సూర్య సినిమాలో బొమన్‌ ఇరానీ! | Boman Irani Actress In Surya And Mohanlal Multi Starrer Movie | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 22 2018 6:09 PM | Last Updated on Fri, Jun 22 2018 6:11 PM

Boman Irani Actress In Surya And Mohanlal Multi Starrer Movie - Sakshi

కోలీవుడ్‌లో ఓ భారీ మల్టిస్టారర్‌ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌ స్టార్‌ సూర్య, మాలీవుడ్‌ కంప్లీట్‌ యాక్టర్‌ మోహన్‌లాల్‌ ఓ సినిమాలో కలిసి నటిస్తున్నారు. కేవీ ఆనంద్‌ డైరెక్షన్‌లో తెరకెక్కతున్న ఈ మూవీపై కోలీవుడ్‌లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. 

తాజాగా ఈ సినిమాలో ‘అత్తారింటికి దారేది’ ఫేం బొమాన్‌ ఇరానీ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రకటించారు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్‌ కల్యాణ్‌కు తాతగా నటించి మెప్పించాడు. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా.. అంతగా గుర్తింపు తీసుకురాలేదు. అయితే తాజాగా సూర్య , మోహన్‌లాల్‌ కలిసి నటిస్తున్న సినిమాలో అవకాశం వచ్చింది. లైకా ప్రొడక్షన్స్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు శిరీష్‌ కూడా నటించనున్నాడు. ఇది సూర్యకు 37వ చిత్రం. గతంలో కేవీ ఆనంద్‌ డైరక్షన్‌లో వచ్చిన వీడొక్కడే, బ్రదర్స్‌తో హిట్స్‌ కొట్టిన సూర్య ఈ మూవీతో హ్యాట్రిక్‌ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement