Kangana Ranaut Reaction On Will Smith Slapping Chris Rock At Oscar 2022 - Sakshi
Sakshi News home page

Kangana Ranaut Will Smith: విల్‌ స్మిత్‌ చేసిన పనిపై కంగనా రనౌత్‌ స్పందన..

Published Tue, Mar 29 2022 11:20 AM | Last Updated on Tue, Mar 29 2022 11:57 AM

Kangana Ranaut Reaction On Will Smith Slapping Chris Rock Oscar 2022 - Sakshi

Kangana Ranaut Reaction On Will Smith Slapping Chris Rock: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌, బ్యూటీ కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఎప్పుడూ ఆకర్షిస్తుంది. ఏ అంశంపైనైనా ఆమె చేసే కామెంట్స్‌ సూటిగా సుత్తి లేకుండా ఉంటాయి. ఈ వ్యాఖ్యలతో వివాదాలు ఎదుర్కొన్న ఈ బ్యూటీకు అభిమానులు కూడా ఎక్కువే. హిందీ పాపులర్‌ హీరోయిన్లలో ఒకరైనా కంగనా రనౌత్‌ తాజాగా హాలీవుడ్‌ స్టార్‌ హీరో, ఆస్కార్‌ అవార్డు గ్రహిత విల్‌ స్మిత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతను తన లాకప్‌కు వస్తాడని ఆశిస్తున్నట్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. కంగనా అలా అనడానికి కారణం ఆస్కార్‌ 2022 అవార్డు ఫంక్షన్‌లో విల్‌స్మిత్‌ చేసిన పనే. ఆస్కార్‌ అవార్డు వేదికపై అమెరికన్ కమెడియన్ క్రిస్‌ రాక్‌ చెంప చెల్లుమనిపించాడు. 

చదవండి: ఆస్కార్‌ వేడుకల్లో షాకింగ్‌ ఘటన.. చెంప పగలకొట్టిన విల్‌స్మిత్‌

ఈ సంఘటనపై సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ ద్వారా స్పందించింది కంగనా. 'కొంతమంది మూర్ఖులను నవ్వించడానికి మా అమ్మ లేదా సోదరిల అనారోగ్యాన్ని ఉపయోగించినట్లయితే నేను కూడా విల్‌ స్మిత్‌లానే చెంప పగులకొడతాను. ఇలాంటి ప్రవర్తన కనబర్చిన (బ్యాడ్‌ యాస్‌ మూవ్‌) విల్‌ స్మిత్‌ తప్పకుండా నా లాకప్‌కు వస్తాడని ఆశిస్తున్నాను.' అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది కంగనా రనౌత్. కాంట్రవర్సీ రియాలిటీ షో 'లాకప్‌'కు కంగనా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

చదవండి: ముఖంపై పిడిగుద్దు ఘటన.. విల్‌ స్మిత్‌ ఆస్కార్‌ వెనక్కి తీసేసుకుంటారా?

ఇదిలా ఉంటే ఆస్కార్ 2022 అవార్డుల ప్రదానం సందర్భంగా బెస్ట్‌ డ్యాక్యుమెంటరీ ఫీచర్‌కు అవార్డు ఇచ్చేందుకు అమెరికన్‌ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ స్టేజ్‌పైకి ఎక్కాడు. అప్పుడు ఏదో మాట్లాడుతూ అనారోగ్యంతో గుండు చేయించుకున్న విల్‌ స్మిత్‌ భార్య, నటి జాడా పింకెట్‌ స్మిత్‌పై క్రిస్‌ జోక్‌ వేశాడు. దీంతో అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన విల్‌ స్మిత్‌ ఆగ్రహంతో క్రిస్‌ రాక్‌ దవడ పగలకొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement