అమరన్ సీక్వెల్‌కు సిద్ధం | amaran sequal is ready | Sakshi
Sakshi News home page

అమరన్ సీక్వెల్‌కు సిద్ధం

Published Sat, Feb 28 2015 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

అమరన్ సీక్వెల్‌కు సిద్ధం

అమరన్ సీక్వెల్‌కు సిద్ధం

అమరన్ చిత్ర సీక్వెల్ నటుడు కార్తీక్ సిద్ధమవుతున్నారు. 90స్‌లో ప్రముఖ నటుడుగా వెలుగొంది న నటుల్లో కార్తీక్ ఒకరు. నటుడిగా మంచి ఫామ్ లో ఉండగానే రాజకీయరంగ ప్రవేశంచేసి సొంతంగా పార్టీని కూడా నెలకొల్పారు. ఆ తరువా త ఆ పార్టీని రద్దుచేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కాగా అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తున్న కార్తీక్ ఇటీవల కేవీ.ఆనంద్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన అనేగన్ చిత్రంలో ముఖ్య భూమికను పోషించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో కార్తీక్‌కు పలు అ వకాశాలు రావడం మొద లెట్టాయి. కాగా ఈయన 1992లో సొంతంగా నిర్మించి హీరోగా నటించిన అమరన్ చిత్రం సీక్వెల్‌ను రూపొందించాలనే నిర్ణయానికి వచ్చారు.


ఒక పక్క కార్తీక్ కొడుకు గౌతమ్ కార్తీక్ హీరోగా నటిస్తుంటే ఇప్పుడు ఈయన కూడా కథా నాయకుడిగా నటించడానికి తయారవ్వడం విశే షం. అమరన్ యాక్షన్ అంశాలతో కూడిన కమర్షియల్ చిత్రం ఈ చిత్రానికి రాజేశ్వర్ దర్శకుడు. ఇప్పుడు సీక్వెల్‌కు ఆయన దర్శకత్వం వహించనున్నారట. దీని గురించి కార్తీక్ తెలుపుతూ ఆ మధ్య చిత్రాన్ని రాజేశ్వర్ చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఆయన తనకుమంచి మిత్రుడు అని అన్నారు. ఇదయ తామరై చిత్రానికి ఆయన దర్శకుడు. మళ్లీ ఇన్నాల్టికి కలసి పనిచేయబోవడం సంతోషంగా ఉంది అని అన్నారు. త్వరలోనే దర్శకుడు రాజేశ్వరన్‌ను కలిసి అమరన్-2 చిత్రం గురించి చర్చించనున్నట్లు కార్తీక్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement