిత్రాలు కూడా ఆస్కార్ రిమైండర్ రేసులో ఉన్నాయి. మార్చ్12న ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. మరి క్వాలిఫైకి అర్హత సాధించిన మన ఇండియన్ సినిమాల ఆస్కార్ కల తీరుతుందా అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. BIG ANNOUNCEMENT: #TheKashmirFiles has been shortlisted for #Oscars2023 in the first list of @TheAcademy. It’s one of the 5 films from India. I wish all of them very best. A great year for Indian cinema. 🙏🙏🙏 — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) January 10, 2023 We are overjoyed to share that 'Kantara' has received 2 Oscar qualifications! A heartfelt thank you to all who have supported us. We look forward to share this journey ahead with all of your support. Can’t wait to see it shine at the @shetty_rishab #Oscars #Kantara #HombaleFilms — Hombale Films (@hombalefilms) January 10, 2023 -
ఆస్కార్ ఎంట్రీలో ఆర్ఆర్ఆర్.. రాజమౌళికి అరుదైన అవార్డు
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ రేసులో ఉన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. కాగా ఈ చిత్రం ఎన్నో అవార్డులు రివార్డులు పొందింది. తాజాగా రాజమౌళికి ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ బెస్ట్ డైరెక్టర్ అవార్డు దక్కింది. గతంలో న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ వారు ప్రకటించిన 22మందిలో దాదాపు 16మందికి ఆస్కార్ నామినేషన్స్ వచ్చాయట. అందుకే ‘ఆర్ఆర్ఆర్’కి నామినేషన్ ఆస్కారం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ‘ఫర్ యువర్ కన్సిడరేషన్’ (సాధ్యం ఉన్న విభాగాల్లో) అంటూ ఈ చిత్రాన్ని ఆస్కార్ రేసుకి పంపింది ఈ చిత్రం యూనిట్. వచ్చే ఏడాది జనవరిలో నామినేషన్స్ ప్రకటన రానుంది, మార్చిలో అవార్డుల వేడుక జరగనుంది. ఇక ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం తరఫున గుజరాతీ ఫిల్మ్ ‘ఛెల్లో షో’ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. -
ఓటీటీకి వచ్చేసిన ఆస్కార్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆర్ఆర్ఆర్, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలను వెనక్కినెట్టి ఆస్కార్ బరిలో నిలిచిన గుజరాతీ చిత్రం 'ఛెల్లో షో'. ఆంగ్ల చిత్రం 'ది లాస్ట్ షో' రీమేక్‌గా వచ్చింది ఈ సినిమా. తొమ్మిదేళ్ల వయసులో సినిమాతో ప్రేమలో పడిన కుర్రాడి కథగా తెరకెక్కిన చిత్రం ‘ఛెల్లో షో’. దర్శకుడు పాన్ నలిన్ తెరకెక్కించిన ఈ సినిమా ఆస్కార్- 2023 పోటీలో నిలిచింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా నవంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సినీ ప్రియుల హృదయాల్ని హత్తుకున్న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. (చదవండి: ఆస్కార్ నామినేషన్ చిత్రం ‘ఛెల్లో షో’ ట్రైలర్ విడుదల) అసలు కథేంటంటే.. దర్శకుడు నలిన్ బాల్య జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కించారు. తొమ్మిదేళ్ల వయసులో సినిమాలకు ఎలా ఆకర్షితులయ్యారు? అనే కథాంశంతో రూపొందించారు. సినిమాల పట్ల ఎంతో ప్రేమ ఉన్న తొమ్మిదేళ్ల అబ్బాయి సామీ (భవిన్ రాబరి) ఎలా ఫిల్మ్‌మేకర్ అయ్యాడు? అన్నదే చిత్ర కథ. గుజరాత్లో గ్రామీణ వాతావరణం అప్పట్లో ఎలా ఉండేదో ఈ సినిమా ద్వారా నలిన్ కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమాలో భవిన్ రాబరి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావల్, పరేష్ మెహతా ప్రధాన పాత్రల్లో నటించారు. WE HAVE AN ANNOUNCEMENT! 📣 An extraordinary cinematic experience, Last Film Show, India's Official Selection for Best International Feature Film at the 95th Oscars is streaming from Nov 25 in Hindi & Gujarati on Netflix! 🤩 pic.twitter.com/NgzeHYV1YU — Netflix India (@NetflixIndia) November 21, 2022 -
ఓటీటీలకు బ్యాడ్‌న్యూస్.. కొత్త రూల్స్ తెచ్చిన ఆస్కార్
95వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చి 12న జరగనుంది. ఈసారి అవార్డులకు సంబంధించిన కొత్త నియమ, నిబంధనలను కమిటీ ప్రకటించింది. ఆ వివరాలు... థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలకే ఆస్కారం ఒక సినిమా ఆస్కార్ అవార్డు నామినేషన్‌కు అర్హత సాధించాలంటే కచ్చితంగా థియేటర్స్‌లోనే రిలీజ్ కావాలి. ఆ సినిమా 2022 జనవరి 1నుంచి డిసెంబరు 31లోపు థియేటర్స్‌లోనే రిలీజ్ కావాలి. యూఎస్ మెట్రోపాలిటిన్ ఏరియా, లాస్ ఏంజిల్స్, ది సిటీ ఆఫ్ న్యూయార్క్, చికాగో, మియామీ, అట్లాంటాల్లోని థియేటర్స్‌లో సినిమా కచ్చితంగా ప్రదర్శితమై ఉండాలి. అయితే కరోనా కాలంలో ఓటీటీలో రిలీజైన సినిమాలూ ఆస్కార్ అవార్డుకు అర్హత సాధించాయి. కరోనా టైమ్‌లో అకాడమీ స్క్రీనింగ్ రూమ్‌లో సినిమాను ప్రదర్శిస్తే చాలు.. ఆ సినిమా అర్హతను నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అయిన కారణంగా ఈ వెసులుబాటుని తొలగించారు. ఓటీటీ కోసం సినిమాలు తీసి, ఆస్కార్ అవార్డుకు పంపాలనుకునే దర్శక–నిర్మాతలకు ఇది చేదు వార్త అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఆస్కార్‌కు అర్హత సాధించాలంటే సినిమా కచ్చితంగా థియేటర్స్‌లోనే రిలీజ్ కావాలనే నిబంధన కరోనాకు ముందు నుంచీ ఉన్న సంగతి తెలిసిందే. డాక్యుమెంటరీ విభాగంలో వచ్చే అవార్డుల పేర్లు మారాయి. ‘డాక్యుమెంటరీ ఫీచర్’ పేరు ‘డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్’గా, ‘డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్’ విభాగం ‘డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్’గా మారింది. ► మ్యూజిక్ విభాగంలోని ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ అవార్డు విషయంలోనూ అకాడమీ మార్పులు చేసింది. ఈ విభాగంలో ఒక సినిమా నుంచి కేవలం మూడు పాటలనే పోటీకి పంపాలనే నిబంధనను విధించింది కమిటీ. ► ‘బెస్ట్ సౌండింగ్’ అవార్డు విభాగానికి అర్హత సాధించాలంటే కచ్చితంగా ఆ సినిమాను సౌండ్ బ్రాంచ్ మెంబర్స్ పర్యవేక్షణలో ప్రదర్శించాలి. కొన్ని విభాగాలకు సంబంధించి పోటీలో నిలిచేందుకు చివరి తేదీ ► డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: అక్టోబరు 3, 2022 ► యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: అక్టోబరు 14, 2022 ► లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: అక్టోబరు 14, 2022 ► ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్: నవంబరు 1, 2022 ► యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్, జనరల్ ఎంట్రీ కేటగిరీ: నవంబరు 15, 2022 చదవండి 👉🏾 అది చూసి అనిల్ నాకు వంద హగ్గులు, వంద ముద్దులు అన్నారు అఖండ నటుడు కన్నుమూత -
కూళాంగల్: నీ సమస్యలకు ఆమెనెందుకు హింసిస్తావ్...?
మేక్సిమ్ గోర్కి ప్రఖ్యాత నవల ‘అమ్మ’లో ఫ్యాక్టరీ కార్మికుడిగా పని చేసే తండ్రి తల్లిని ఎందుకు చితక బాదుతున్నాడో చాలారోజులకు గాని అర్థం కాదు కొడుక్కు. పురుషుడిలోని హింసకు బాహ్య కారణాలూ ఉంటాయి. కరువు నేలలో పురుషులకు పని ఉండదు. స్త్రీలను హింసించడమే వారి పని. 2022 ఆస్కార్‌కు మన దేశం తరఫున అఫీషియల్ ఎంట్రీ అయిన ‘కూళాంగల్’ మధురై ప్రాంతంలో స్త్రీల మీద జరిగే హింసను పరోక్షంగా చర్చించింది. భర్త దాడికి పుట్టింటికి నిత్యం పారిపోయే భార్యను తిరిగి తేవడానికి తండ్రీ కొడుకులు బయలుదేరడమే ఈ కథ. నేడు కరోనా వల్ల ఉపాధులు తలకిందులై ఇళ్లల్లో చోటు చేసుకుంటున్న హింసను చర్చించడానికీ ఇది సందర్భమే. ‘కూళాంగల్’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. బస్ ఆగుతుంది. ఒక ఆడమనిషి మూడు నీళ్లు నిండిన బిందెలను అతి జాగ్రత్తగా బస్సులోకి ఎక్కిస్తుంది. ఆ నీళ్లను ఆమె ఇంటికి తీసుకెళ్లాలి. ఆమె ఎవరో? ఎన్ని గంటలకు నిద్ర లేచిందో. ఎక్కడి నుంచి బస్సెక్కి ఇక్కడి దాకా వచ్చిందో. నీళ్లు పట్టుకోవడానికి ఎంతసేపు పట్టిందో. నీళ్లు ఇంటికి చేరడానికి ఇంకెంత సేపు పడుతుందో. ఇవన్నీ దర్శకుడు చెప్పడు. చూపడు. కాని చూస్తున్న ప్రేక్షకులకు ఇన్ని ఆలోచనలు తప్పక వస్తాయి. కరువు ఆ ప్రాంతంలో. కరువు అంటే నీటి సమస్య. నీటి సమస్య ఎప్పుడూ స్త్రీల సమస్యే. ఎందుకంటే ఇంట్లో ప్రతి అవసరానికి నీళ్లు కావాల్సింది వారికే కదా. ‘కూళాంగల్’ సినిమాలో ఒక సన్నివేశం ‘కూళాంగల్’ సినిమాను తమిళనాడు మధురై జిల్లాలోని మేలూరుకు దగ్గరగా ఉన్న అరిట్టపట్టి అనే ఊళ్లో 2019 మే నెలలో మొదలెట్టి తీశారు. దర్శకుడు వినోద్‌రాజ్ ది ఆ ప్రాంతమే. ఇది అతడి మొదటి సినిమా. ‘నా సినిమాలో మూడే కేరెక్టర్లు ప్రధానం. తండ్రి.. కొడుకు... కరువు’ అంటాడు వినోద్‌రాజ్. ‘కరువు చాలా అసహనం ఇస్తుంది. అది మానవ సంబంధాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. కరువు ఉన్న ప్రాంతం పురుష పెత్తనం ఎక్కువగా ఉంటే ఆ హింస భరించడం స్త్రీల వంతు అవుతుంది. నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు మా చిన్నక్కకు, ఆమె భర్తకు తగాదా వస్తే మా చిన్నక్క అత్తింటి నుంచి పుట్టింటికి 10 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ పది కిలోమీటర్లు మా బావ ఆమెను వెంటాడుతూనే వచ్చాడు. ఈ సినిమాకు ఆ సంఘటన ఒక స్ఫూర్తి’ అంటాడు దర్శకుడు వినోద్‌రాజ్. మధురైలోని కరువు ప్రాంతాల్లోని పల్లెల్లో ఏమీ పండదు. మగవారికి పని ఉండదు. నీళ్ల కటకట వల్ల శుభ్రత ఉండదు. అసహనంతో తాగడం. పేకాట ఆడటం. తగాదాలు పడటం. ఇంటికొచ్చి భార్యను హింసించడం... ఇవే పనులు. పిల్లల మీద ఈ తగాదాలు విపరీతంగా ప్రభావం చూపుతాయి. స్త్రీలు ఇళ్ల నుంచి పారిపోతుంటారు. ‘కూళాంగల్’లో తండ్రి కొడుకును అడుగుతాడు– ‘నీకు నేనంటే ఇష్టమా.. మీ అమ్మంటే ఇష్టమా’ అని. దానికి కొడుకు సమాధానం చెప్పడు. కాని సినిమాలో ఒకచోట వాడు ఒక రాయి మీద తల్లి పేరు, చెల్లిపేరు, తన పేరు రాసుకుంటాడు తప్ప తండ్రి పేరు రాయడు. తండ్రి దారుణమైన ప్రవర్తనకు అతడి నిరసన అది. ‘కూళాంగల్’ అంటే నున్నటి గులకరాళ్లు. ఈ సినిమా కథ భర్తతో తగాదాపడి పుట్టింటికి వెళ్లిన భార్యను వెతుక్కుంటూ కాలినడకన భర్త, అతని వెనుక కొడుకు బయలుదేరుతారు. కాని దారంతా కరువు ఎలా ఉంటుందో, పచ్చటి మొక్క కూడా మొలవక ఆ పరిసరాలు ఎంత నిస్సారంగా ఉంటాయో, కిర్రుమనే చప్పుడు... మనిషి అలికిడి లేకపోవడం ఎంత దుర్భరంగా ఉంటుందో దర్శకుడు చూపుకుంటూ వెళతాడు. నీళ్లు చుక్క దొరకని ఆ దారిలో దాహానికి స్పృహ తప్పకుండా ఉండేందుకు పిల్లలు నున్నటి గులకరాయి తీసి బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటారు. ఈ సినిమాలో పదేళ్ల కొడుకు కూడా అలాగే చేస్తుంటాడు. కాని వాడి దగ్గర అప్పటికే చాలా గులకరాళ్లు పోగుపడి ఉంటాయి. అంటే తల్లి పారిపోవడం, తండ్రి వెళ్లి తిరిగి తేవడం, దారిలో ఈ పిల్లవాడు గులకరాయి చప్పరించడం ఆనవాయితీ అన్నమాట. కరువు ప్రాంతాల్లో మగవాళ్లు తీవ్రమైన అసహనంతో ఉంటే స్త్రీలు ఎలాగోలా చేసి, ఎలుకనో కుందేలునో పట్టుకుని ఏదో విధాన నాలుగు ముద్దలు వండి పెట్టడానికి పడే తాపత్రయాన్ని, నీళ్ల భారం మోయలేక వాళ్లు పడే అవస్థను దర్శకుడు చూపుతాడు. నటి నయనతార ఈ సినిమా చూసి దీని ఒక నిర్మాతగా మారడం విశేషం. ఆ విధంగా ఒక స్త్రీ ఈ స్త్రీల బాధను అర్థం చేసుకుందని భావించాలి. 2022 ఆస్కార్‌కు మన దేశం తరఫున అఫీషియల్ ఎంట్రీగా వెళ్లనున్న ఈ సినిమా నామినేషన్స్‌కు వెళ్లగలిగితే ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరిలో పోటీ పడవలసి వస్తుంది. అంటే నామినేషన్‌కు చేరుకుంటే తర్వాతి మెట్టు అవార్డు గెలవడమే. గతంలో మన దేశం నుంచి ‘మదర్ ఇండియా’, ‘సలాం బాంబే’, ‘లగాన్’, ‘జల్లికట్టు’, ‘గల్లీబాయ్’ సినిమాలు అఫీషియల్ ఎంట్రీగా వెళ్లాయి. కాని కొన్ని నామినేషన్స్ వరకూ చేరాయి. చూడాలి ఈసారి ఏం జరుగుతుందో. అన్నట్టు ‘కూళాంగల్’ గత సంవత్సరంగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితం అవుతోంది. భారతదేశంలో విడుదల కాలేదు. ఇప్పుడు వచ్చిన పేరు వల్ల ఈ డిసెంబర్లో రిలీజ్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్యాక్టరీలోని దారుణమైన చాకిరీకి, తక్కువ రాబడికి అసహనం పొంది తన తండ్రి తల్లిని కొడుతున్నట్టు కొడుక్కు అర్థం అవుతుంది ‘అమ్మ’ నవలలో. ఆ పరిస్థితులు మార్చడానికి అతడు బయలదేరుతాడు. నేడు కరోనా పరిస్థితుల్లో ఉద్యోగాలు పోయిన ఇళ్లల్లో అసహనం చోటు చేసుకోవడం సహజం. కాని అది స్త్రీల మీద హింసగా ఏ మాత్రం రూపాంతరం చెందకూడదు. హింసకు తావులేని అవగాహనే ఇప్పుడు భార్యాభర్తల మధ్య కావాల్సింది. ‘కూళాంగల్’ వంటి సినిమాలు చెబుతున్నది అదే. కరువు చాలా అసహనం ఇస్తుంది. అది మానవ సంబంధాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. కరువు ఉన్న ప్రాంతం పురుష పెత్తనం ఎక్కువగా ఉంటే ఆ హింస భరించడం స్త్రీల వంతు అవుతుంది. - ‘కూళాంగల్’ నిర్మాత నయనతార -
ఆస్కార్ బరిలో ‘విలేజ్ రాక్ స్టార్స్’
సినిమా పండగల్లో అతి పెద్ద పండగ ఆస్కార్ అవార్డుల పండగ. ప్రపంచంలో అన్ని ప్రాంతాల సినిమాలను కొలమానంగా భావించే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు. ఈ సంబరాలు జరిగేది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో అయినా హడావిడి సెప్టెంబర్ అక్టోబర్ నెలల నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే.. ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ పోటీకి బరిలో నిలిచే సినిమాలను ఆయా దేశాలు అనౌన్స్ చేస్తుంటాయి. ఈసారీ స్టార్ట్ అయింది. 2018కిగాను ఇండియన్ సినిమా తరఫున ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన చిత్రం ‘విలేజ్ రాక్‌స్టార్స్’ అని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. ‘విలేజ్ రాక్‌స్టార్స్’ ఒక అస్సామీ సినిమా. కొత్త దర్శకురాలు. పొదుపైన బడ్జెట్. సినిమా తీసింది చిన్న కెమెరాతోనే. మొత్తం దర్శకురాలు రీమా దాస్ స్వగ్రామమే. దాదాపు 28 సినిమాలు ఉన్న లిస్ట్‌లో, వచ్చే ఏడాది జరిగే ఆస్కార్స్‌కి ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మన దేశం తరఫున అఫీషియల్‌గా పంపబోతున్న సినిమా ‘విలేజ్ రాక్‌స్టార్స్’. ఈ సినిమా విషయానికి వస్తే.. రీమా దాస్ స్వీయ దర్శకత్వం వహించి, ఎడిటింగ్ చేసిన అస్సామీ చిత్రం. రీమా దాస్ ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ కూడా కాదు. సెల్ఫ్ మేడ్ ఫిల్మ్ మేకర్. ఈ ఏడాది వచ్చిన నేషనల్ అవార్డ్లోనూ ‘విలేజ్ రాక్‌స్టార్స్’ సత్తా చాటింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, చైల్డ్ ఆర్టిస్ట్, ఎడిటింగ్ వంటి పలు విభాగాల్లో అవార్డ్స్ గెలుచుకుంది. అంతేనా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా మంచి ప్రశంసలు పొందింది. కథ : ‘విలేజ్ రాక్‌స్టార్స్’ సినిమా కథ చాలా సింపుల్ లైన్స్‌లో ఉంటుంది. దును అనే చిన్నారి చయాగాన్ గ్రామంలో తన తల్లి, తమ్ముడుతో కలిసి ఉంటుంది. సంతలో అమ్మకు స్నాక్స్ అమ్మే పనిలో సాయంగా ఉంటుంది. ఒకసారి గ్రామంలో జరిగిన బ్యాండ్ పర్ఫార్మెన్స్ చూసి మంత్రముగ్ధురాలైన దును ఎలా అయినా గిటార్ కొనుక్కోవాలనుకుంటుంది. అట్లీస్ట్ సెకండ్ హ్యాండ్దైనా ఫర్వాలేదనుకుంటుంది. కామిక్ బుక్స్ చదివి తను కూడా ఓ బ్యాండ్ ఏర్పాటు చేయాలనుకుంటుంది. రూపాయి రూపాయి పోగేసుకుంటుంది. ఇంతలో వరదలు వారి పంటను పూర్తిగా నాశనం చేస్తాయి. అప్పుడు దునుకి తనకు ముఖ్యమైనదేంటో ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సందర్భంలో దును తెలివిగా ఏం చేసిందనేదే సినిమా కథ. దునుగా ప్లే చేసిన బన్నితా దాస్ ‘బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్’గా అవార్డు పొందింది. ఈ విలేజ్ రాక్‌స్టార్స్ మొత్తం దేశాన్నే తమ గ్రామం వైపు తిరిగేలా చేసింది. ఈ కథ ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. విశేషం ఏంటంటే.. అస్సామీ పరిశ్రమలో దాదాపు 29 ఏళ్ల తర్వాత జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం ఇది. ఆ రకంగా అస్సామీ పరిశ్రమకు ఈ సినిమా ఓ తీయని అనుభూతిని పంచితే, ఇప్పుడు ఏకంగా ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి ఎంపిక కావడం మరో మంచి అనుభూతిని మిగ్చిలింది. ‘‘ఓ వైపేమో ఆనంద భాష్పాలు మరోపక్క మనసు గర్వంతో నిండిపోయి ఉంది. చాలా వినయంగా ఈ ఎంట్రీని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ విషయం జీర్ణించుకోవడానికి కొంచెం సమయం పట్టేలా ఉంది’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు దర్శకురాలు రీమా దాస్. మరి మన దేశం తరఫున ఆస్కార్‌కు వెళ్తున్న ఈ చిత్రం ఆస్కార్ బృందాన్ని మెప్పించి, నామినేషన్ దక్కించుకుని, చివరికి అవార్డునూ సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. ఏది ఏమైనా అంత దాకా వెళ్లడమే గొప్ప విషయం. టైటిల్ విలేజ్ రాక్‌స్టార్స్ అయినా మొత్తం గ్లోబల్ విలేజ్ సెలబ్రేట్ చేసుకునే ఈ పండగలో తన సత్తా చాటితే మాత్రం చరిత్రే అవుతుంది. ఫారిన్ క్యాటగిరీలో హిందీ చిత్రం ‘మదర్ ఇండియా’ నుంచి ఆస్కార్ వైపు ఆశగా చూస్తున్న మనకు ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. గతేడాది ఆస్కార్‌కు అఫీషియల్ ఎంట్రీగా వెళ్లిన హిందీ చిత్రం ‘న్యూటన్’ నామినేషన్ దక్కించుకోలేకపోయింది. పోటీలో నిలిచిన 28 సినిమాలు ఆస్కార్ నామినేషన్స్‌కు భారతదేశం నుంచి ఫిల్మ్ ఫెడరేషన్ పరిగణనలోకి తీసుకున్నవి సుమారు 28 సినిమాలు ఉన్నట్టు సమాచారం. అందులో మన ‘మహానటి’, సంజయ్‌లీలా భన్సాలీ ‘పద్మావత్’, నందితా దాస్ ‘మంటో’, సూజిత్ సర్కార్ ‘అక్టోబర్’, లవ్సోనియే’ ప్యాడ్‌మ్యాన్, తుమ్బాద్ హల్కా, పీకు వంటి సినిమాలు ఫారిన్ క్యాటగిరీలో జరిగిన రేసులో పోటీపడ్డాయి. అవార్డు ఆస్కారం ఎప్పుడు? మన దేశం నుంచి ఆస్కార్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగానికి సినిమాలను పంపడం మొదలైంది 1957లో. అప్పటి నుంచి కేవలం మూడు సినిమాలు (మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్) మాత్రమే నామినేషన్ దక్కించుకున్నాయి. 1986లో నామినేషన్స్‌కు కె.విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ రేస్ వరకూ వెళ్లింది కానీ నామినేషన్ దక్కించుకోలేదు. అంతదాకా వెళ్లి, నామినేషన్ దక్కించుకున్నా అవార్డు వరకూ రాలేకపోతున్నాం. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’కి ఏఆర్ రెహమాన్, రసూల్ పూకుట్టి.. ఇలా మనవాళ్లు ఆస్కార్ తెచ్చినా, అది మన దేశం సినిమా కాదు. బ్రిటిష్ ఫిల్మ్ కింద వస్తుంది. రీమా దాస్ -
ఆస్కార్ రేసు... కాపీ కాన్సెప్ట్?
సాక్షి, ముంబై : భారత్ తరపున విదేశీ చిత్ర కేటగిరీలో బాలీవుడ్ చిత్రం ‘న్యూటన్’ స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ చిత్రం తాజాగానే ఇండియాలో రిలీజ్ కాగా, విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంను కాపీ చేశారంటూ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది . 2001లో వచ్చిన ఇరానియన్ చిత్రం సీక్రెట్ బాలెట్‌ను మక్కికి మక్కీ దించేశాడని చెప్పుకుంటున్నారు. అందుకు ఆయా రెండు చిత్రాల్లోని సన్నివేశాలను పోల్చేస్తున్నారు. రెండు చిత్రాలు కూడా ఎన్నికల నేపథ్యంలోనే తెరకెక్కినవే. పైగా ప్రధాన పాత్రలు ఎన్నికల అధికారి పాత్రలు పోషించాయి. వారికి తోడుగా ఓ సైనిక అధికారి ఉండటం అనే కామన్ పాయింట్ కూడా ఉంది. రెండింటిల్లోనూ కష్టాలు ఎదుర్కునే లీడ్ రోల్స్ కష్టాలను అధిగమించి విజయవంతంగా ఎన్నికలను నిర్వహిస్తాయి. ఇలా దాదాపు అన్నీ సిచ్యువేషన్లు, సీన్లు ఒకేలా ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఈ కాపీ కామెంట్లను న్యూటన్ చిత్ర దర్శకుడు అమిత్ మసుకర్ ఖండించారు. సినిమాను సీక్రెట్ బ్యాలెట్ నుంచి తాను కాపీ కొట్టలేదని, పైగా ప్రేరణ కూడా పొందలేదని ఆయన చెబుతున్నారు. ‘‘న్యూటన్ నేను సొంతంగా రాసుకున్న కథ. సినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి కొన్ని రోజుల ముందు నా స్నేహితుడొకరు సీక్రెట్ బ్యాలెట్ చిత్రం గురించి నాకు చెప్పాడు. యూట్యూబ్‌లో ఆ చిత్రం వీడియోలను చూస్తే ఆశ్చర్యం వేసింది. కాస్త పోలికలు ఉన్నప్పటికీ.. తేడాలను కూడా గమనించాను. అందులో లీడ్ పాత్ర మహిళ పోషించగా.. ఇక్కడ మాత్రం రాజ్ కుమార్ రావు పోషించారు. అక్కడ రొమాన్స్ ట్రాక్ ఉంటే.. ఇక్కడ లేదు. అయినప్పటికీ ఏదో ఒక రోజు ఇలాంటి విమర్శలు వినిపిస్తాయని నాకు తెలుసు. కానీ, ఏం చేయగలను? అలా జరిగిపోయింది’’ అని అమిత్ వివరణ ఇచ్చారు. -
ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి....మనం, మిణుగురులు
వచ్చే ఏడాదికి ఆస్కార్ అవార్డు ఎంట్రీల సందడి ఇప్పుడే మొదలైంది. మన దేశం నుంచి ఆస్కార్ అవార్డుకు ఎంట్రీగా ఏ సినిమాను పంపించాలనే దాని మీద ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ఉత్తమ విదేశీచిత్ర విభాగంలో ఆస్కార్ అవార్డు కోసం మన దేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపిక కావడానికి వివిధ భారతీయ భాషల నుంచి 30 సినిమాలు మన ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎఫ్.ఎఫ్.ఐ) స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చాయి. వీటిలో రెండు తెలుగు సినిమాలున్నాయి. ఒకటి - అక్కినేని నటించిన ఆఖరు సినిమా ‘మనం’ కాగా, రెండోది - నిజజీవిత అంధ విద్యార్థులతో అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి రూపొందించిన ‘మిణుగురులు’. ఇప్పటికే జాతీయ అవార్డును అందుకున్న బెంగాలీ చిత్రం ‘జతీశ్వర్’, మరాఠీ చిత్రం ‘ఫండ్రీ’, దర్శకుడు హన్సల్ మెహతా హిందీ ‘షాహిద్’లు కూడా స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చాయి. అలాగే, పాపులర్ సినిమాలైన ‘మర్దానీ’, ‘ఫిల్మిస్తాన్’, సంజయ్ లీలా భన్సాలీ ‘రామ్‌లీలా’, ప్రియాంకా చోప్రా నటించిన ‘మేరీ కోమ్’ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. తమిళం నుంచి రజనీకాంత్ యానిమేషన్ చిత్రం ‘కోచ్చడయాన్’, ‘కదై.. తిరైక్కదై.. వసనమ్... ఇయక్కమ్’ చిత్రాలు, ఇంకా కొంకిణి తదితర భాషా చిత్రాలు సైతం మన దేశం నుంచి ఆస్కార్ ఎంట్రీగా వెళ్ళాలని ఉత్సాహపడుతున్నాయి. ఎఫ్.ఎఫ్.ఐ. నియమించనున్న స్క్రీనింగ్ కమిటీ ఈ బుధవారం నుంచి ఈ చిత్రాలను వీక్షించి, మన దేశం పక్షాన పంపే తుది ఎంట్రీని ఖరారు చేయనుంది. ‘‘ఈ సినిమాల స్క్రీనింగ్‌లన్నీ హైదరాబాద్‌లో జరగనున్నాయి. అన్ని చిత్రాలనూ కమిటీ చూసి, ఈ నెల 23న తన తుది నిర్ణయాన్ని ఖరారు చేస్తుంది’’ అని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి (ఫిల్మ్ చాంబర్) వర్గాలు ‘సాక్షి’కి వివరించాయి.