
టాలీవుడ్‌లో ఎన్నో విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న సీనియర్ నటుడు మోహన్ బాబు కొంత కాలంగా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల గాయత్రి సినిమాలో మరోసారి తనదైన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న కలెక్షన్ కింగ్ త్వరలో మరో ప్రయోగానికి రెడీ అవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో మోహన్ బాబు ప్రతినాయక పాత్రల్లో నటించినా.. హీరోగా మారిన తరువాత నెగెటివ్ రోల్స్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఒకటి రెండు సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించినా.. దాదాపు ఆ సినిమాల్లో ఆయనే హీరో.. అన్న స్థాయి పాత్రలు మాత్రమే చేశారు.
అయితే త్వరలో ఓ బైలింగ్యువల్ సినిమా కోసం పూర్తి స్థాయి ప్రతినాయకుడిగా మారబోతున్నారు మోహన్ బాబు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా గురు ఫేం సుధ కొంగర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విలన్ రోల్‌కు మోహన్ బాబు అయితే కరెక్ట్ గా సరిపోతారని చిత్రయూనిట్ ఆయన్ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. తన క్యారెక్టర్‌తో పాటు కథా కథనాలు కూడా నచ్చటంతో విలన్‌గా నటించేందుకు మోహన్ బాబు అంగీకరించారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment