ఆస్కార్... కొన్ని ఆసక్తికరమైన విషయాలు! | history about oscar awards list | Sakshi
Sakshi News home page

ఆస్కార్... కొన్ని ఆసక్తికరమైన విషయాలు!

Published Tue, Mar 4 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM

ఆస్కార్... కొన్ని ఆసక్తికరమైన విషయాలు!

ఆస్కార్... కొన్ని ఆసక్తికరమైన విషయాలు!

  ఆస్కార్ పేరెలా వచ్చిందంటే...  ప్రతి పేరు వెనక ఓ కథ ఉంటుంది. అలాగే ‘ఆస్కార్’ పేరు వెనక కూడా ఓ కథ ఉంది. వాస్తవానికి ముందుగా ‘అకాడమీ అవార్డ్’ అనే పిలిచేవారు. అయితే, ఆస్కార్ ప్రతిమను చూసి, అకాడమీ లైబ్రేరియన్ మార్గరెట్ హెర్రిక్ అది తన మామయ్య ఆస్కార్ మాదిరిగా ఉందని పేర్కొన్నారట. అప్పట్నుంచీ ఆ ప్రతిమను ఆస్కార్ అని అక్కడి ఉద్యోగులు పిలవడం మొదలుపెట్టారు. చివరికి ఆ పేరే స్థిరపడింది. 1927లో ఆస్కార్ అవార్డుల ప్రదానం ప్రారంభమైతే, ఆస్కార్ అనే పేరు స్థిరపడింది 1939 నుంచి అని చరిత్ర చెబుతోంది.
 
 ఆస్కార్ బొమ్మ ఎలా తయారైందంటే... 1927లో ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అవార్డ్స్ అండ్ సెన్సైస్’ అనే సంస్థ ప్రారంభించి, చిత్రరంగంలోని ప్రతిభావంతులకు అవార్డు ప్రదానం చేయాలనుకుంది ఓ కమిటీ.     ఆ అవార్డు ప్రతిమ డిజైన్‌ని కళాదర్శకుడు సిడ్రిక్ గిబ్సన్స్ రూపొందించారు. నటీనటులు, రచయితలు, దర్శక, నిర్మాతలూ, సాంకేతిక నిపుణులు.. ఇలా చిత్రనిర్మాణంలో కీలక పాత్ర వహించే శాఖలను దృష్టిలో పెట్టుకుని ఐదు స్పోక్స్ ఉన్న ఒక ఫిలిం రీల్‌పై ఓ వీరుడు కత్తి పట్టుకుని నిలబడినట్లుగా ప్రతిమను డిజైన్ చేశారు.
 
 ఆస్కార్ ప్రతిమ ఖరీదు ఎంతంటే... ఒక్కో ఆస్కార్ ప్రతిమ తయారు చేయడానికి దాదాపు 40 గంటలు పడుతుందట. ఒక్కోదానికి సుమారు 17వేలకు పైగా ఖర్చవుతుంది. మొత్తం 24 శాఖలకు అవార్డులు ప్రదానం చేస్తారు. ఒక్కోసారి ఒక్కో విభాగంలో ఇద్దరికీ     అవార్డులు ప్రదానం చేయాల్సి వస్తుంది. అందుకని, ముందు జాగ్రత్తగా 60 ప్రతిమల వరకు తయారు చేస్తారు. అవార్డ్ వేడుక పూర్తయ్యాక మిగిలిన ప్రతిమలను లాకర్‌లో ఉంచి సీల్ వేస్తారు. 1945 వరకు ఒక్కో ఏడాది ఒక్కో సైజ్‌లో ఆస్కార్ ప్రతిమ ఉండేది. అయితే, ఆ తర్వాత ఒకే సైజుని ఫిక్స్ చేశారు. 13.5 అంగుళాల పొడువు, 3.85 కిలోల బరువుతో ఉంటుంది ఆస్కార్ బొమ్మ.
 
 ఎక్కువసార్లు ఆస్కార్ సొంతం చేసుకున్నది ఎవరంటే... 86 ఏళ్ల ఆస్కార్ అవార్డ్ చరిత్రలో ఎక్కువసార్లు అవార్డులు అందుకున్న వ్యక్తి వాల్ట్ డిస్నీ. వివిధ విభాగాల్లో ఆయన 22సార్లు అవార్డు గెల్చుకున్నారు. అలాగే, ఉత్తమ నటిగా నాలుగుసార్లు అవార్డ్ పొందిన ఏకైక నటి కేథరిన్ హెప్‌బర్న్. ఎక్కువ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకుడు జాన్‌ఫోర్డ్ కావడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement