ఫైల్ ఫోటో
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ మిస్టర్ పర్‌ఫెక్ట్ హీరోకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. దీంతో ఆయన హీరోగా తమిళంలో తెరకెక్కే ప్రతీ సినిమాను తెలుగులోకి డబ్ చేస్తుంటారు. అయితే గతేడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపంచేలేకపోయాయి. అయితే ప్రస్తుతం ఓ విలక్షణమైన కథతో అభిమానుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నారు హీరో సూర్య.
తెలుగులో విక్టరీ వెంకటేష్‌కు ‘గురు’ తో మంచి విజయాన్ని అందించిన దర్శకురాలు సుధ కొంగర డైరెక్షన్‌లో సూర్య ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. సురరై పోట్రుగా తమిళంలో వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమాపై పాజిటీవ్ బజ్ క్రియేట్ అయింది. తాజాగా న్యూఇయర్ కానుకగా సూర్య ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్ర బృందం.
ఈ చిత్రంలో సూర్యకు సంబంధించిన రెండో లుక్‌ను మూవీ యూనిట్ కాసేపటి క్రితమే విడదల చేసింది. డిఫరెంట్ హెయిర్ స్టైల్, మాసిన గడ్డంతో గంభీరంగా ఉన్న సూర్యతో పాటు ఓ పక్షి కూడా పోస్టర్‌లో కనిపిస్తుంది. దీంతో సినిమా కథపై నెటిజన్లు ఏవేవో ఊహించుకుంటున్నారు. ఇక ఈ లుక్‌లో పక్షి ఎందుకు ఉందనే దానిపై నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇక ఈ సినిమాతో సూర్య ఖాతాలో భారీ విజయం పడటం ఖాయమని పలువురు నెటిజన్లు జోస్యం చెబుతున్నారు.
ఈ సినిమాలో అపర్ణా బాలమురళి హీరోయిన్‌గా కాగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. జాకీష్రాఫ్, కరుణాస్‌లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ కానుంది.
Wishing you all a year full of great moments! Here's #SooraraiPottruSecondLook#AakaasamNeeHaddhuRa#SudhaKongara @gvprakash @nikethbommi @Aparnabala2 @gopiprasannaa @2D_ENTPVTLTD @rajsekarpandian @SakthiFilmFctry @guneetm @sikhyaent pic.twitter.com/JXbW2oUSPz
— Suriya Sivakumar (@Suriya_offl) January 1, 2020
Comments
Please login to add a commentAdd a comment