వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో సూర్య. సూరరై పోట్రు, జై భీమ్ చిత్రాల్లో ఒకదానికొకటి సంబంధం లేని పాత్రల్లో తన అసమాన నటనను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించిన ఈయన చేతిలో మరిన్ని చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం కంగువ చిత్రానికి తన గొంతుతో పరిపూర్ణత చేకూర్చే పనిలో ఉన్నారు. సోషల్ అంశాలకు పీరియడ్ కథాంశాలను జోడించి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది. ఇందులో సూర్యలోని మరో కోణాన్ని చూస్తారు.
10 భాషల్లో కంగువా
బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని చిరుతై శివ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీ డబ్బింగ్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 3డీ ఫార్మాట్‌లో తెరకెక్కుతున్న కంగువ చిత్రాన్ని 10 భాషల్లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు కాగా తదుపరి సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సూర్య సిద్ధం అవుతున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు సూరరై పోట్రు (ఆకాశమే నీ హద్దురా) వంటి హిట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే!
విద్యార్థిగా సూర్య!
తాజా చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఏమిటంటే ఇందులో సూర్యతో పాటు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, నజ్రియా ముఖ్యపాత్రలు పోషించనున్నారట. ఈ చిత్రానికి పురనానూరు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరో విషయం ఏమిటంటే ఇందులో సూర్య కళాశాల విద్యార్థిగా నటిస్తున్నట్లు సమాచారం. కంగువ చిత్రంలో గిరి వాసుల తరఫున పోరాడే వీరుడు పాత్ర కోసం తనను తాను పూర్తిగా మార్చుకుని నటించిన సూర్య తాజా చిత్రం పురనానూరు కోసం విద్యార్థిగా మారడానికి కసరత్తులు చేస్తున్నారట. సూర్య తన 2 డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం మేలో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.
చదవండి: టాలీవుడ్ డైరెక్టర్లపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment