94th Academy Awards
-
విల్ స్మిత్ ఆస్కార్ వెనక్కి తీసేసుకుంటారా?
ఆస్కార్స్ 2022 ఈవెంట్ వేదికగా జరిగిన షాకింగ్ ఈవెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నటుడు విల్ స్మిత్, మరో నటుడు క్రిస్ రాక్‌ను స్టేజ్‌పైనే ముఖం పగల కొట్టిన ఘటన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విల్ స్మిత్‌కు దక్కిన బెస్ట్ యాక్టర్ అవార్డును వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. విల్ స్మిత్.. క్రిస్ రాక్ చెంప పగలకొట్టిన ఘటన వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ ఇన్సిడెంట్ ఈవెంట్ లైవ్‌లో టెలికాస్ట్ కాలేదు. పైగా ఈ ఘటన తర్వాత ఆస్కార్స్ 2022 ఈవెంట్‌ను కాసేపు నిలిపేసినట్లు సమాచారం. అయితే కాసేపటికే ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందో.. లేక నిజంగా జరిగిందో అర్థంకానీ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ ఈవెంట్ వేదికగానే విల్ స్మిత్ బెస్ట్ యాక్టర్‌గా ఆస్కార్ ట్రోఫీ అందుకున్నారు.. ఆపై జరిగిన ఘటనకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే అకాడమీ రూల్స్ ప్రకారం.. విల్ స్మిత్ ఆస్కార్‌ను వెనక్కి తీసుకోవాల్సిందేనని కొందరు గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అకాడమీ స్పందించింది. ‘‘హింస ఏ రూపంలో ఉన్నా అకాడమీ సహించదు. ఈ రాత్రి మా 94వ అకాడమీ అవార్డుల వేడుకలు జరగడం, విజేతల గుర్తింపు దక్కడంపై మేం సంతోషిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి సహచరులు, సినీ ప్రేమికుల నుండి ఈ క్షణానికి గుర్తింపు పొందారు (sic)’’ అంటూ ట్వీట్ చేసింది అకాడమీ. The Academy does not condone violence of any form. Tonight we are delighted to celebrate our 94th Academy Awards winners, who deserve this moment of recognition from their peers and movie lovers around the world. — The Academy (@TheAcademy) March 28, 2022 ఇక ఇలాంటి సందర్భాల్లో అకాడమీ గట్టి చర్యలు తీసుకోవాలని, సరైన మార్గదర్శకాలు రిలీజ్ చేయాలని, అసలు ఈ ఉదంతాన్ని ఒక దాడిగా పరిగణించి విల్ స్మిత్ అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే అకాడమీ మాత్రం అవార్డు వెనక్కి తీసుకునే వ్యవహారంపై ఇంతవరకు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయలేదు. VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa — Timothy Burke (@bubbaprog) March 28, 2022 అకాడమీ రూల్స్ ఏం చెబుతోందంటే.. 2017లో విడుదల చేసిన అకాడమీ కండక్ట్ కోడ్.. అకాడమీ విలువలను పరిరక్షించడంతో పాటు అవతలి వాళ్ల గౌరవానికి భంగం కలిగించకూడదు. అంతేకాదు.. అకాడమీ వాతావరణంలో అనైతికంగా వ్యవహరించకూడదు కూడా. అయితే విల్ స్మిత్ దాడి విషయంలో.. స్టేజ్ మీద ఉన్న క్రిస్ రాక్.. విల్ స్మిత్ భార్య, నటి జాడా పింకెట్ స్మిత్ మీద జోక్ పేల్చాడు. ఆమె చూడడానికి జీఐ జేన్ 2(సినిమా.. అందులో లీడ్ రోల్) లాగా ఉందంటూ కామెంట్ చేశాడు. కానీ, జాడా అలోపెషియాతో బాధపడుతోంది. ఆ అనారోగ్యం వల్లే ఆమె జుట్టు రాలిపోగా.. అలా గుండు లుక్‌తో దర్శనమిచ్చింది. అందుకే భార్య మీద వేసిన జోక్‌కు విల్ స్మిత్‌కు మండిపోయి గూబ పగలకొట్టి ఉంటాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు. విల్ స్మిత్, జాడా పింకెట్లు 1997లో వివాహం చేసుకున్నారు. 2018లో జాడా తనకు ఉన్న అలోపెసియా గురించి ఓపెన్ అయ్యింది. తద్వారా గొంతు సమస్యలు, జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. -
తారల ఆనందమానందమాయె.. ఆస్కార్‌ను ముద్దాడిన వేళ.. (ఆస్కార్ 2022 ఫొటోలు)
-
ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ ఘటన.. చెంప పగలకొట్టిన విల్‌స్మిత్
Shocking Video In Oscars 2022: నటుడు విల్ స్మిత్(53)కు ఎట్టకేలకు ఆస్కార్ దక్కింది. 94వ ఆస్కార్ వేడుకల్లో ‘కింగ్ రిచర్డ్’ సినిమాకుగానూ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడాయన. అయితే.. ఈవెంట్ సందర్భంగా జరిగిన ఓ ఘటన సినీ అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఆస్కార్స్ 2022 అవార్డుల ప్రదానం సందర్భంగా.. నటుడు విల్ స్మిత్, స్టేజ్‌పై మాట్లాడుతున్న అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించాడు. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌కు అవార్డు ఇవ్వడానికి స్టేజ్ ఎక్కిన క్రిస్.. ఏదో మాట్లాడుతూ విల్ స్మిత్ భార్య, నటి జాడా పింకెట్ స్మిత్ మీద జోక్ పేల్చాడు. అనారోగ్యంతో ఆమె గుండు చేయించుకుని ఉండగా.. ఆమె లుక్ మీద క్రిస్ జోక్ వేశాడు. దీంతో అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన విల్ స్మిత్ ఒక్కసారిగా ఉగ్రుడయ్యాడు. స్టేజ్ మీదకు సీరియస్‌గా నడ్చుకుంటూ వెళ్లిన స్మిత్.. క్రిస్ దవడ పగలకొట్టాడు. ఆ మరుక్షణమే కిందికి దిగి కుర్చీలో కూర్చున్నాడు. క్రిస్ వెకిలిగా ఏదో వివరణ ఇవ్వబోతుండగా.. అభ్యంతరకరమైన పదంతో నోరు మూయమంటూ క్రిస్‌కు సూచించాడు విల్ స్మిత్. VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa — Timothy Burke (@bubbaprog) March 28, 2022 ఆపై క్షమాపణలు ఇదంతా లైవ్ రికార్డులో ప్లే కాలేదు. కానీ, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతుంది. అదంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందో.. లేక నిజంగా జరిగిందో స్పష్టత లేదు. కానీ, క్రిస్ వ్యక్తిగతంగా కలిసి ఆ కుటుంబానికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.] అంతేకాదు నిర్వాహకులు విల్ స్మిత్‌ను పక్కకు తీసుకెళ్లి సర్దిచెప్పినట్లుగా ఒక ఫొటో వైరల్ అవుతోంది. ఇక ఉత్తమ నటుడి అవార్డు తీసుకున్న టైంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న విల్ స్మిత్.. క్రిస్ పట్ల వ్యవహరించిన తీరుకు క్షమాపణలు తెలియజేశాడు కూడా. Here's Will Smith's tearful acceptance speech at the #Oscars. https://t.co/ulvT7fsB57 pic.twitter.com/Uq2krBbBld — Variety (@Variety) March 28, 2022 మూడుసార్లు నామినేట్! అమెరికన్ నటుడు అయిన విల్ స్మిత్(విలియర్డ్ కారోల్ స్మిత్ 2).. మెన్ ఇన్ బ్లాక్, ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్, హ్యాంకాక్, ఐ యామ్ లెజెండ్ లాంటి సినిమాలతో విల్ స్మిత్ ఇండియన్ ఆడియొన్స్‌కు సుపరిచితుడే. ఇప్పటిదాకా ‘అలీ’, ‘ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్’, ‘కింగ్ రిచర్డ్’కు గానూ మూడుసార్లు ఉత్తర నటుడి కేటగిరీలో నామినేట్ అయ్యారు ఆయన. అయితే ది ఫ్రెష్ ప్రిన్స్‌గా పేరున్న విల్ స్మిత్‌కు ఆస్కార్ 2022లో అవార్డు ముచ్చట తీరింది. కింగ్ రిచర్డ్‌లో వీనస్, సెరీనా విలియమ్స్ తండ్రి పాతర రిచర్డ్ విలియమ్స్ రోల్లో ఆయన కనబర్చిన అద్భుతమైన నటనకు ఆస్కార్ దక్కించుకున్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Oscars 2022.. విజేతల పూర్తి లిస్ట్ ఇదే -
Oscars 2022: రిజ్ అహ్మద్.. ఆస్కార్ పట్టేశాడు
Oscars 2022: కిందటి ఏడాది మిస్ అయితే ఏంటి.. ఈ ఏడాది ఆస్కార్‌ను పట్టేశాడు రిజ్ అహ్మద్. పాక్-బ్రిటన్ సంతతికి చెందిన 39 ఏళ్ల రిజ్ అహ్మద్ ‘ది లాంగ్ గుడ్‌బై’ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌కుగానూ (Best Live Action Short Film) కేటగిరీలో ఆస్కార్ అందుకున్నాడు. దర్శకుడు అనెయిల్ కారియాతో ఈ అవార్డును స్వీకరించాడు రిజ్ అహ్మద్. 94వ అకాడమీ అవార్డుల వేడుక ఈ ఉదయం(సోమవారం) అట్టహాసంగా మొదలయ్యింది. ఈ ఈవెంట్లో తన తొలి ఆస్కార్‌ను అందుకున్నాడు రిజ్ అహ్మద్. మల్టీ టాలెంటెడ్‌గా పేరున్న రిజ్.. కిందటి ఏడాది ‘సౌండ్ ఆఫ్ మెటల్’ సినిమాకుగానూ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యాడు కూడా. కానీ, సీనియర్ నటుడు ఆంటోనీ హోప్కిన్స్కు అవార్డు దక్కింది. విశేషం ఏంటంటే.. ది లాంగ్ గుడ్‌బైలో అనెయిల్ కారియాతో పాటు రిజ్ అహ్మద్ సహకారం ఉంది. రిజ్ కో క్రియేటర్. ఇక తన అవార్డు విన్నింగ్ స్పీచ్‌లో ఉక్రెయిన్ సంక్షోభంపై రిజ్ అహ్మద్ ప్రసంగించాడు. ఇది విభజిత కాలం. ఇందులో ‘మనం’, ‘వాళ్లు’ లేరని గుర్తు చేయడమే కథ పాత్ర అని నమ్ముతాం. అక్కడ ‘మనం’ మాత్రమే ఉంది. కానీ, ఇది తమకు చెందినది కాదని భావించే ప్రతి ఒక్కరి కోసం. అలాగే శాంతి కోసం అంటూ ప్రసంగించాడు రిజ్ అహ్మద్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Oscars 2022: ఆస్కార్.. వచ్చినా ఏం లాభం?
Oscar Trophy Birth And Intresting Facts: సినీ జగత్‌కు పెద్ద పండుగ ‘ఆస్కార్’ కౌంట్ డౌన్‌కి మరొక రోజే మిగిలి ఉంది. ఫైనల్ నామినేషన్ల లిస్ట్ బయటకు వచ్చినప్పటి నుంచి విజేతల గురించి మూవీ లవర్స్ జోరుగా చర్చించుకుంటున్నారు. కరోనా జోరు తగ్గడంతో ఈసారి కాస్త హడావిడిగానే ఈవెంట్‌ను జరపాలని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెన్స్(ఎఎంపీఏఎస్) నిర్ణయించుకుంది. ఇంతకీ ఆస్కార్ వస్తే ఏం లాభం? నటులకు, టెక్నిషీయన్లకు అంతగా ఏం ఒరుగుతుంది?.. ఆస్కార్ అవార్డులకు ప్రామాణికం.. వేడుకల్లో అందించే ట్రోఫీ. ఈ ట్రోఫీకి చాలా చరిత్రే ఉంది. ఈ గోల్డెన్ స్టాచ్యూ ట్రోఫీని ‘అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్’ అంటారు. ఫ్రాన్స్‌కి చెందిన డెకో స్టయిలో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. అమెరికా డిజైనర్ కెడ్రిక్ గిబ్సన్ ఈ ట్రోఫీ డిజైన్‌ను స్కెచ్ చేయగా, ఐరిష్ ఆర్ట్ డైరెక్టర్ జార్జ్ స్టాన్లీ ఆస్కార్ ట్రోఫీ బొమ్మను తయారు చేశాడు. ఈ బొమ్మను కంచుతో తయారు చేస్తారు. పైన బంగారు పూత పూస్తారు. ఒక్కో విగ్రహం తయారీకి ఐదు నుంచి 900ల డాలర్ల ఖర్చు అవుతుంది. యాభై విగ్రహాల తయారీకి మూడు నెలల టైం పడుతుంది. ట్రోఫీ పొడవు 34 సెంటిమీటర్లు, బరువు మూడున్నర కేజీలు ఉంటుంది. 1929 నుంచి ఇప్పటిదాకా 3,160 ట్రోఫీలను ఇచ్చింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. కానీ, సినిమావాళ్లు గొప్పగా భావించే ఈ ట్రోఫీని.. ఒకవేళ అమ్మితే వచ్చేది మాత్రం కేవలం ఒక్క డాలర్!. 2021 ఆస్కార్ విజేతలు కోర్టుకెక్కి మరీ 1950కి ముందుదాకా.. అవార్డు గెల్చుకున్నవాళ్లకే ట్రోఫీపై అన్ని హక్కులు ఉండేవి. ఆ తర్వాత అకాడమీ తన రూల్స్ సవరించింది. విజేతలు ఎవరైనా సరే ఆస్కార్ ట్రోఫీని.. వేరే వాళ్లకు అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ అమ్మాలంటే.. అకాడమీకే అమ్మాలని ముందుగానే కాంట్రాక్ట్ మీద విజేతలతో సైన్ చేయించుకుంటారు. అలా అమ్మేయగా ఒక్కటంటే ఒక్క డాలర్ మాత్రమే ఇస్తారు. ఒప్పందాన్ని కాదని వేరేవాళ్లకు అమ్మితే.. కోర్టుకు ఇడుస్తుంది అకాడమీ. అయినప్పటికీ కొందరు ట్రోఫీలను అమ్మడం విశేషం. ‘ఎరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్’(1956) బెస్ట్ మూవీగా ఆస్కార్ ట్రోఫీ గెల్చుకుంది. ఈ మూవీ ప్రొడ్యూసర్ మైకేల్ టాడ్స్. ఈయన మనవడు 1989లో ట్రోఫీని వేలం వేయాలని ప్రయత్నించాడు. కోర్టులో కేసు వేసి ఆ వేలంపాటను అకాడమీ అడ్డుకుంది. 1992లో ‘బెస్ట్ సపోర్ట్ యాక్టర్’ ట్రోఫీ గెల్చుకున్న హరోల్డ్ రస్సెస్.. తన భార్య ఆరోగ్యం కోసం అరవై వేల డాలర్లకు ఆస్కార్ ట్రోఫీని అమ్మేశాడు. ఈ విషయంలో అకాడమీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే తన భార్య ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని పోరాడి మరీ కేసు గెలిచాడు హరోల్డ్. హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘సిటిజన్ కేన్’(1941) ఒరిజినల్ స్క్రీన్‌ప్లే కేటగిరీలో ఆస్కార్ గెల్చుకుంది. స్క్రీన్‌ప్లే రైటర్ ఓర్సన్ వెల్స్ వారసులు ఆ ట్రోఫీని వేలం అమ్మేయాలని ప్రయత్నించారు. ఈ కేసు కోర్టులో నడిచినప్పటికీ.. వెల్స్ వారసులే కేసు నెగ్గారు. ఆ టైంలో అకాడమీ కాంట్రాక్ట్‌లో వెల్స్ సైన్ చేయకపోవడం ఆ వారసులకు కలిసొచ్చింది. కోర్టు తీర్పు తర్వాత 2011లో ఆ ట్రోఫీని వేలం వేయగా.. ఎనిమిదిన్నర లక్షల డాలర్లు వచ్చింది. ఇంత సమస్యలున్నప్పుడు.. అసలు ఆస్కార్ ట్రోఫీ గెలవడం వల్ల లాభం ఏంటంటారా?. ఆర్టిస్టులు, ఇతర టెక్నిషియలు తమ రెమ్యునరేషన్ పెంచుకోవడం కోసం, తమ బ్రాండ్లను మార్కెటింగ్ చేసుకోవడం కోసమే పనికొస్తుంది. అన్నింటికి మించి సినీ ప్రపంచంలో ఇదొక ఔనత్యమైన అవార్డు అనే గుర్తింపు దక్కుతుంది కదా!. ఆస్కార్‌పై కథలు 1939 వరకు అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్ అనే ట్రోఫీని పిలిచేవాళ్లు. ఆ తర్వాత అఫీషియల్‌గా ‘ఆస్కార్’ అనే ముద్దుపేరుతో పిలుస్తున్నారు. ఆ పేరు అసలు ఎలా వచ్చిందనే దానిపై రకరకాల కథలు వినిపిస్తుంటాయి. అమెరికన్ నటి బెట్టె డేవిస్ అప్పట్లో అకాడమీ ఆర్గనైజేషన్‌కి ప్రెసిడెంట్ పని చేసింది. తన మొదటి భర్త పేరు హర్మన్ ఆస్కార్ నెల్సన్. ఆయన పేరు మీదుగా ఆమె ట్రోఫీలకు ఆ పేరు పెట్టిందని చెప్తారు. మరో వెర్షన్ ఏంటంటే.. హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గరెట్ హెర్రిక్, ఆ బొమ్మ రూపం తన అంకుల్ ఆస్కార్‌ని పోలి ఉండడంతో ఆమె ఆ పేరు పెట్టించిందని చెప్తారు. అమెరికన్ కాలమిస్ట్ సిడ్నీ స్కోలిస్కై మాత్రం తన కాలమ్‌లో ‘అకాడమీ ఎంప్లాయిస్ ముద్దుగా ఆ పేరు పెట్టుకున్నార’ని రాశాడు. అయితే 1934లో ట్రోఫీ అందుకున్న తర్వాత ప్రముఖ ప్రొడ్యూసర్ వాల్టర్ ఎలియాస్ డిస్నీ(వాల్ట్ డిస్నీ) ఫస్ట్ టైం ‘ఆస్కార్’ అనే పదాన్ని స్టేజ్ మీద ఉపయోగించడం కొసమెరుపు. అకాడమీ మోషన్ పిక్చర్స్ అవార్డులకు ‘ఆస్కార్’ అనే ట్రేడ్ మార్క్ ఉంది. అయితే ఇటలీలో ఏ రంగంలో అవార్డులు ఇచ్చినా ఆస్కార్ అనే పిలుస్తుంటారు. 2020.. వరస్ట్! 1930లో ఆస్కార్ వేడుకల ఈవెంట్‌ను రేడియోలో బ్రాడ్కాస్ట్ చేశారు. 1953 నుంచి టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఆర్కీవ్స్ మాత్రం 1949 నుంచి భద్రపరుస్తున్నారు. రీల్, వీడియో, డిజిటల్ కాపీలుగా వాటిని భద్రపరిచారు. వేదికలు.. మారుతూ వస్తున్నాయి. కొడాక్ థియేటర్.. డాల్బీ థియేట్లో జరుగుతున్నాయి. అయితే 2018లో ఈవెంట్‌ను టెలికాస్ట్ చేయలేదు. కొన్ని ఆస్కార్ వేడుకల్లో.. బ్రేక్ టైంలో అవార్డులూ ఇచ్చారు. కొత్తగా కొన్ని కేటగిరీలను కలిపారు. రాను రాను కొన్ని కేటగిరీలను ఎత్తేశారు. వీటిపై విమర్శలు వచ్చాయి. అయినా అకాడమీ తగ్గడం లేదు. 1998 ఆస్కార్ విజేతలు అంతకు ముందు ఆస్కార్ అవార్డుల నామినేషన్ల ఫలితాల్ని ఫిబ్రవరి మొదటి వారంలో అనౌన్స్ చేసేవాళ్లు. 2004 నుంచి అకాడమీ అవార్డుల నామినేషన్ ఫలితాల్ని జనవరి మధ్యలోనే ప్రకటిస్తున్నారు. ఆస్కార్ వేడుకల టెలికాస్టింగ్‌కు సంబంధించి.. 1980 నుంచి టీఆర్పీని లెక్కిస్తున్నారు. హయ్యెస్ట్ టీఆర్పీ 1998లో వచ్చింది. 57 టీఆర్పీతో అస్కార్ చరిత్రలోనే రికార్డ్ నెలకొల్పింది. మరి లోయెస్ట్ టీఆర్ఫీ అంటారా? అది.. 2020లోనే రికార్డయ్యింది. ఫస్ట్ .. రీసెంట్ ప్రపంచంలోనే చాలాకాలం నుంచి జరుగుతున్న ఎంటర్టైన్మెంట్ అవార్డుల ఈవెంట్.. ఈ ‘అకాడమీ’(ఆస్కార్) అవార్డులు. మొదటి వేడుక ఎలాంటి ఆర్భాటాలు లేకుండా జరిగింది. 1929, మే 16న లాస్ ఏంజెలెస్‌లోని హాలీవుడ్ రూజ్వెల్ట్ హోటల్లో ప్రైవేట్ డిన్నర్ ఫంక్షన్ ఏర్పాటు చేసి అవార్డులను ఇచ్చారు. ఈ ఈవెంట్‌కు 270 మంది హాజరయ్యారు. అమెరికన్ యాక్టర్ డగ్లస్ ఫెయిర్‌బ్యాంక్ ఈ వేడుకలకు హోస్ట్‌గా వ్యవహరించాడు. 1927–28 మధ్య రిలీజ్ అయిన సినిమాలకు ఈ అవార్డులు దక్కాయి. అయితే ఈవెంట్‌ను కేవలం పదిహేను నిమిషాల్లోనే ముగించారు. మొత్తం పదిహేను ట్రోఫీలను ఇచ్చారు. మొదటి ఈవెంట్లో గెలిచినవాళ్ల పేర్లను మూడు నెలల ముందే మీడియాకు రిలీజ్ చేయడం విశేషం. ఈ రూల్‌ను రెండో ఆస్కార్ వేడుకలకు(1930) మార్చేశారు. అకాడమీ అవార్డుల మొదటి వేడుక అవార్డులిచ్చే రాత్రి విన్నర్ల పేర్ల లిస్ట్‌ను పేపర్ హౌజ్‌లకు పంపించేవాళ్లు. 1940 వరకు ఇదే జరిగింది. అయితే లాస్ఏంజెలెస్ టైమ్స్ వాళ్లు సరిగ్గా అవార్డు వేడుక జరిగే ముందే పేర్లను అనౌన్స్ చేసేది. ఇది చూసి అకాడమీ వాళ్లు సీల్డ్ కవలర్‌లో విన్నర్స్‌ను అనౌన్స్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు జరగబోయే అవార్డుల వేడుక 94వది. మార్చి 27న 2022న కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్లో జరుగనుంది. భారత కాలమానం ప్రకారం.. మార్చి 28 సోమవారం ఉదయం ఐదుగంటలకు ఈ ఈవెంట్ మొదలవుతుంది. Disney+Hotstar App ద్వారా మన దేశంలో ఆస్కార్ వేడుకల్ని లైవ్‌గా వీక్షించొచ్చు. :::సాక్షి వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
ఆస్కార్ అవార్డ్స్: తుది జాబితాలో నిలిచిన 10 విభాగాలు ఇవే..
94th Oscar Awards Announced Shortlists Of 10 Categories: సినిమాల్లో నటీనటులకు మంచి గుర్తింపు వచ్చేది వారి యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయినప్పుడు. లేదా సినిమాలు భారీగా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు. వీటితోపాటు నటీనటులను పలు అవార్డులు వరించినప్పుడు. అలా సినిమా అవార్డుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది 'ఆస్కార్'. ప్రతీ నటుడు, నటికి ఈ అవార్డు ఒక కలగా ఉంటుంది. అలాంటి ఆస్కార్ అవార్డుల మహోత్సవం త్వరలో జరగనుంది. ఈసారి నిర్వహించే 94వ అకాడమీ అవార్డులను ఫిబ్రవరి 1, 2022న ప్రకటించనున్నారు. అయితే ఈ అవార్డుల కోసం 10 విభాగాల వరకు కుదించారు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన తుది జాబితాను ప్రకటించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఈ తుది జాబితా ఎంపికైన చిత్రాలకు జనవరి 27, 2022 గురువారం నుంచి ఫిబ్రవరి 1, 2022 మంగళవారం వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. 1. ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్) 94వ అకాడమీ అవార్డుల కోసం ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో 15 సినిమాలు తుది జాబితాలో ఉన్నాయి. ఈ కేటగిరీలో 138 సినిమాలు అర్హత సాధించాయి. ఈ షార్ట్ లిస్ట్, నామినీలను డాక్యుమెంటరీకి సంబంధించిన బ్రాంచ్ సభ్యులు నిర్ణయిస్తారు. 2. ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్) ఈ కేటగిరీలో మొత్తం 82 సినిమాలు అర్హత సాధించగా.. 15 చిత్రాలు తుది జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 3. ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఈ ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 92 దేశాలకు చెందిన సినిమాలు అర్హత సాధించాయి. అందులో భారతదేశం నుంచి ఎంపికైన హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ కలిసి నిర్మించిన కూళాంగల్ (అంతర్జాతీయంగా సినిమా పేరు 'పెబుల్స్') ఒకటి. తుదిజాబితాకు 15 సినిమాలు వెళ్లగా.. అందులో కూళాంగల్కు స్థానం దక్కలేదు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన సినిమాలు చూశాక ఓటింగ్ నిర్వహిస్తారు. 4. మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ ఈ విభాగంలో 10 సినిమాలు తుదిజాబితాలో స్థానం సంపాదించాయి. అకాడమీ మేకప్ ఆర్టిస్ట్స్, హెయిర్ స్టైలిస్ట్‌ల బ్రాంచ్‌లోని సభ్యులందరూ జనవరి 30, 2022 ఆదివారం షార్ట్ లిస్ట్ చేసిన ప్రతి సినిమాను వీక్షించి నిర్ణయం తీసుకుంటారు. తర్వాత చివరి ఐదు చిత్రాలను నామినేట్ చేయడానికి బ్రాంచ్ సభ్యులు ఓటు వేస్తారు. 5. మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్) ఇందులో 136 ఒరిజినల్ స్కోర్లు అర్హత సాధిచగా 15 షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఈ విభాగంలో కూడా బ్రాంచ్ సభ్యులు ఓటు వేస్తారు. 6. మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్) ఇందులో 84 పాటలు అర్హత సాధించగా 15 పాటలు తుది జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 7. ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ ఈ కేటగిరీలో 82 సినిమాలకు 15 చిత్రాలు తుది జాబితాకు వెళ్లాయి. 8. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్ ఈ ఉత్త లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్ విభాగంలో 145 సినిమాలు అర్హత సాధించగా.. 15 చిత్రాలు షార్ట్ లిస్ట్‌లోకి వెళ్లాయి. షార్ట్ ఫిల్మ్స్, ఫీచర్ యానిమేషన్ సభ్యులు, దర్శకులు, నిర్మాతలు, రచయితల శాఖల సభ్యులు షార్ట్‌లిస్ట్, నామినీలను నిర్ణయించడానికి ఓటు వేస్తారు. 9. సౌండ్ ఈ విభాగంలో 94వ అకాడమీ అవార్డుల కోసం 10 సినిమాలు ఫైనల్ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ జాబితాలోని చిత్రాలను బ్రాంచ్ సభ్యులు జనవరి 28, 2022 శుక్రవారం వీక్షించి చివరిగా 5 సినిమాలను నామినేట్ చేసేందుకు ఓటు వేస్తారు. 10. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ఈ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో 10 చిత్రాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. విజువల్ ఎఫెక్ట్స్ బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ షార్ట్‌లిస్ట్‌ను నిర్ణయించింది. విజువల్ ఎఫెక్ట్స్ బ్రాంచ్‌లోని సభ్యులందరూ జనవరి 29, 2022 శనివారం నాడు షార్ట్‌లిస్ట్ చేయబడిన ప్రతి సినిమా నుంచి 10 నిమిషాల సారాంశాన్ని వీక్షిస్తారు. అనంతరం ఆస్కార్ నామినేషన్‌కు 5 సినిమాలను ఎంపిక చేసేందుకు ఓటు వేస్తారు. -
ఆస్కార్ బరిలో నయనతార ‘కూళాంగల్’.. కథేంటంటే..?
‘కూళాంగల్’ (గులకరాయి) మోత ఆస్కార్ వరకూ వినిపించనుంది. ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంటుందా? అనేది వచ్చే ఏడాది మార్చిలో తెలిసిపోతుంది. అయితే కొత్తవారితో కొత్త దర్శకుడు తీసిన సినిమా ఆస్కార్ పోటీ దాకా వెళ్లడం అంటే చిన్న విషయం కాదు. ప్రేక్షకుల హృదయాలను తాకింది ‘కూళాంగల్’ సినిమా. అందుకే మన దేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఈ సినిమా ఆస్కార్‌కి ఎంపికైంది. 2022 మార్చి 27న జరగనున్న 94వ ఆస్కార్ అవార్డ్ వేడుకకు మన దేశం తరఫున ‘విదేశీ విభాగానికి’ పలు చిత్రాలు పోటీ పడ్డాయి. వాటిలో హిందీ నుంచి ‘సర్దార్ ఉదమ్’, ‘షేర్నీ’, తమిళ చిత్రం ‘మండేలా’, మలయాళ సినిమా ‘నాయట్టు’ ఉన్నాయనే వార్త శుక్రవారం వచ్చింది. అయితే తమిళ చిత్రం ‘కూళాంగల్’ కూడా ఉందని, ఆ చిత్రమే ఎంపికైందని శనివారం అధికారిక ప్రకటన వెల్లడయింది. అన్ని చిత్రాలనూ పరిశీలించాక జ్యూరీ సభ్యులు ‘కూళాంగల్’ని ఎంపిక చేశారు. పీఎస్ వినోద్ రాజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ దర్శకుడు విఘ్నేష్ శివన్–హీరోయిన్ నయనతార ‘రౌడీ పిక్చర్స్’ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ అధికారిక ఎంట్రీకి తమ సినిమా ఎంపికైన సందర్భంగా ‘‘అండ్ ది ఆస్కార్ గోస్ టు అని వినే చాన్స్ కూడా ఉంది! కల నెరవేరడానికి రెండు అడుగుల దూరమే ఉంది’’ అని సోషల్ మీడియా వేదికగా స్పందించారు విఘ్నేష్. ‘‘ఇంతకన్నా ఆనందకరమైన వార్త మరోటి ఉండదు’’ అన్నారు పీఎస్ వినోద్ రాజ్. కూళాంగల్ కథేంటంటే... భర్త పచ్చి తాగుబోతు. అతన్ని మార్చాలనుకుంటుంది భార్య. తన వల్ల కాక ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు భార్య విలువ తెలుసుకుని ఆమెను ఇంటికి రప్పించడానికి తన కొడుకుతో కలసి ఆ భర్త ప్రయత్నాలు మొదలుపెడతాడు. భార్యను వెనక్కి తెచ్చుకోవడానికి అతనేం చేశాడనేది కథ. పీఎస్ వినోద్ రాజ్ తన కుటుంబంలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. దర్శకుడిగా తొలి చిత్రమే అయినప్పటికీ ప్రేక్షకులను హత్తుకునేలా తీశారు వినోద్. నటించిన అందరూ కొత్తవారే. కానీ పాత్రల్లో జీవించారు. ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్‌డామ్’ (ఐఎఫ్ఎఫ్ఆర్)లో ‘కూళాంగల్’ ప్రతిష్టాత్మక టైగర్ అవార్డు దక్కించుకుంది. 50 ఏళ్ల ఐఎఫ్ఎఫ్ఆర్ చరిత్రలో 2017లో మన దేశానికి తొలి అవార్డును తెచ్చిన మలయాళ ‘దుర్గా’ తర్వాత ఈ అవార్డు దక్కించుకున్న మరో సినిమా ‘కూళాంగల్’ కావడం విశేషం. -
ఆస్కార్ ఎంట్రీకి నామినేట్ అయిన మన సినిమాలివే..
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. ఈ అవార్డుల కోసం ప్రపంచ దేశాల నుంచి పలు విభాగాల్లో సినిమాలు పోటీపడే విషయం తెలిసిందే. ఈ ఏడాది ‘2022 బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీ’లో భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ కోసం పలు సినిమాలు పోటీ పడుతున్నాయి. 15 మంది సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యూరీ మన దేశం నుంచి ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లదగ్గ సినిమాలను వీక్షించి, ఒక్క సినిమాను ఎంపిక చేస్తుంది. వచ్చిన ఎంట్రీల్లో 14 చిత్రాలు ఆస్కార్‌కి పంపించే స్థాయి ఉన్నవిగా జ్యూరీ భావించింది.వాటిలో హిందీ నుంచి ‘సర్దార్ ఉదమ్’, ‘షేర్నీ’, తమిళ చిత్రం ‘మండేలా’, మలయాళ సినిమా ‘నాయట్టు’ కూడా ఉన్నాయి. మరి.. ఈ నాలుగింట్లో ఒక్కటా? లేక లిస్ట్‌లో ఉన్న వేరే భాషల చిత్రాల్లో ఒక్కటా? ఆస్కార్ వరకూ వెళ్లే ఆ ఒక్క చిత్రం ఏంటనేది చూడాలి. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ ఉదమ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘సర్దార్ ఉదమ్’. జలియన్‌వాలా బాగ్ మారణకాండకు కారణమైన జనరల్ డయ్యర్‌ను హతమార్చడానికి లండన్‌లో సర్దార్ ఉదమ్ పడిన కష్టాలను ఈ చిత్రంలో చూపించారు చిత్రదర్శకుడు సూజిత్ సర్కార్. ఉదమ్ పాత్రను విక్కీ కౌశల్ చేశారు. షేర్నీ విషయానికొస్తే.. జనావాసంలోకి వచ్చిన ఓ ఆడపులి నుంచి కాపాడాలని అటవీ గ్రామీణుల అభ్యర్థన. పులిని చంపైనా ఓట్లు కూడగట్టుకోవాలన్నది రాజకీయ నేతల ఆకాంక్ష. ఆ ఆడపులిని కాపాడాలనుకుంటుంది ఫారెస్ట్ ఆఫీసర్. ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణి సంరక్షణ లాంటి అంశాలతో ఈ సినిమా సాగుతుంది. విద్యాబాలన్ కథానాయికగా అమిత్ వి. మసూర్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యోగిబాబు టైటిల్ రోల్లో నటించిన పొలిటికల్ సెటైరికల్ మూవీ ‘మండేలా’. ఓ క్షురకుడి ఓటు తమ గెలుపుకి కారణం అవుతుందని తెలిసి, అతన్ని మాయ చేయడానికి పంచాయతీ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీపడుతున్న ఇద్దరు అన్నదమ్ముల ప్రయత్నమే ‘మండేలా’. మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మార్టిన్ ప్రక్కట్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘నాయట్టు’. ఇందులో కుంచాకో బోబన్, జోజు జార్జ్, నిమిషా సజయన్ ప్రధాన తారలుగా నటించారు. రాజకీయ నాయకుల చేతిలో వ్యవస్థలు ఎలా కీలుబొమ్మలుగా మారాయనే నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.