ఆస్కార్‌ ఎంట్రీలో ఆర్‌ఆర్‌ఆర్‌.. రాజమౌళికి అరుదైన అవార్డు | Oscars nomination is almost confirmed for Rajamouli RRR | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ ఎంట్రీలో ఆర్‌ఆర్‌ఆర్‌.. రాజమౌళికి అరుదైన అవార్డు

Published Sun, Dec 4 2022 4:30 AM | Last Updated on Sun, Dec 4 2022 9:18 AM

Oscars nomination is almost confirmed for Rajamouli RRR - Sakshi

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఆస్కార్‌ నామినేషన్‌ ఎంట్రీ రేసులో ఉన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. కాగా ఈ చిత్రం ఎన్నో అవార్డులు రివార్డులు పొందింది. తాజాగా రాజమౌళికి ‘న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌’ బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డు దక్కింది.  గతంలో న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ వారు ప్రకటించిన 22మందిలో దాదాపు 16మందికి ఆస్కార్‌ నామినేషన్స్‌ వచ్చాయట.

అందుకే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి నామినేషన్‌ ఆస్కారం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ‘ఫర్‌ యువర్‌ కన్సిడరేషన్‌’ (సాధ్యం ఉన్న విభాగాల్లో) అంటూ ఈ చిత్రాన్ని ఆస్కార్‌ రేసుకి పంపింది ఈ చిత్రం యూనిట్‌. వచ్చే ఏడాది జనవరిలో నామినేషన్స్‌ ప్రకటన రానుంది, మార్చిలో అవార్డుల వేడుక జరగనుంది. ఇక ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం తరఫున గుజరాతీ ఫిల్మ్‌ ‘ఛెల్లో షో’ను ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement