నెక్సా, సైమా సంయుక్త ఆధ్వర్యంలో 13 అవార్డులను గెలుచుకున్న ‘ఆహా’
సాక్షి,హైదరాబాద్: ముంబై వేదికగా నిర్వహించిన నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్‌లో భాగంగా గేబో నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వరంలో నిర్మించిన ‘ఆహా గోదారి’ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా అవార్డు పొందింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవార్డులను అందించారు. ఈ వేదికపై ఆహా ఏకంగా 13 అవార్డులను గెలుచుకుని దాని ప్రశస్తిని చాటుకుంది. హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో 48 విభాగాల్లో ఈ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది.
‘అన్‌స్టాపబుల్ సీజన్–2’తో ఉత్తమ నాన్–ఫిక్షన్ ఒరిజినల్ స్పెషల్ షోగానే కాకుండా ‘ఆహా’ ఉత్తమ ప్రాంతీయ వేదికగా టైటిల్‌ను పొందింది. వ్యక్తిగత విభాగంలో ‘అన్యాస్ ట్యుటోరియల్’ చిత్రానికి గాను విజయ్ కె.చక్రవర్తి ఉత్తమ సినిమాటోగ్రాఫర్ (సిరీస్) అవార్డును, ‘ఆహా గోదారి’కి గోపవాఝల దివాకర్ ఉత్తమ డాక్యుమెంటరీ ఒరిజినల్‌గా, ‘న్యూసెన్స్’లో కిరణ్ మామెడి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ (సిరీస్)గా, ‘భామకలాపం–1’లో ప్రియమణి రాజ్ ఉత్తమ నటిగా, ఇదే చిత్రానికి అభిమన్యు తడిమేటి ఉత్తమ కథా పురస్కారాన్ని, అన్యస్ ట్యుటోరియల్, భామాకలాపం–1 చిత్రాలకు నివేదిత సతీ‹Ù, శరణ్య ప్రదీప్‌లు ఉత్తమ సహాయ నటులుగా తదితర అవార్డులను ఆహా గెలుచుకుంది. బెస్ట్ రీజినల్ ప్లాట్‌ఫామ్‌గానూ ఆహా సీఈఓ రవికాంత్ సబ్నవిస్–2 అవార్డులను పొందారు.
Comments
Please login to add a commentAdd a comment