
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ క్రేజ్ సంపాదించుకున్న హీరో సూర్య నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల చేయనున్నారు. అపర్ణా బాలమురళి కథానాయికగా నటిస్తుండగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పిల్లా పులి సాంగ్ వీడియో ప్రోమో, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. (మోహన్‌బాబు నా గాడ్ ఫాదర్: సూర్య)
ఈ క్రమంలో సూర్య పుట్టిన రోజు(జూలై 23) కానుకగా ‘కాటుక కనులే’ అంటూ సాగే మరో రొమాంటిక్ సాంగ్ వీడియో ప్రోమోను విడుదల చేసింది చిత్ర బృందం.‘‘కాటుక కనులే మెరిసిపోయే.. పిలడా నిను చూసి.. మాటలు అన్నీ మరచిపోయా నీళ్లే నమిలేసి.. ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెట్టినట్టు.. గుండెకెంత సందడొచ్చెరా...’’ అంటూ సాగే ఈ పాట హీరోహీరోయిన్ల ప్రణయ బంధానికి అద్దం పడుతోంది. సూర్య, అపర్ణ తమ సహజ నటన, నాచురల్ లుక్స్‌తో కట్టిపడేశారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment