Oscar ceremony
-
‘బార్బెన్‌హైమర్’ పోరు ఖరారు!
గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు కురిపించిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ‘ఒప్పెన్‌హైమర్’, దర్శకురాలు గ్రెటా గెర్విగ్ ‘బార్బీ’ చిత్రాలు ఆస్కార్ అవార్డ్స్‌లోనూ పో టీలో నిలిచాయి. 96వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్లు మంగళవారం సాయంత్రం (భారతీయ కాలమాన ప్రకారం) వెలువడ్డాయి. 23 విభాగాల్లోని ప్రధాన విభాగాల్లో ‘ఒప్పెన్‌హైమర్’కు 13 నామినేషన్లు దక్కగా, ‘బార్బీ’ ఎనిమిది నామినేషన్లను సొంతం చేసుకుంది. నామినేషన్ల జాబితాను నటుడు జాక్ క్వైడ్, నటి జాజీ బీట్జ్ ప్రకటించారు. ఇంకా అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న చిత్రాల్లో 11 నామినేషన్లతో యోర్గోస్ లాంతిమోస్ దర్శకత్వం వహించిన ‘పూర్ థింగ్స్’, పది నామినేషన్లతో మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వం వహించిన ‘కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’, ఏడు నామినేషన్లతో ‘మేస్ట్రో’ ఉన్నాయి. ఉత్తమ చిత్రం విభాగంలో ‘ఒప్పెన్‌హైమర్’, ‘బార్బీ’ పో టీ పడుతుండటంతో ‘ఇది బార్బెన్‌హైమర్ పో రు’ అని హాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఉత్తమ దర్శకుల విభాగంలో ‘బార్బీ’ దర్శకురాలు గ్రెటా గెర్విగ్కి నామినేషన్ దక్కుతుందనే అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఆమె నామినేట్ కాకపో వడం ఆశ్చర్యానికి గురి చేసిందని హాలీవుడ్ అంటున్న మాట. కానీ ఇదే చిత్రానికి సహాయ నటి విభాగంలో అమెరికా ఫెర్రెరాకి దక్కడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫెర్రెరాకి నామినేషన్ దక్కుతుందనే కనీస అంచనాలు లేకపో వడమే ఈ ఆశ్చర్యానికి కారణం. అలాగే ‘బార్బీ’లో టైటిల్ రోల్ చేసిన మార్గెట్ రాబీకి ఉత్తమ నటి నామినేషన్ దక్కకపో వడం ఘోరం అనే టాక్ కూడా ఉంది. ఇక దర్శకుల విభాగంలో గ్రెటా గెర్విగ్కి దక్కకపో యినప్పటికీ ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ చిత్రదర్శకురాలు జస్టిన్ ట్రైట్కి దక్కడంతో ఈ కేటగిరీలో ఓ మహిళ ఉన్నట్లు అయింది. ఇక మార్చి 10న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో (భారత కాలమానం ప్రకారం మార్చి 11) ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. మూడేళ్లుగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన జిమ్మీ కెమ్మెల్ ఈసారి కూడా ఆ బాధ్యతను నిర్వర్తించనున్నారు. ఇదిలా ఉంటే గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ (‘నాటు నాటు...’ పాటకు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ అవార్డు), బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డు దక్కించుకుని, భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటాయి. ఈసారి దేశం నుంచి ఏ సినిమా పో టీలో లేదు. అయితే కెనడాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన నిషా పహుజా దర్శకత్వం వహించిన కెనెడియన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘టు కిల్ ఏ టైగర్’కి నామినేషన్ దక్కింది. ఉత్తమ చిత్రం: అమెరికన్ ఫిక్షన్ అటానమీ ఆఫ్ ఎ ఫాల్ బార్బీ ది హోల్డోవర్స్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ మేస్ట్రో ∙ఒప్పెన్‌హైమర్ పాస్ట్ లైవ్స్ ∙పూర్ థింగ్స్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉత్తమ దర్శకుడు: అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రైట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: మార్టిన్ స్కోర్సెస్ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్ పూర్ థింగ్స్: యోర్గోస్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లేజర్ ఉత్తమ నటుడు: బ్రాడ్లీ కూపర్: మేస్ట్రో కోల్మన్ డొమింగో: రస్టిన్ పాల్ జియామటి: ది హోల్డోవర్స్ కిలియన్ మర్ఫీ: ఒప్పెన్ హైమర్ జెఫ్రీ రైట్: అమెరికన్ ఫిక్షన్ ఉత్తమ నటి: అన్నెతే బెనింగ్: నయాడ్ లిల్లీ గ్లాడ్‌స్టోన్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సాండ్రా హూల్లర్: అటానమీ ఆఫ్ ఎ ఫాల్ కెర్రీ ములిగన్: మేస్ట్రో ఎమ్మా స్టోన్: పూర్ థింగ్స్ ఏ 91 ఏళ్ల కంపో జర్ జాన్ విల్లియమ్స్ 54వ నామినేషన్ దక్కించుకున్నారు. ‘ఇండియా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ చిత్రానికి గాను ఆయనకు నామినేషన్ దక్కింది. అత్యధిక సార్లు నామినేషన్ దక్కించుకున్న సంగీతదర్శకుడిగా ఆయన రికార్డ్ సాధించారు. ఇప్పటికే ఐదు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న జాన్‌కి ఈ చిత్రం కూడా ఆస్కార్ తెచ్చి, ఆనందపరుస్తుందా అనేది చూడాలి ఏ ఈ ఏడాది నామినేషన్స్ 61 ఏళ్ల జోడీ ఫాస్టర్ని మళ్లీ పో టీలో నిలబెట్టాయి. 29 ఏళ్ల తర్వాత ‘నయాడ్’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటి విభాగంలో ఆమె నామినేషన్ దక్కించుకున్నారు. అంతకు ముందు ‘నెల్’ చిత్రానికిగాను 1995లో ఆమెకు నామినేషన్ దక్కింది. కాగా ‘ది అక్యూస్డ్’, ‘ది సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్’ చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డులు అందుకున్నారు జోడీ. ఇప్పుడు సహాయ నటి అవార్డును ఇంటి తీసుకెళతారా చూడాలి ఏ 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో దర్శకుడు మార్టిన్ ఏ స్కోర్సెస్కి ఉత్తమ దర్శకుడిగా నామినేషన్ దక్కింది. దర్శకుడిగా పది నామినేషన్లు దక్కించుకుని, ప్రస్తుతం జీవించి ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు సొంతం చేసుకున్నారు. ఉత్తమ దర్శకునిగా స్టీవెన్ స్పీల్బర్గ్ తొమ్మిది నామినేషన్స్ దక్కించుకున్నారు. అయితే ఇప్పటివరకు పది సార్లు నామినేషన్ దక్కించుకున్న మార్టిన్‌కు ఒక ఆస్కార్ అవార్డు మాత్రమే దక్కింది. 2006లో వచ్చిన ‘డిపార్టెడ్’ సినిమాకు అవార్డు అందుకున్నారు మార్టిన్. ఇదిలా ఉంటే.. తొమ్మిదిసార్లు నామినేట్ అయినప్పటికీ రెండు సార్లు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నారు స్టీవెన్ సీల్బర్గ్. ఉత్తమ దర్శకుడి విభాగంలో విలియమ్ వైలర్ 12 నామినేషన్స్ దక్కించుకుని రికార్డు సొంతం చేసుకున్నారు.. అలాగే మూడు ఆస్కార్ అవార్డులు సాధించారు. అయితే ప్రస్తుతం ఆయన జీవించి లేరు. -
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక.. ఈ ఏడాది బరిలో నిలిచిన చిత్రాలివే!
గతేడాదిలో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు మన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కింది. అలాగే ది ఎలిఫెంట్ విష్పర్స్ అనే డాక్యుమెంటరీ సిరీస్ సైతం ప్రతిష్ఠాత్మక అవార్డ్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాదికి సంబంధించి ఆస్కార్ అవార్డుల వేడుకకు సమయం ఆసన్నమైంది. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక లాగే లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరగనుంది. మార్చి 10, 2024న ఈ ఏడాది ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేట్ అయిన చిత్రాలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించిన ఆస్కార్ అకాడమీ.. బరిలో నిలిచిన చిత్రాల జాబితాను వెల్లడించింది. 2024 ఆస్కార్ అవార్డుల కోసం వివిధ కేటగిరీల్లో పోటీ పడే చిత్రాల జాబితాను అకాడమీ ప్రకటించింది. ఈ ఏడాది కూడా వరుసగా నాలుగోసారి జిమ్మీ కిమ్మెల్ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. ఇండియా నుంచి ఆస్కార్ పోటీలో ‘టు కిల్ ఏ టైగర్’ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్‌కు ‘టు కిల్ ఏ టైగర్’ చిత్రం నామినేట్ అయింది. భారత్‌లోని ఓ గ్రామంలో చిత్రీకరణ జరుపుకున్న ‘టు కిల్ ఏ టైగర్’ ఆస్కార్ బరిలో నిలిచింది. నిషా పహుజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా.. గతేడాది ఇండియాకు రెండు ఆస్కార్ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. 2024లో వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలివే! ►ఉత్తమ చిత్రం విభాగం అమెరికన్ ఫిక్షన్ అటానమీ ఆఫ్ ఎ ఫాల్ బార్బీ ది హోల్డోవర్స్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ మేస్ట్రో ఒప్పైన్ హైమర్ పాస్ట్ లైవ్స్ పూర్ థింగ్స్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ►ఉత్తమ దర్శకుడి విభాగం అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: మార్టిన్ స్కోర్స్ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్ పూర్ థింగ్స్: యోర్గోస్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లేజర్ ►ఉత్తమ నటుడు విభాగం బ్రాడ్లీ కూపర్: మేస్ట్రో కోల్మన్ డొమింగో: రస్టిన్ పాల్ జియామటి: ది హోల్డోవర్స్ కిలియన్ మర్ఫీ: ఒప్పైన్ హైమర్ జెఫ్రీ రైట్: అమెరికన్ ఫిక్షన్ ►ఉత్తమ నటి విభాగం అన్నెతే బెనింగ్: నయాడ్ లిల్లీ గ్లాడ్‌స్టోన్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సాండ్రా హూల్లర్: అటానమీ ఆఫ్ ఎ ఫాల్ కెర్రీ ములిగన్: మేస్ట్రో ఎమ్మాస్టోన్: పూర్ థింగ్స్ ►ఉత్తమ సహాయ నటుడు స్టెర్లింగ్ కె. బ్రౌన్ : అమెరికన్ ఫిక్షన్ రాబర్ట్ డినోరో: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ రాబర్ట్ డౌనీ జూనియర్: ఒప్పైన్ హైమర్ రేయాన్ గాస్లింగ్: బార్బీ మార్క్ రఫెలో: పూర్ థింగ్స్ ► ఉత్తమ సహాయ నటి ఎమిలీ బ్లంట్: ఒప్పైన్ హైమర్ డానియల్ బ్రూక్స్: ది కలర్ పర్పుల్ అమెరికా ఫెర్రారా: బార్బీ జోడీ ఫాస్టర్: నయాడ్ డేవైన్ జో రాండాల్ఫ్: ది హోల్డోవర్స్ ►బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్, ఆర్థర్ హరారీ ది హోల్డోవర్స్: డేవిడ్ హేమింగ్సన్ మేస్ట్రో: బ్రాడ్లీ కూపర్, జోష్ సింగర్ మే డిసెంబర్: సామీ బరుచ్, అలెక్స్ మెకానిక్ పాస్ట్ లివ్స్: సీలింగ్ సాంగ్ ►బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ది ఫైర్ ఇన్సైడ్: ఫ్లామిన్ హాట్ ఐయామ్ జస్ట్ కెన్: బార్బీ ఇట్నెవ్వర్ వెంట్ అవే: అమెరికన్ సింఫనీ వజాజీ (ఏ సాంగ్ ఫర్ మై పీపుల్): కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్: బార్బీ ►బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అమెరికన్ ఫిక్షన్ ఇండియా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ కిల్లర్స్ ఆఫ్‌ది ఫ్లవర్ మూన్ ఒప్పైన్ హైమర్ పూర్ థింగ్స్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ బాబీ వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్ ది ఇటర్నల్మెమెరీ ఫోర్ డాటర్స్ టు కిల్ ఏ టైగర్ 20 డేస్ ఇన్ మరియా పోల్ ►బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్ ది ఏబీసీస్ఆఫ్ బుక్ బ్యానింగ్ ది బార్బర్ ఆఫ్ లిటిల్ రాక్ ఐలాండ్ ఇన్ బిట్విన్ ది లాస్ట్ రిపేష్ షాప్ నైనాయ్ అండ్ వైపో ►బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఇయల్కాపిటానో (ఇటలీ పర్ఫెక్ట్ డేస్ (జపాన్) సొసైట్ ఆఫ్ ది స్నో (స్పెయిన్) ది టీచర్స్ లాంజ్ (జర్మనీ) ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ ( యూకే) ► బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే అమెరికన్ ఫిక్షన్: కార్డ్ జెఫర్సన్ బార్బీ: గ్రెటా గెర్విక్, నొవా బాంబాక్ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్ పూర్ థింగ్స్: టోనీ మెక్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లాజర్ ►బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ అటానమీ ఇఫ్ ఎ ఫాల్: లారెంట్ ది హోల్డోవర్స్: కెవిన్ టెంట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: తెల్మా స్కూన్మేకర్ ఒప్పైన్ హైమర్: జెన్నిఫర్ లేమ్ పూర్ థింగ్స్: యోర్గోస్ ►బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ బార్బీ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ నెపోలియన్ ఓపెన్‌హైమర్ పూర్ థింగ్స్ ►బెస్ట్ సౌండ్ ది క్రియేటర్ మ్యాస్ట్రో మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1 ఒప్పైన్ హైమర్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ► ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ది క్రియేటర్ గాడ్జిల్లా మైనస్ వన్ గార్డియన్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్3 మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1 నెపోలియన్ ►బెస్ట్ సినిమాటోగ్రఫీ ఎల్కాండే : ఎడ్వర్డ్ లచ్మెన్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: రోడ్రిగో ప్రిటో మ్యాస్ట్రో: మాథ్యూ లిబ్టాక్యూ ఒప్పైన్ హైమర్: హైతీ వాన్ హోతిమా పూర్ థింగ్స్: రాబిన్ రియాన్ ► బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ జాక్వెలిన్ దురన్: బార్బీ జాక్వెలిన్ వెస్ట్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ జాంటీ ఏట్స్, డేవ్ క్రాస్‌మన్: నెపోలియన్ ఎలెన్ మిరాజ్నిక్: ఒప్పెన్ హైమర్ హాలీ వాడింగ్టన్: పూర్ థింగ్స్ ► బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ గోల్డా మాస్ట్రో ఓపెన్‌హైమర్ పూర్ థింగ్స్ సొసైటీ ఆఫ్ ది స్నో ► బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ది ఆఫ్టర్ ఇన్విన్సిబుల్ నైట్ ఆఫ్ ఫార్చ్యూన్ రెడ్, వైట్ అండ్ బ్లూ ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ సుగర్ ► బెస్ట్ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ లెటర్ టు ఎ పిగ్ నైంటీ- ఫైవ్ సెన్సెస్ అవర్ యూనిఫామ్ ప్యాచిడమ్ వార్ ఈజ్ ఓవర్! -
ఆస్కార్‌ను జయించింది
స్వీటీ... ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తరువాత ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహిస్తోన్న ‘ఉమెన్స్ ఫిల్మ్ యూనిట్’లో కొన్నేళ్లపాటు పాటు పనిచేసింది. లైంగిక దాడిపై కథను రాసి ‘ఆఫ్టర్ అవర్స్’ సినిమాను తీసింది. ఒకపక్క సినిమాలు తీస్తూనే టెలివిజన్ రంగంలో అడుగుపెట్టింది. డ్యాన్సింగ్ డేజ్ అనే షో, ఎపిసోడ్ డైరెక్టర్‌గానూ, ఇతర షోల సీరీస్‌లను విజయవంతంగా నడిపించింది. జెయిన్ సినిమాల్లో మహిళ కేంద్రబింధువుగా ఉంటుంది. 1989లో తొలిసారి ‘స్వీటీ’ అనే ఫీచర్ ఫిల్మ్ తీసింది. ఈ సినిమా ఆద్యంతం మంచి కామెడీతో సాగడంతో ప్రేక్షకాదరణ పొంది అనేక అవార్డులను గెలుచుకుంది. బాల్యంలో దాదాపు చిన్నారులంతా అమ్మమ్మ, బామ్మ, తాతయ్యల దగ్గర కథలు వింటూ పెరుగుతారు. వయసు పెరిగే కొద్దీ చదువులు, ఆటల్లో పడిపోయి విన్న కథలను మర్చిపోతారు. పెద్దయ్యాక కెరీర్‌ను అందంగా మలుచుకోవడంలో మునిగిపోయి పూర్తిగా కథలను వదిలేస్తారు. అందరిలా చిన్నారి జెయిన్ చిన్నప్పుడు విన్న కథలను వదల్లేదు. అందరికంటే భిన్నంగా ఆలోచించే జెయిన్ తను విన్న కథలు, చదివిన కథలను మరింత లోతుగా ఊహించుకుంటూ పెరిగింది. పెద్దయ్యాక ఆ కథలకు తన ఊహా శక్తిని జోడించి ఏకంగా అవార్డు తెచ్చిపెట్టే సినిమాలు తీసి మంచి దర్శకురాలిగా ఎదిగింది. జెయిన్ మరెవరో కాదు.. రెండు సార్లు ఆస్కార్‌కు బెస్ట్ డైరెక్టర్‌గా నామినేట్ అయ్యి.. ఆదివారం జరిగిన ఆస్కార్ వేడుకల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకున్న మూడో మహిళా దర్శకురాలే 67 ఏళ్ల జెయిన్ క్యాంపియన్. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్లో 1954 ఏప్రిల్ 30న రిచర్డ్ క్యాంపియన్, ఎడిత్ ఆర్మ్‌స్ట్రాంగ్ దంపతులకు జెయిన్ క్యాంపియన్ జన్మించింది. రిచర్డ్ థియేటర్ డైరెక్టర్, ఎడిత్ నటి. వీరికి ముగ్గురు సంతానం. రెండో కూమార్తె జెయిన్ క్యాంపియన్ పూర్తిపేరు ఎలిజిబెత్ జెయిన్ క్యాంపియన్. చిన్నప్పుడు అందరిలా కథలు వింటూ పెరిగింది జెయిన్. స్కూల్లో ఉండగా అనేక కథల పుస్తకాలను చదివేది. ఇంట్లో సినిమా, నటనా వాతావరణం ఉండడంతో సహజంగానే నటన వైపు ఆకర్షితురాలైంది జెయిన్. కానీ నటనను కెరీర్‌గా ఎంచుకోలేదు. విక్టోరియా యూనివర్సిటీలో స్ట్రక్చరల్ ఆంథ్రోపాలజీలో డిగ్రీ పూర్తిచేసిన తరువాత పెయింటింగ్ ప్రధాన సబ్జెక్టుగా మరో డిగ్రీ చేసింది. డిగ్రీ చేసిన తరువాత తన ఆసక్తి దర్శకత్వంవైపు మళ్లింది. దీంతో వెనిస్ వెళ్లి ఆర్ట్స్‌లో కోర్సు చేసింది. తర్వాత లండన్‌లోని డాక్యుమెంటరీలు, కమర్షియల్ సినిమాలు తీసే ఓ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరింది. అసిస్టెంట్‌గా పనిచేస్తూనే చెల్సియా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చదివింది. తరువాత సిడ్నీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిప్లొమా చేసింది. ఈ డిప్లొమా అయ్యాక సినిమా రంగంలో అడుగు పెట్టింది. 1980లో తొలిసారి ‘టిష్యూస్’ పేరిట ఓ లఘు చిత్రం తీసింది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో మరుసటి ఏడాది ఆస్ట్రేలియన్ ఫిల్మ్ టెలివిజన్, రేడియో స్కూల్లో చేరి రచయిత, దర్శకురాలు, ఎడిటర్‌గా అన్నీ తానై తండ్రి కొడుకుపై చూపించే క్రమశిక్షణ, బాధ్యతల్లో ఇద్దరు పడే సంఘర్షణను ‘పీల్’(1982) పేరిట సినిమా తీసింది. దీని తరువాత అమ్మాయిల ఫ్యాషన్‌పై రెండో సినిమా, అన్నా చెల్లెళ్ల బంధంపై మూడో సినిమాను నిర్మించింది. పీల్ సినిమాకు 1986లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘పామ్ డి ఓర్’ అవార్డు వచ్చింది. తొలిఆస్కార్ నామినేషన్ 1993లో ‘ద పియానో’ సినిమా తీసింది జెయిన్. ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ఫెస్టివల్ల్లో ‘పామ్ డీఓర్’ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డు గెలుచుకున్న తొలి మహిళగా జెయిన్ నిలిచింది. ఈ అవార్డుతోపాటు ‘బెస్ట్ యాక్టర్, బెస్ట్ సహాయ నటి’ అకాడమీ అవార్డులను ఈ సినిమా గెలుచుకోవడం విశేషం. ఈ సినిమాకు జెయిన్ ఆస్కార్ బెస్ట్ డైరెక్టర్ అవార్డుకి నామినేట్ అయినప్పటికీ, స్పీల్బర్గ్ బెస్ట్ డైరెక్టర్‌గా నిలవడంతో జెయిన్కు అవార్డు రాలేదు. కానీ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే అవార్డు దక్కించుకుంది జెయిన్. జెయిన్ దర్శకత్వం వహించిన టాప్ ఫైవ్ సినిమాలలో.. ద పియానో, యాన్ ఏంజిల్ ఎట్ మై టేబుల్, బ్రైట్ స్టార్, స్వీటీ, ద పోర్టరేట్ ఆఫ్ ఏ లేడీలు ఉన్నాయి. ప్రస్తుతం రెండోసారి 94వ ఆస్కార్ అవార్డులకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు నామినేట్ అయ్యి ‘ద పవర్ ఆఫ్ ది డాగ్’ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకుంది. తొలిసారి 2010లో క్యాథరిన్ బిగెలో ‘హర్ట్ లాకర్’ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకుని తొలి మహిళా డైరెక్టర్‌గా రికార్డు సృష్టించింది. గతేడాది ‘నోమాడ్ ల్యాండ్’ సినిమాకు గాను క్లో జావో ఆస్కార్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకోని రెండో మహిళగా నిలిచింది. ఇప్పుడు జెయిన్ మూడో బెస్ట్ డైరెక్టర్‌గా నిలిచారు. -
అందరి సమక్షంలో ఆస్కార్
అదే వేదిక. అదే వేడుక. సంబరాల్లో పెద్ద మార్పులు లేవు. ఆస్కార్ వేడుకలు ఎప్పటిలానే జరగనున్నాయి. కోవిడ్ వల్ల సినిమాల విడుదలలు, ఫిల్మ్ ఫెస్టివల్స్ అన్నీ వాయిదా పడ్డాయి. కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్‌ను వర్చువల్ (ఆన్లైన్)గా నిర్వహించారు. ఆస్కార్ వేడుక కూడా వర్చువల్‌గా జరుగుతుందని చాలామంది అనుకున్నారు. కానీ ఎప్పటిలానే వేడుకలు జరుగుతాయని నిర్వాహకులు స్పష్టం చేశారు. 93వ ఆస్కార్ వేడుక వచ్చే ఏడాది ఏప్రిల్ 25న జరగనుంది. సాధారణంగా ఆస్కార్ పండగను ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 28న ఈ వేడుక నిర్వహించాలని ముందు అనుకున్నారు. అయితే కోవిడ్ వల్ల ఓ రెండు నెలలు వాయిదా వేశారు. ఇప్పుడు కూడా పరిస్థితి పెద్దగా మారినట్టేం లేదు. దాంతో మిగతా చలన చిత్రోత్సవాల్లా ఆస్కార్‌ను కూడా ఆన్లైన్లో చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే కోవిడ్ మార్గదర్శకాలతో పూర్తి స్థాయిలోనే ఈ వేడుకను నిర్వహించే ఆలోచనలో ఆస్కార్ అవార్డు కమిటీ ప్లాన్ చేస్తోంది. ఆస్కార్ ఫంక్షన్‌ను లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో నిర్వహిస్తారు. దీని సీటింగ్ కెపాసిటీ 3,400. మరి ఇంతమందిని ఒక దగ్గరకు తీసుకువచ్చి వేడుక నిర్వహిస్తారా? లేదా ఏదైనా కొత్త పద్ధతిలో వేడుక నిర్వహించే ఆలోచనలో ఉన్నారో చూడాలని ఓ హాలీవుడ్ మేగజీన్ రాసుకొచ్చింది. ఒకవేళ అవార్డు నామినేషన్ దక్కినవాళ్లందర్నీ పిలిచి ఈ వేడుక నిర్వహించాలని ఆలోచించినా ఓ చిక్కు ఉంది. ఈసారి ఆస్కార్ నామినేషన్ల రేస్ (ఇంకా ప్రకటించలేదు. కేవలం ఊహాగానాలు)లో ఉన్న యాక్టర్స్‌లో చాలామంది 70 ఏళ్లకు మించిన వాళ్లు ఉన్నారు. వాళ్లందరూ వేడుకకు రావడానికి ఆసక్తి చూపిస్తారా? అనే సందేహం ఆస్కార్ అవార్డు కమిటీకి ఉండొచ్చు. ఇక ఆస్కార్ వేడుకకు ముందు హాలీవుడ్లో ఓ నాలుగు అవార్డు (గోల్డెన్ గ్లోబ్స్, క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్, బాఫ్టా, ఎస్ఎజి) ఫంక్షన్లు జరగనున్నాయి. ఈ వేడుకల జరిగే తీరును బట్టి ఆస్కార్ అవార్డుల వేడుకలో మార్పులు చేర్పులకు అవకాశం ఉందని హాలీవుడ్ అంటోంది.‘‘ప్రస్తుతానికి మేం ఉన్న ఆప్షన్స్ అన్నీ చూస్తున్నాం. కానీ ఆస్కార్‌ను అందరి సమక్షంలోనే చేయడానికి ఆలోచిస్తున్నాం’’ అని ఆస్కార్ ప్రతినిధులు అంటున్నారు. వాయిదా నాలుగోసారి... సాధారణంగా జనవరి నెల నుంచి ఆ ఏడాది చివరి వరకూ థియేటర్స్‌లో విడుదలయ్యే చిత్రాలకు ఆస్కార్ పోటీలో నిలబడే అర్హత ఉంటుంది. కానీ ఈసారి 2020 జనవరి నుంచి 2021 ఫిబ్రవరి వరకూ విడుదలయ్యే సినిమాలు కూడా ఆస్కార్ రేసులో అర్హత పొందుతాయి. ఇలా రెండు సంవత్సరాల్లో విడుదలయ్యే సినిమాలను ఆస్కార్ వేడుకకు పరిశీలించడం గత 85 ఏళ్లలో ఇదే తొలిసారి. అలానే థియేటర్స్‌లో విడుదల కాకపోతే ఆస్కార్‌కు సినిమాను పంపలేం. కోవిడ్ వల్ల ఈ నిబంధనను కూడా తప్పించింది అకాడమీ. అకాడమీ చరిత్రలో అవార్డులు వేడుక పోస్ట్‌పోన్ అవ్వడం ఇది నాలుగోసారి. గత నెలలో ఎమ్మీ అవార్డులు మొత్తం వర్చువల్‌గా జరిగాయి. లాస్ ఏంజెల్స్‌లో ఈ వేడుక జరిగింది. వేదిక మొత్తం ఖాళీ. ఆవార్డు నామినేషన్ పొందిన వాళ్లంతా ఎవరింట్లో వాళ్లు ఉండి ఆన్లైన్లో ఈ వేడుకలో పాల్గొన్నారు. అంతకు ముందు జరిగిన వెన్నిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అతి తక్కువమంది పాల్గొన్నారు. ఎప్పుడూ పాల్గొనేవారి కన్నా సంఖ్యలో సగంకన్నా తక్కువమంది హాజరయ్యారు. -
ఫిల్మ్‌ఫేర్‌లో ఆస్కార్ గౌను
ఆస్కార్ వేడుకల్లో ఎరుపు రంగు తివాచీ రిచ్‌గా కనిపిస్తుంది. ఆ తర్వాతి ‘రిచ్’దనమంతా నటీమణుల ఎర్ర గౌన్లదే. ఇటీవలి మన ఫిల్మ్‌ఫేర్ సినిమా అవార్డుల వేడుకల్లో కూడా ఆస్కార్ కళ కనిపించింది! కొంచెం వాళ్లని ఫాలో అయినట్లున్నారు మనవాళ్లు. గౌహతిలోని ఇందిరాగాంధి అథ్లెటిక్ స్టేడియంలో జరిగిన ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవానికి నటి ఊర్వశీ రౌటేలా ఎర్రరంగు గౌను వేసుకుని వచ్చారు. ఒక్కక్షణం అక్కడివారికి ఇది హాలీవుడ్డో, బాలీవుడ్డో అర్థం కాలేదు. ఊర్వశి వేసుకొచ్చిన గౌను వేదికకు ఆస్కార్ కళను తెప్పించింది. ఆ గౌనుతో ఆడియెన్స్ మధ్యలో కూర్చోడానికి ఆమెకు నాలుగు సీట్లు అవసరం అయ్యాయి. ఆమెకు ఒక సీటు, ఆమె గౌను అంచులు మడతలు పడకుండా ఉండేందుకు మూడు సీట్లు! కూర్చున్నాక అంతపెద్ద గౌను ఎక్కడో ఒకచోట మడత పడకుండా ఉంటుందా? ఆ మడతల్ని సరిచేయడానికి ఒక టీము. గౌనుకు ఎంత ఖర్చయిందో తెలీదు కానీ.. గౌన్ కుట్టడానికి మాత్రం 730 గంటలు పట్టిందట! అంటే నెలకు పైగానే. ఈ వివరాలన్నీ అప్పుడు బయటికి రాలేదు. ఈవెంట్ అయ్యాక కాస్త ఆలస్యంగా బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో గౌను విశేషాలన్నిటినీ కుప్పపోశారు ఊర్వశి. ఊర్వశి హరిద్వార్ అమ్మాయి. వయసు 25. ఏడేళ్లుగా సినిమాల్లో ఉన్నారు. తొలి సినిమా ‘సింగ్ సాబ్ ది గ్రేట్’. ఇటీవలి సినిమా ‘పాగల్‌పంతీ’. మధ్యలో ఏడు సినిమాలు. ఈసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానంలో ప్రతిభను పక్కన పెట్టారన్న విమర్శలు చాలా వచ్చాయి. వాటి గురించి ఊర్వశి ఏమీ మాట్లాడడం లేదు. అవార్డొచ్చి, ఆ అవార్డును తీసుకోడానికి వెళ్లలేదు ఆమె. ఆహ్వానం వస్తే వెళ్లింది. కాసేపు అలా కూర్చొని వచ్చింది. వివాదాలకు దూరంగా ఉండేవాళ్లెప్పుడూ సంతోషంగా ఉంటారు. నాలుగు కుర్చీలలో ఊర్వశీ రౌటేలా -
ఆస్కార్ వేడుకల్లో ఊహించని ఘటన..!
-
ఆస్కార్‌ను కొట్టేసి మరీ దర్జాగా...
లాస్ ఏంజిల్స్ : ఆస్కార్ వేడుకల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. అవార్డుల వేడుకలకు హాజరైన ఓ ప్రేక్షకుడు ఏకంగా అవార్డు షీల్డ్‌ను ఎత్తికెళ్లాడు. అంతటితో ఆగకుండా దర్జాగా మీడియాకు ఫోజులిస్తూ హల్ చల్ చేశాడు. అవార్డు వేడుకల అనంతరం గవర్నర్స్ బాల్స్ కార్యక్రమానికి నటీనటులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ నటిగా ఎంపికైన ఫ్రాన్సెస్ మెక్‌డార్మమండ్ (త్రి బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబింగ్, మిసోరి) తన షీల్డ్‌ను పక్కనపెట్టారు. అంతలో గుట్టుచప్పుడు కాకుండా ఓ వ్యక్తి దానిని దొంగిలించాడు. ఆపై పార్టీలో ఆ షీల్డ్ తో సందడి చేశాడు. అటుపై బయటకు వెళ్తున్న క్రమంలో మీడియా కెమెరాలకు అతను ఫోజులివ్వటం విశేషం. అవార్డు కనబడకపోవటంతో కంగారు పడిన మెక్‌డార్మమండ్.. విషయాన్ని నిర్వాహకులకు తెలియజేశారు. వారు పోలీసులకు సమాచారం అందించటంతో సీసీఫుటేజీ దృశ్యాల ఆధారంగా అతన్ని పట్టేసుకున్నారు. నిందితుడిని కాలిఫోర్నియాకు చెందిన టెర్రీ బ్రాయంట్గా గుర్తించారు. -
కన్నీళ్లు.. కరతాళ ధ్వనుల మధ్య లేడీ గగా!
ఆస్కార్ వేడుకల్లో ఎమోషనల్ మూమెంట్స్ అనదగ్గవాటిలో లేడీ గగా పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కాలేజీ క్యాంపస్‌లలో జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో రూపొందించిన ‘ది హంటింగ్ గ్రౌండ్’ అనే లఘు చిత్రంలోని ‘టిల్ ఇట్ హ్యాపెన్స్ టు యు’ అనే పాటను ఆమె పాడారు. డాయనె వారెన్ అనే రచయితతో కలిసి లేడీ గగా ఈ పాట రాసి, పాడి, నటించారు. ఈ పాట ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. పాట పాడుతూ చివర్లో కన్నీటి పర్యంతమైన గగాకి, చెమర్చిన కళ్లతో, కరతాళ ధ్వనులతో వీక్షకులు అభినందనలు తెలియజేశారు. గగా ఈ పాట పాడే ముందు యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్ మాట్లాడుతూ- ‘‘ఆడవాళ్లపై మాత్రమే కాదు.. మగవాళ్లపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. వీటిపై ప్రతి విద్యార్థీ పోరాడాలి. మనందరం ఈ దాడులను అంతం చేయడానికి నడుం బిగిస్తే, బాధితులే ఉండరు’’ అని ఉద్వేగంగా మాట్లాడారు. అంతకుముందు రెడ్ కార్పెట్‌పై గగా మాట్లాడతూ - ‘‘ఐదుగురు అమ్మాయిల్లో ఒక్క అమ్మాయి, 20మంది అబ్బాయిల్లో ఒక్క అబ్బాయి చదువు పూర్తి చేసేలోపే లైంగిక వేధింపులకు గురవుతాడు’’ అని పేర్కొన్నారు. 19 ఏళ్ల వయసులో తనపై జరిగిన అత్యాచారాన్ని గుర్తు చేసుకుంటూ గగా ఈ మాటలు మాట్లాడినట్లుగా అనిపించింది. ఆ చేదు సంఘటన తాలూకు బాధ ఆమె కళ్లల్లో స్పష్టంగా కనిపించింది. -
ఫస్ట్ టైమ్ ఆన్లైన్లో ఆస్కార్ వేడుక!
ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆస్కార్ పండగ సందడి మొదలైంది. ఈరోజు సాయంత్రం లాస్ ఏంజిల్స్‌లో సుమారు ఐదున్నర గంటలకు డాల్బీ థియేటర్లో ఆరంభమవుతుంది ఈ వేడుక. మన భారతీయ కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజాము అన్నమాట. ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 225 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఆస్కార్ కమిటీ మరో అడుగు ముందుకేసింది. ఆన్లైన్లో ఆస్కార్ వేడుకను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తోంది. అయితే యూఎస్‌లో ఉన్నవారికి మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని సమాచారం.