లాస్ ఏంజెల్స్: 90వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన వేడుక సినీతారల సందోహం, సందడి మధ్య కన్నులపండువగా జరిగింది. అవార్డులు ప్రకటించే ఏడాదిలో కన్నుమూసిన సినీ ప్రముఖులకు నివాళులర్పించడం ఆస్కార్‌లో సంప్రదాయంగా వస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల కన్నుమూసిన అతిలోక సుందరి శ్రీదేవిని ఆస్కార్ వేదిక గౌరవించింది. శ్రీదేవి జ్ఞాపకార్థం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేదికపై అమెకు నివాళులర్పించారు.
శ్రీదేవితో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత శశి కపూర్‌కు కూడా స్మృత్యంజలి ఘటించారు. వీరిద్దరి చిత్రాలను బిగ్ స్క్రీన్ పై చూపుతూ చలనచిత్ర రంగానికి వీరు చేసిన సేవలను సభా వేదిక గుర్తు చేసుకుంది. శ్రీదేవి, శశి కపూర్‌లను స్మరించుకుంటూ ఎడ్డీ వెడ్డెర్ (పెరల్ జామ్ ఫేమ్) ప్రదర్శన జరిగింది. ‘ఇన్ మెమొరియం’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో జేమ్స్ బాండ్ స్టార్ రోజర్ మౌరే, మేరీ గోల్డ్‌బెర్గ్, జోహాన్ జోహోన్సన్,జాన్ హెర్డ్, శామ్ షెఫర్డ్‌లకు కూడా అకాడమీ అవార్డుల వేదిక నివాళర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment