Oscars 2022: Best Actor Will Smith Slaps Chris Rock Over Joke On Wife, Video Viral - Sakshi
Sakshi News home page

Oscars 2022: ఆస్కార్‌ వేడుకల్లో షాకింగ్‌ ఘటన.. క్రిస్‌ రాక్‌ దవడ పగలకొట్టిన ‘బెస్ట్‌ యాక్టర్‌’ విల్‌ స్మిత్‌

Published Mon, Mar 28 2022 9:58 AM | Last Updated on Mon, Mar 28 2022 11:28 AM

Oscars 2022 Best Actor Will Smith Slap Chris Rock Over Joke On Wife - Sakshi

Shocking Video In Oscars 2022: నటుడు విల్‌ స్మిత్‌(53)కు ఎట్టకేలకు ఆస్కార్‌ దక్కింది. 94వ ఆస్కార్‌ వేడుకల్లో ‘కింగ్‌  రిచర్డ్‌’ సినిమాకుగానూ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు అందుకున్నాడాయన. అయితే.. ఈవెంట్‌ సందర్భంగా జరిగిన ఓ ఘటన సినీ అభిమానులను షాక్‌కు గురి చేసింది. 

ఆస్కార్స్‌ 2022 అవార్డుల ప్రదానం సందర్భంగా.. నటుడు విల్‌ స్మిత్‌, స్టేజ్‌పై మాట్లాడుతున్న అమెరికన్‌ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ చెంప చెల్లుమనిపించాడు. బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌కు అవార్డు ఇవ్వడానికి స్టేజ్‌ ఎక్కిన క్రిస్‌.. ఏదో మాట్లాడుతూ విల్‌ స్మిత్‌ భార్య, నటి జాడా పింకెట్‌ స్మిత్‌ మీద జోక్‌ పేల్చాడు. అనారోగ్యంతో ఆమె గుండు చేయించుకుని ఉండగా.. ఆమె లుక్‌ మీద క్రిస్‌ జోక్‌ వేశాడు. దీంతో అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన విల్‌ స్మిత్‌ ఒక్కసారిగా ఉగ్రుడయ్యాడు. స్టేజ్‌ మీదకు సీరియస్‌గా నడ్చుకుంటూ వెళ్లిన స్మిత్‌.. క్రిస్‌ దవడ పగలకొట్టాడు. ఆ మరుక్షణమే కిందికి దిగి కుర్చీలో కూర్చున్నాడు. క్రిస్‌ వెకిలిగా ఏదో వివరణ ఇవ్వబోతుండగా.. అభ్యంతరకరమైన పదంతో నోరు మూయమంటూ క్రిస్‌కు సూచించాడు విల్‌ స్మిత్‌. 

ఆపై క్షమాపణలు
ఇదంతా లైవ్‌ రికార్డులో ప్లే కాలేదు. కానీ, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌ అవుతుంది. అదంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందో.. లేక నిజంగా జరిగిందో స్పష్టత లేదు. కానీ, క్రిస్‌ వ్యక్తిగతంగా   కలిసి ఆ కుటుంబానికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.]

అంతేకాదు నిర్వాహకులు విల్‌ స్మిత్‌ను పక్కకు తీసుకెళ్లి సర్దిచెప్పినట్లుగా ఒక ఫొటో వైరల్‌ అవుతోంది. ఇక ఉత్తమ నటుడి అవార్డు తీసుకున్న టైంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న విల్‌ స్మిత్‌.. క్రిస్‌ పట్ల వ్యవహరించిన తీరుకు క్షమాపణలు తెలియజేశాడు కూడా. 

మూడుసార్లు నామినేట్‌!
అమెరికన్‌ నటుడు అయిన విల్‌ స్మిత్‌(విలియర్డ్‌ కారోల్‌ స్మిత్‌ 2).. మెన్‌ ఇన్‌ బ్లాక్‌, ది పర్సూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌, హ్యాంకాక్‌, ఐ యామ్‌ లెజెండ్‌ లాంటి సినిమాలతో విల్‌ స్మిత్‌ ఇండియన్‌ ఆడియొన్స్‌కు సుపరిచితుడే. ఇప్పటిదాకా ‘అలీ’, ‘ది పర్సూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’, ‘కింగ్‌ రిచర్డ్‌’కు గానూ మూడుసార్లు ఉత్తర నటుడి కేటగిరీలో నామినేట్‌ అయ్యారు ఆయన. అయితే ది ఫ్రెష్‌ ప్రిన్స్‌గా పేరున్న విల్‌ స్మిత్‌కు ఆస్కార్‌ 2022లో అవార్డు ముచ్చట తీరింది.  కింగ్‌ రిచర్డ్‌లో వీనస్‌, సెరీనా విలియమ్స్‌ తండ్రి పాతర రిచర్డ్‌ విలియమ్స్‌ రోల్‌లో ఆయన కనబర్చిన అద్భుతమైన నటనకు ఆస్కార్‌ దక్కించుకున్నాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: Oscars 2022.. విజేతల పూర్తి లిస్ట్‌ ఇదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement