
రీమాదాస్
అస్సామీ చిత్రం ‘విలేజ్ రాక్‌స్టార్స్’ విదేశీ విభాగంలో భారతదేశం తరఫున 91వ ఆస్కార్స్ అవార్డ్స్ నామినేషన్ పోటీకి ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మరింత ప్రమోట్ చేయడానికి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు సినీ ప్రముఖులు తమకు ఆర్థికంగా చేయూతనందించాలని కోరుతున్నారు చిత్రదర్శకురాలు రీమాదాస్. ‘‘విలేజ్ రాక్‌స్టార్స్ చిత్రాన్ని 30 లక్షల బడ్జెట్‌లో పూర్తి చేశాం. ఈ సినిమాను హాలీవుడ్ ప్లాట్‌ఫామ్‌పై ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. విమర్శకులకు స్పెషల్ షోలు వేయాలి. ఇలా చేయాలంటే కనీసం 5 కోట్లు ఖర్చవుతుందట.
అంత ఖర్చుతో నేనెలా ప్రమోట్ చేయగలను? అస్సాం ప్రభుత్వం వారు కోటి రూపాయలు ప్రకటించారు. కానీ టాక్సులు పోగా 68 లక్షలు మాత్రమే వస్తాయి. నవంబర్‌లో ఆస్కార్స్‌కు సంబంధించి లాస్ ఏంజిల్స్‌లో మూవీ ప్రమోషన్ పనులు ఊపందుకుంటాయి. నా చిత్రబృందాన్ని లాస్ ఏంజిల్స్ తీసుకెళ్లి, అక్కడే కొన్నిరోజులు స్టే చేయాలంటే భారీగా ఖర్చు అవుతుంది. బాలీవుడ్ స్టార్స్‌ని ఆర్థిక సహాయం అడుగుతున్నాను... ప్రపంచ వేదికపై ‘విలేజ్ రాక్‌స్టార్స్’ నిలబడేందుకు సహాయం చేయండి’’ అని పేర్కొన్నారు రీమాదాస్.
Comments
Please login to add a commentAdd a comment