Anekudu
-
ఒక పాత్ర... మూడు కోణాలు
విభిన్న పాత్రలు పోషిస్తూ, తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న హీరో ధనుష్. ఆయన పాత్రకు మూడు కోణాలను చూపిస్తూ కె .వి ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘అనేకుడు’. ఎజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. అమైరా దస్తూర్, ఐశ్వర్యా దేవన్ నాయికలు. ఈ చిత్రం గురించి కె.వి.ఆనంద్ మాట్లాడుతూ-‘‘ఈ చిత్రంలో హీరో ధనుష్ పోషించిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందించాం. హారిస్ జయరాజ్ మంచి పాటలందించారు.’’అని తెలిపారు. -
మార్చి 20న అనేకుడు రిలీజ్
-
విభిన్న పాత్రలలో...
వైవిధ్యమైన కథా, కథనాలతో ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘అనేకుడు’. కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అమైరా దస్తూర్, ఐశ్వర్యా దేవన్ కథానాయికలుగా నటించారు. కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్. సురేశ్, కల్పాతి ఎస్.గణేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మట్లాడుతూ-‘‘ ఇందులో నాలుగు విభిన్నమైన పాత్రల్లో ధనుష్ కనిపిస్తారు. ఆయన పాత్ర అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుంది. హారిస్ జైరాజ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా కచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాతలు తెలిపారు. -
యువతకు నచ్చేలా...
‘రఘువర న్ బీటెక్’ చిత్రంతో తెలుగులో మంచి విజయం అందుకున్న తమిళ నటుడు ధనుష్ త్వరలో ‘అనేకుడు’గా రాబోతున్నారు. అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ‘రంగం’ ఫేం కేవీ ఆనంద్ ద ర్శకుడు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కల్పాత్తి ఎస్.అగోరమ్, ఎస్.గణేష్, ఎస్.సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 10న పాటలను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కె.వి. ఆనంద్ మాట్లాడుతూ -‘‘యువతకు నచ్చే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి, హారీస్ జైరాజ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు ’’ అని చెప్పారు. కార్తీక్, ఐశ్వర్య, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఓం ప్రకాశ్, ఎడిటింగ్: ఆంటోని.