
విభిన్న పాత్రలలో...
వైవిధ్యమైన కథా, కథనాలతో ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘అనేకుడు’. కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అమైరా దస్తూర్, ఐశ్వర్యా దేవన్ కథానాయికలుగా నటించారు. కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్. సురేశ్, కల్పాతి ఎస్.గణేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మట్లాడుతూ-‘‘ ఇందులో నాలుగు విభిన్నమైన పాత్రల్లో ధనుష్ కనిపిస్తారు. ఆయన పాత్ర అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుంది. హారిస్ జైరాజ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా కచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాతలు తెలిపారు.