ఆర్ఆర్ఆర్, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలను వెనక్కినెట్టి ఆస్కార్ బరిలో నిలిచిన గుజరాతీ చిత్రం 'ఛెల్లో షో'. ఆంగ్ల చిత్రం 'ది లాస్ట్ షో' రీమేక్‌గా వచ్చింది ఈ సినిమా. తొమ్మిదేళ్ల వయసులో సినిమాతో ప్రేమలో పడిన కుర్రాడి కథగా తెరకెక్కిన చిత్రం ‘ఛెల్లో షో’. దర్శకుడు పాన్ నలిన్ తెరకెక్కించిన ఈ సినిమా ఆస్కార్- 2023 పోటీలో నిలిచింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్‌డేట్ వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా నవంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సినీ ప్రియుల హృదయాల్ని హత్తుకున్న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.
(చదవండి: ఆస్కార్ నామినేషన్ చిత్రం ‘ఛెల్లో షో’ ట్రైలర్ విడుదల)
అసలు కథేంటంటే.. దర్శకుడు నలిన్ బాల్య జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కించారు. తొమ్మిదేళ్ల వయసులో సినిమాలకు ఎలా ఆకర్షితులయ్యారు? అనే కథాంశంతో రూపొందించారు. సినిమాల పట్ల ఎంతో ప్రేమ ఉన్న తొమ్మిదేళ్ల అబ్బాయి సామీ (భవిన్ రాబరి) ఎలా ఫిల్మ్‌మేకర్ అయ్యాడు? అన్నదే చిత్ర కథ. గుజరాత్‌లో గ్రామీణ వాతావరణం అప్పట్లో ఎలా ఉండేదో ఈ సినిమా ద్వారా నలిన్ కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమాలో భవిన్ రాబరి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావల్, పరేష్ మెహతా ప్రధాన పాత్రల్లో నటించారు.
WE HAVE AN ANNOUNCEMENT! 📣
— Netflix India (@NetflixIndia) November 21, 2022
An extraordinary cinematic experience, Last Film Show, India's Official Selection for Best International Feature Film at the 95th Oscars is streaming from Nov 25 in Hindi & Gujarati on Netflix! 🤩 pic.twitter.com/NgzeHYV1YU
Comments
Please login to add a commentAdd a comment