గత కొన్నేళ్లుగా ఆస్కార్‌కి ఇండియన్ సినిమాలు ఆమడ దూరంలో ఉండేవి. కానీ 'ఆర్ఆర్ఆర్' మూవీ దీన్ని బ్రేక్ చేసింది. నాటు నాటు పాటతో అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అనంతరం పలు సినిమాలు కూడా ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్లొస్తున్నాయి. వీటి సంగతి పక్కనబెడితే బెంగళూరుకు చెందిన లేడీ సినిమాటోగ్రాఫర్ ఇప్పుడు ఆస్కార్ అకాడమీ గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్‌కి ఎంపికైంది.
(ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీల ఇంతలా మారిపోయిందేంటి?)
బెంగళూరుకి చెందిన నేత్ర గురురాజ్.. ప్రస్తుతం లాజ్ ఏంజెల్స్‌లో ఉంటోంది. స్వతహాగా రైటర్, డ్యాన్సింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైన్ ఇలా చాలా విభాగాల్లో ప్రావీణ్యురాలైన నేత్ర.. కొన్నాళ్ల ముందు సినిమాటోగ్రఫీలో మాస్టర్స్ చేసేందుకు లాస్ ఏంజెల్స్ వెళ్లింది. రీసెంట్‌గా ఈమె తీసిన 'జాస్మిన్ ఫ్లవర్స్' షార్ట్ ఫిల్మ్.. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు గెలుచుకుంది.
ఈ క్రమంలోనే నేత్ర.. ఇప్పుడు ఆస్కార్ అకాడమీ గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్‌కి ఎంపికైంది. ప్రపంచం నలుమూల నుంచి ఈ ప్రోగ్రామ్‌కి సెలెక్ట్ అయిన యువ సినిమాటోగ్రాఫర్స్.. రెండు నెలల పాటు అకాడమీ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి మెలకువలు నేర్చుకుంటారు. ఇలాంటి దాని కోసం మన దేశానికి చెందిన అమ్మాయి ఎంపిక కావడం విశేషం.
(ఇదీ చదవండి: డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment