సూర్య ప్లేస్‌లో శివకార్తికేయ.. ఓకే చెప్పిన శ్రీలీల! | Buzz: Sreeleela To Make Her Tamil Debut Opposite Sivakarthikeyan | Sakshi
Sakshi News home page

Sreeleela : సూర్య ప్లేస్‌లో శివకార్తికేయ.. ఓకే చెప్పిన శ్రీలీల!

Published Wed, Aug 28 2024 7:30 AM | Last Updated on Wed, Aug 28 2024 9:39 AM

Buzz: Sreeleela To Make Her Tamil Debut Opposite Sivakarthikeyan

కోలీవుడ్‌ నుంచి శ్రీలీలకు మళ్లీ కాల్‌ వెళ్లిందా అంటే తమిళ పరిశ్రమలో అవుననే మాట వినిపిస్తోంది. ఇంతకుముందు కూడా శ్రీలీలకు తమిళంలో అవకాశాలు వచ్చాయని వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఈసారి ప్రచారంలో ఉన్న వార్త నిజం అని కోలీవుడ్‌ అంటోంది. శివ కార్తికేయన్‌ హీరోగా నటించనున్న ఓ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించనున్నారన్నది ఆ వార్త సారాంశం.

 ‘గురు, ఆకాశం నీ హద్దు రా’ వంటి చిత్రాలతో దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధ కొంగర తెరకెక్కించనున్న చిత్రంలోనే శివ కార్తికేయన్, శ్రీలీల నటించనున్నారని సమాచారం. ఈ ఇద్దరూ పాల్గొనగా ఫొటోషూట్‌ కూడా జరిగిందట. త్వరలో అధికారికంగా ప్రకటిస్తుందట చిత్రబృందం. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో సూర్య హీరోగా నటించాల్సి ఉండగా ఆయన తప్పుకున్న నేపథ్యంలో శివకార్తికేయన్‌ని తీసుకున్నారట. సూర్యతో ‘పురనానూరు’ అనే టైటిల్‌తో తెరకెక్కించనున్నట్లు పేర్కొన్నారు. మరి.. శివ కార్తికేయన్‌తో అనుకుంటున్నది ఈ చిత్రమేనా? అనే విషయం తెలియాల్సి ఉంది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement