అంజలి
నెట్‌ఫ్లిక్స్ తమిళంలో ఓ వెబ్ యాంథాలజీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసింది. ఈ వెబ్ యాంథాలజీ (పలువురు దర్శకులు పలు కథలతో ఒక సినిమాగా రూపొందించడాన్ని యాంథాలజీ అంటారు) రూపొందించడం కోసం నలుగురు దర్శకులను కూడా సంప్రదించింది. గౌతమ్ మీనన్, సుధా కొంగర, వెట్రిమారన్, విఘ్నేష్ శివన్ ఒక్కో భాగాన్ని డైరెక్ట్ చేస్తారు. పరువు హత్యల నేపథ్యంలో ఈ యాంథాలజీ సాగు తుందని సమాచారం. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించే భాగం చిత్రీకరణ కూడా మొదలైందట. ఇందులో అంజలి, బాలీవుడ్ నటి కల్కీ కొచ్లిన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని తెలిసింది. ఇదే అంజలి డిజిటల్ ఎంట్రీ కావడం విశేషం. మిగతా దర్శకుల భాగాల్లో నటించే వారి వివరాలు తెలియాలి.
Comments
Please login to add a commentAdd a comment