ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ పోటీలో చదువుకోవాలి
ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ పోటీలో చదువుకోవాలి
Published Tue, Sep 3 2013 12:48 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
విద్యపై సమాజంలో చైతన్యం తెచ్చే కథాంశంతో స్వీయదర్శకత్వంలో మద్దాళి వెంకటే శ్వరరావు నిర్మించిన చిత్రం ‘చదువుకోవాలి’. ఈ చిత్రానికి ఇప్పటికే పలు అవార్డులు లభించాయి. ఇంకా పలు ప్రతిష్టాత్మక చిత్రోత్సవాలకు కూడా పంపించనున్నారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల నామినేషన్ ఎంట్రీ పోటీలో ఈ చిత్రం నిలవడం విశేషం.
దేశ వ్యాప్తంగా వచ్చిన సుమారు ఇరవై చిత్రాలను పరిశీలించి, అర్హత ఉన్నవాటిని ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి పంపిస్తారు. ఈ నెల 17న ఈ చిత్రాల ప్రదర్శన ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు చిత్రరంగ ప్రముఖులు వివిధ భాషల నుంచి వచ్చిన చిత్రాలను వీక్షించి, నామినేషన్‌కి పంపిస్తారు. వీటిలో ‘చదువుకోవాలి’ ఉండటం తెలుగు ప్రజలకు గర్వకారణం అని దర్శక, నిర్మాత చెబుతూ
-‘‘ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ బరిలో మా చిత్రం నిలవడం ఆనందంగా ఉంది. ఎంట్రీ వరకూ వెళ్లడమే గొప్ప విషయం. ఇంకా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల పోటీ కోసం ఈ చిత్రం వెళ్లనుంది’’ అని చెప్పారు.
Advertisement
Advertisement