
Vicky Kaushal On Sardar Udham Oscar Rejection: ‘ఉరి’ ఫేమ్ విక్కీ కౌశల్, బాలీవుడ్ డైరెక్టర్ సుజిత్ సర్కార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘సర్దార్ ఉద్ధం’. ఇటీవల ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే ఈ మూవీ ఆస్కార్ 2022కి వెళ్లేందుకు షార్ట్‌లిస్ట్ అయిన 14 చిత్రాల్లో నిలిచింది. కానీ ఆస్కార్ బరిలో మాత్రం నిలవలేకపోయింది.
‘సర్దార్ ఉద్ధం’లో బ్రిటీష్ వారిపై ద్వేషాన్ని వెళ్లగక్కడం వల్లే ఈ మూవీని ఆస్కార్‌కి సెలెక్ట్ చేయలేదని జ్యూరీ సభ్యుడు ఒకరు తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ఆ సినిమా నటుడు విక్కీ కౌశల్ తాజాగా స్పందించాడు. ‘ప్రతి ఒక్కరికీ వారి అభిప్రాయం చెప్పే హక్కు ఉంది. మనకు సినిమా నిపుణులతో కూడిన జ్యూరీ ఉంది. వారి నిర్ణయాన్ని కచ్చితంగా గౌరవించాలి.
నేను తమిళ చిత్రం ‘కూజంగల్’ని చూడలేదు, కానీ సుజిత్ చూసి బావుందని చెప్పాడు. గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో భారతీయ సినిమా ఎలివేట్ అయ్యేందుకు ఇది ఉత్తమ నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. ఈ చిత్రం మనకు కీర్తిని తెస్తుందని ఆశిస్తున్నా’ అని చెప్పాడు.అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మా సినిమాని బావుందని ప్రశంసిస్తూ, చూడామని మరొకరికి రిఫర్ చేస్తున్నారు అంతకంటే ఏ కావాలని తెలిపాడు.
చదవండి: వారిపై ద్వేషాన్ని వెళ్లగక్కడం వల్లే.. ‘సర్దార్ ఉద్ధం’ని ఆస్కార్‌కి సెలెక్ట్ చేయలేదు