Oscar Facts In Telugu: How Did The Academy Awards Became The Oscars - Sakshi
Sakshi News home page

Oscar Awards Facts: ఆస్కార్‌ ప్రతిమలో వీటిని గుర్తించారా? అది దేనికి చిహ్నమంటే?

Published Sun, Mar 12 2023 10:50 AM | Last Updated on Sun, Mar 12 2023 5:59 PM

How The Academy Awards Became the Oscars - Sakshi

యావత్‌ సినీప్రపంచానికి ఆస్కార్‌ అంటే అమృతకలశం వంటిది. దాన్ని ఒక్కసారి తాకినా చాలనుకునే సెలబ్రిటీలు చాలామంది. అలాంటిది ఏకంగా ఆస్కార్‌ అవార్డు గెలుచుకుంటే జన్మ ధన్యమైపోయినట్లే ఫీలవుతారు. అందరినీ ఇంతలా ఆకర్షిస్తున్న ఆస్కార్‌ అవార్డుకు ఆ పేరెలా వచ్చింది? ఆ బొమ్మ తయారు చేసింది ఎవరో ఓసారి తెలుసుకుందాం.

ప్రతి పేరు వెనక ఓ కథ ఉంటుంది. అలాగే ఆస్కార్‌ పేరు వెనుక కూడా ఓ కహానీ ఉంది. గతంలో అకాడమీ అవార్డ్‌ అని మాత్రమే పిలిచేవారు. అయితే ఆస్కార్‌ ప్రతిమను చూసి అకాడమీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మార్గరెట్‌ హెర్రిక్‌ అది తన మామయ్య ఆస్కార్‌లా ఉందని పేర్కొన్నారట. అప్పటి నుంచి ఆ ప్రతిమను ఆస్కార్‌ అని అక్కడి ఉద్యోగులు పిలవడం ప్రారంభించారు. ఆ పేరు షార్ట్‌ అండ్‌ స్వీట్‌గా ఉండటంతో చివరికి ఆ పేరే స్థిరపడిపోయింది. 1929లో ఆస్కార్‌ అవార్డుల ప్రదానం మొదలవగా ఆస్కార్‌ అనే పేరు స్థిరపడింది మాత్రం 1939లో!

చదవండి: Oscar Ceremony Facts: గెలిచినవాళ్లకే కాదు అందరికీ డమ్మీ ఆస్కార్‌ ఇస్తారు!

ఆస్కార్‌ బొమ్మ విషయానికి వస్తే.. 1927లో అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అవార్డ్స్‌ అండ్‌ సెన్సెస్‌ అనే సంస్థ ప్రారంభించి సినిమారంగంలోని ప్రతిభావంతులకు అవార్డులు ఇవ్వాలనుకుందో కమిటీ. ఆ అవార్డు ప్రతిమ డిజైన్‌ను కళాదర్శకుడు సిడ్రిక్‌ గిబ్బన్స్‌ రూపొందించారు. నటీనటులు, రచయితలు, దర్శక, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు.. ఇలా చిత్రనిర్మాణంలో పాలు పంచుకునే ప్రధాన ఐదు శాఖలను దృష్టిలో పెట్టుకుని ఐదు స్పోక్స్‌ ఉన్న ఒక ఫిలిం రీల్‌పై ఓ వీరుడు కత్తి పట్టుకుని నిలబడినట్లుగా ప్రతిమ డిజైన్‌ చేశారు. అది అందరికీ నచ్చడంతే ఆ ఆస్కార్‌ బొమ్మే ఇప్పటికీ కొనసాగుతోంది.

చదవండి: ఆస్కార్‌ వేదికపై నాటు నాటు స్టెప్పులేయనుంది ఎవరో తెలుసా?

Oscar Awards 2023: వామ్మో.. ఆస్కార్‌ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్‌ ఏంటంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement