vetrimaran
-
హీరోగా స్టార్ కమెడియన్.. మరో మాస్ చిత్రం రెడీ
తెలుగులో తక్కువ గానీ తమిళంలో పలువురు కమెడియన్స్ కూడా హీరోలుగా రాణిస్తున్నారు. సంతానం.. ఇలా ఇప్పటికే పలు చిత్రాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. తాజాగా కమెడియన్ సూరి కూడా డిఫరెంట్ మూవీస్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైపోతున్నాడు. గతేడాది 'విడుదలై' మూవీతో హీరోగా ఆకట్టుకున్న ఇతడు.. ఇప్పుడు 'గరుడన్'గా వచ్చేందుకు రెడీ అయిపోయాడు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ రాసిన స్టోరీతో 'గరుడన్' మూవీ తీశారు. ఇందులో సూరితో పాటు శశి కుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్లో యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది. అలానే హీరోని కుక్కతో పోల్చుతూ చెప్పిన డైలాగ్స్, విజువల్స్ కూడా సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. త్వరలో విడుదల తేదీతో పాటు ఇతర వివరాలు వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) -
సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. విజయ్ సేతుపతికి జోడీగా మలయాళ బ్యూటీ
మలయాళ నటి మంజు వారియర్‌కు కోలీవుడ్లోకి అవకాశాలు వరుస కడుతున్నాయి. మాలీవుడ్‌లో ప్రముఖ కథానాయకిగా రాణించిన ఈ భామ అక్కడ ఒక సమస్యలో ఇరుక్కోవడంతో నటనకు చిన్న గ్యాప్ వచ్చింది. ఆ సమస్య నుంచి బయట పడడంతో మళ్లీ నటనపై దృష్టి సారించింది. ఇలా ధనుష్‌కు జంటగా అసురన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించడంతో మంజు వారియర్ ఇక్కడ మంచి మార్కెట్ వచ్చింది. ఆ తరువాత తుణివు తదితర చిత్రాల్లో నటించిన ఈమె తాజాగా రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 170 చిత్రం కాగా రెండోది విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న విడుదలై 2. హాస్య నటుడు సూరిని హీరోగా పరిచయం చేస్తూ వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విడుదలై చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రను పోషించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం విడుదలై 2 చిత్ర షూటింగ్ జరుగుతోంది. తొలి భాగంలో నటుడు సూరి పాత్రకు ప్రాధాన్యతనిచ్చిన దర్శకుడు వెట్రిమారన్ రెండో భాగంలో విజయ్ సేతుపతి పాత్రను హైలైట్ చేసి షూటింగ్‌ను నిర్వహిస్తున్నారని తెలిసింది. కాగా ఇందులో ఆయనకు జంటగా నటి మంజు వారియర్‌ను ఎంపిక చేశారు. ఇందులో ఈమె పల్లెటూరి యువతిగా నటిస్తోంది. ఈ జంటకు సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. విడుదలై 2 చిత్రాన్ని 2024లో సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. -
తమిళ స్టార్ డైరెక్టర్స్‌తో రామ్‌చరణ్.. ఎందుకు కలిశాడు?
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. అలానే తన తర్వాతి చిత్రం కోసం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబుతో కలిసి పనిచేయబోతున్నాడు. దీని తర్వాత చేయబోయే మూవీ కోసం లోకేశ్ కనగరాజ్ లాంటి దర్శకులు పేర్లు వినిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: డబ్బు చుట్టూ తిరుగుతున్న తెలుగు సినిమా.. ఎందుకు?) ఇలా రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైనప్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి టైంలో తమిళ టాప్ డైరెక్టర్స్‌తో కలిసి రామ్ చరణ్ కనిపించాడు. దీనికి కారణం దర్శకుడు శంకర్ పుట్టినరోజు కావడం. 'గేమ్ ఛేంజర్' సెట్లో ఆల్రెడీ బర్త్ డే జరుపుకొన్న శంకర్.. చెన్నై స్పెషల్‌గా పార్టీ అరేంజ్ చేశారు. ఈ పార్టీలో లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, వెట్రిమారన్, వెంకట్ ప్రభు, ఎస్జే సూర్య లాంటి దర్శకులు కనిపించారు. అయితే ఇది కేవలం పార్టీగా అయితే ఉండిపోదు. బహుశా ఈ దర్శకుల్లో చరణ్ తో సినిమా చేసే ప్లాన్ కూడా ఉండొచ్చు. కాబట్టి త్వరలో చరణ్-మరో తమిళ స్టార్ డైరెక్టర్ కాంబోలో ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. (ఇదీ చదవండి: మెగాస్టార్ కొత్త సినిమా.. హారర్ థ్రిల్లర్ కథతో!) -
ప్లాన్ మారింది.. స్టార్ హీరోయిన్ వచ్చింది!
విజయ్ సేతుపతి పేరు చెప్పగానే వైర్సటైల్ నటుడు అనే పదం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరో అని మాత్రమే కాకుండా విలన్, సైడ్ క్యారెక్టర్స్, గెస్ట్ రోల్స్.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైపోతున్నాడు. ప్రస్తుతం అటు సినిమాలు.. ఇటు ఓటీటీలో వెబ్ సిరీసులు అన్నీ కవర్ చేస్తున్నాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు) ఈ ఏడాది విజయ్ సేతుపతి నటించిన సినిమాల్లో 'విడుదలై-1' ఒకటి. కమెడియన్ సూరిని హీరోగా పరిచయం చేస్తూ వెట్రిమారన్ తీసిన మూవీ ఇది. ఇందులో సేతుపతి నటించాడు కాకపోతే ఒకటి రెండు సీన్లకే పరిమితం చేశారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు చాలారోజుల క్రితమే ప్రకటించారు. రెండో భాగాన్ని చాలావరకు షూట్ చేసిన వెట్రిమారన్.. ఇప్పుడు చిన్నచిన్న మార్పులు, చేర్పులు చేసి మళ్లీ చిత్రీకరణ జరుపుతున్నాడట. సీక్వెల్లో విజయ్ సేతుపతికి జోడీని చేర్చారు. ఆ పాత్రని మలయాళ నటి మంజు వారియర్ చేస్తున్నారు. ఈ జంటకి సంబంధించిన సీన్స్‌ని చిరుమలై ప్రాంతంలో తీస్తున్నారు. త్వరలో థియేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం. (ఇదీ చదవండి: వివాదంలో 'బిగ్ బాస్'.. మొదలవడానికి ముందే!) -
భారీ బడ్జెట్‌తో విజయ్ సేతుపతి ‘విడుదల’, రూ. 10 కోట్లతో రైలు సెట్
విజయ్ సేతుపతి ఉపాధ్యాయుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘విడుదలై’ (విడుదల). కానిస్టేబుల్ పాత్రను సూరి చేస్తున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్, ఉదయనిధి స్టాలిన్ రెండు భాగాలుగా నిర్మిస్తున్న చిత్రం ఇది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మొదటి భాగం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కళా దర్శకుడు జాకీ నేతృత్వంలో రూ. 10 కోట్లతో రైలు, రైలు బ్రిడ్జి సెట్ రూపొందించాం. అలాగే సిరుమలై ప్రాంతంలో పల్లెటూరి నేపథ్యంలో భారీ సెట్ నిర్మించాం. ప్రస్తుతం యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో కొడైకెనాల్లో సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాం. ఇందులో బల్గేరియా నుండి తమిళనాడుకి వచ్చిన స్టంట్ బృందం పాల్గొంటోంది’’ అన్నారు. భవాని శ్రీ, ప్రకాశ్‌రాజ్, గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: వేల్రాజ్. -
తమిళ దర్శకుడితో తారక్ సినిమా.. కథ ఓకేనా !
Jr NTR Movie With Vetrimaaran: జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. రికార్డు స్టాయిలో కలెక్షన్స్ రాబట్టి రూ. 1200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. దీంతో ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ఆస్వాదిస్తున్నాడు. అలాగే తన తదుపరి చిత్రాలపై ఆచితూచి అడుగు వేస్తున్నాడు. ప్రశాంత్ నీల్, కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క ఎన్టీఆర్, తమిళ దర్శకుడు వెట్రిమారన్ కాంబోలో ఓ సినిమా రూపొందనుందనే టాక్ గత కొన్నాళ్లుగా వినిపిస్తోంది. అయితే ఇటీవల ఎన్టీఆర్‌ను వెట్రిమారన్ కలిసి ఓ కథను వినిపించారనే వార్త ఇప్పుడు మళ్లీ ప్రచారంలోకి వచ్చింది. సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడివాసల్’ తెరకెక్కుతోంది. సో.. ఇటు ఎన్టీఆర్, అటు వెట్రిమారన్ వారి ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో వీరి కాంబినేషన్లో సినిమాపై స్పష్టత రావడానికి మరికొంత సమయం వేచిచూడాలి. చదవండి: 👇 మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ -
ధనుష్‌ను వరించిన బ్రిక్స్ అవార్డు.. ఎందుకో తెలుసా ?
Hero Dhanush Got Best Actor Award In BRICS Film Festival: తమిళ స్టార్ హీరో ధనుష్‌కు మరో గౌరవం దక్కింది. నవంబర్ 28న జరిగిన బ్రిక్స్ (BRICS) ఫిల్మ్ ఫెస్టివల్లో 'అసురన్' చిత్రానికి గాను ధనుష్‌ని ఉత్తమ నటుడి అవార్డు వరించింది. ఇటీవల గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IIF)తో పాటు బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా జరిగింది. ఈ ఆనందకర విషయాన్ని ధనుష్ ట్విటర్లో పంచుకున్నాడు. ఈ అవార్డు గురించి చెబుతూ 'ఒక పరిపూర్ణ గౌరవం' అని ట్వీట్ చేశాడు. అలాగే ఈ సినిమాకు 3 జాతీయ అవార్డులు వచ్చాయి. వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. An absolute honour 🙏🙏🙏 pic.twitter.com/DBPo5mTJGV — Dhanush (@dhanushkraja) November 28, 2021 ఈ అసురన్ సినిమా పూమణి రచించిన వెక్కయ్ నవల ఆధారంగా తీసిన పీరియాడికల్ చిత్రం. ఇందులో ధనుష్, మంజూ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 'అసురన్' సినిమాను 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో 'ఉత్తమ విదేశీ చిత్రం' కేటగిరీ కింద ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్, ప్రియమణి లీడ్ రోల్స్‌లో నారప్ప పేరుతో రీమెక్ చేసిన సంగతి తెలిసిందే. ధనుష్ చివరిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన జగమే తంధిరమ్ సినిమాలో నటించాడు. ఇది నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం మారన్, తిరుచిత్రంబళం షూటింగ్లో బిజీగా ఉన్నాడు ధనుష్. -
దమ్మున్న దర్శకుడు.. 14 ఏళ్లలో ఐదు బ్లాక్బస్టర్లు
Happy Birthday Vetrimaaran: పన్నేండేళ్ల సినీ జర్నీలో(మొత్తం పద్నాలుగు ఏళ్లు) ఇప్పటిదాకా తీసింది ఐదే ఐదు సినిమాలు. అన్నీ ఆడియెన్స్‌ని కదిలించే కథలు. పైగా బ్లాక్‌బస్టర్ హిట్స్ కూడా.. ఒక స్ట్రాంగ్ స్టోరీని, అంతే పవర్‌ఫుల్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేయగలిగే దమ్మున్న దర్శకుడతను, ఆయన టేకింగ్ మాత్రమే కాదు.. ఎంచుకునే స్టోరీ లైన్ దగ్గరి నుంచి తెరకెక్కించే ప్రతీ ఫ్రేమ్‌లోనూ ఏదో ఒక డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తుంది. అందుకే అంతా వెట్రిమారన్‌ను విలక్షణ దర్శకుడిగా పిల్చుకుంటారు. ఇవాళ (సెప్టెంబర్ 4) వెట్రిమారన్ పుట్టినరోజు.. వెబ్ డెస్క్ స్పెషల్: దర్శకుడు వెట్రిమారన్.. ఎంత లేట్ అయినా సరే కంటెంట్ ఉన్న సినిమా అందిస్తాడనే ఒక నమ్మకం కోలీవుడ్ ఆడియెన్స్‌కి ఉంది. ఆ నమ్మకానికి తగ్గట్లే సినిమాలు ఆడుతుంటాయి. అయితే ఒక సినిమా కోసం గ్రౌండ్ వర్క్ చేసేందుకే ఏళ్ల తరబడి టైం తీసుకుంటాడు వెట్రిమారన్. సెట్ ప్రాపర్టీస్, కాస్టూమ్స్, లొకేషన్స్.. ఇలా ప్రతీదాంట్లోనూ కథ కనిపించేలా చూసుకుంటాడు. ఎక్కడా ఏ ఎలిమెంటూ మిస్ కాదు. ఆర్ట్ డైరెక్టర్, వెట్రిమారన్ హార్డ్ వర్క్ కనిపించేది మొత్తం ఇక్కడే. అంతా రెడీ అయ్యాక షూటింగ్‌ని చకచకా కానిచ్చేస్తాడు. ఇంత పర్ఫెక్ట్గా సినిమాలు తీస్తున్నా.. తానొక గుడ్ డైరెక్టర్ కాదనేది అతని ఫీలింగ్. ‘సినిమాలో సీన్లను అప్పటికప్పుడు సిచ్యుయేషన్ని బట్టి మార్చాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు కథను నేను అనుకున్నట్లు తీయలేకపోతున్నా. ఆడియెన్స్‌కి నా కథను కరెక్ట్‌గా కన్వే చేయలేనప్పుడు నేను మంచి దర్శకుడిని ఎలా అవుతా?!’ అని అంటాడు ఆయన. కాంట్రవర్సీ కాకూడదనే.. ప్రతీ దర్శకుడికి ఒక సెపరేట్ స్టైల్ ఉంటుంది. వెట్రిమారన్ స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకప్పుడు భాషలకతీతంగా జమీందార్లు, ఉన్నత కుటుంబాల కథలను ప్రధానంగా చేసుకుని సినిమాలు వచ్చేవి. రిచ్‌నెస్ అనేది సినిమాలో గ్రాండ్‌గా కనిపించేది. కానీ, కోలీవుడ్‌లో పా రంజిత్, మారి సెల్వరాజ్ లాంటి దర్శకులు ఆ పరిస్థితి మార్చేశారు. పేద–దళిత నేపథ్యాల్ని హైలెట్ చేస్తూ సినిమాలు తీయడం మొదలుపెట్టారు. వీళ్లలో వెట్రిమారన్ మాత్రం కథకి కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడించి మరీ తీస్తున్నాడు. అలాగని అవి రెగ్యులర్ సినిమాల్లాగా ఉండవు. సబ్జెక్ట్ ఎలాంటిదైనా సరే తన సినిమాలో కచ్ఛితంగా ఐదు ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటాడు. ► ‘లొకేషన్’.. సినిమాలోని క్యారెక్టర్ స్వభావానికి తగ్గట్లే బ్యాక్‌డ్రాప్ లొకేషన్ ఉంటుంది. ► రెండోది.. మల్టీపుల్ ప్లాట్లైన్స్, చాలా క్యారెక్టర్లు గజిబిజితో కూడిన ప్లాట్లైన్స్ కథతో సమానంగా రన్ అవుతుంటాయి(వడ చెన్నై). ► మూడు.. బ్లాక్ అండ్ వైట్ షాట్స్, సిచ్యుయేషన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన సీన్లు బ్లాక్ అండ్ వైట్ కలర్లోకి మారిపోతుంటాయి. ► నాలుగు.. స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. సినిమాలో పాటలు ఒక సీక్వెన్స్‌లో రావు. కానీ, అవి సీన్‌కి కనెక్ట్ అవుతాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సిచ్యుయేషన్‌కి తగ్గట్లు చాలా సెన్సిబుల్‌గా ఉంటుంది. ► ఐదు.. లిప్‌సింక్ మ్యాచ్ కాకపోవడం. వెట్రిమారన్ సినిమాలు ఒరిజినల్ వెర్షనల్లో లిప్‌సింక్ కచ్ఛితంగా మిస్ అవుతుంది. అందుకు రీజన్ కాంట్రవర్సీ కాకూడదనే ఉద్దేశంతోనే డైలాగులను అప్పటికప్పుడు మార్చాల్సి రావడం. ‘వడచెన్నై’ విషయంలో డైలాగుల వివాదం ముదరడంతో వెట్రిమారన్, జాలర్లకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆణిముత్యాల్లాంటి ఐదు సినిమాలు సెప్టెంబర్ 4 1975 కడలూరు(తమిళనాడు)లో పుట్టిన వెట్రిమారన్.. ఇంగ్లీష్ లిటరేచర్ చేశాడు. సినిమా ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్‌తో మాస్టర్ డిగ్రీ డిస్కంటిన్యూ చేశాడు. కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు బాలు మహేంద్ర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొన్నేళ్లపాటు పని చేశాడు. సోలో డైరెక్టర్‌గా చేసిన తొలి ప్రయత్నానికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. నిర్మాతలంతా హ్యాండ్ ఇవ్వడంతో డ్రీమ్ ప్రాజెక్ట్ ‘దేస్యా నెడుంచలై 47’ కలగానే మిగిలింది. ఆ తర్వాత ‘పొల్లాదావన్’తో డైరెక్టర్‌గా మారాడు. * పొల్లాదవన్(2007).. తండ్రిని కష్టపెట్టి బైక్ కొన్న ఒక మిడిల్‌క్లాస్ కుర్రాడికి.. ఒక రౌడీ గ్యాంగ్ నుంచి ఎదురయ్యే కష్టాలు.. వాటిని నుంచి అతను బయట ఎలా పడతాడనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ధనుష్ హీరోగా వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయ్యింది. వెట్రిమారన్ మిగతా సినిమాల్లో ఇదొక్కటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. తెలుగులో ఈ సినిమానే ‘కుర్రాడు’ పేరుతో వరుణ్ సందేశ్ హీరోగా రీమేక్ చేశారు. ఆడుకాలమ్(2011).. కోళ్ల పందెల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. గురువు పెట్టైకారన్కి అనుచరుడు కరుప్ఫు ఎదురు తిరిగాక.. వాళ్లిద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపు తిరుగుతుందనేది థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కరుప్పు క్యారెక్టర్లో ధనుష్ నటించాడు. 58వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ యాక్టర్ అవార్డులను ఆడుకాలమ్ సొంతం చేసుకుంది. విసారణై(2016)(తెలుగులో విచారణ).. సౌత్ ఇండియన్ సినిమాకి ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చిన సినిమాల్లో ఇది ఒకటి. నలుగురు కుర్రాళ్లను చేయని దొంగతనం కేసులో పోలీసులు(తెలుగు) హింసించడం, అనుకోని పరిస్థితుల్లో మరొక అధికారి(తమిళ) చేతుల్లో చిక్కుకోవడం, చివరకు ఆ అమాయకులు కథ ఎన్కౌంటర్లో సమాప్తం కావడం.. ప్రధానంగా థర్డ్ డిగ్రీ చుట్టూ తిరిగే కథ విసారణై. 63వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తమిళ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్(సముద్రఖని), బెస్ట్ ఎడిటింగ్ కేటగిరీలో అవార్డులు దక్కించుకుంది. అంతేకాదు 2017లో 89వ ఆస్కార్ అవార్డ్స్ ‘ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ మూవీ’ కేటగిరీలో ఈ సినిమా(ఇంటరాగేషన్ పేరుతో) ఎంపికైంది. కానీ, సరైన ప్రమోషన్ లేకపోవడంతో అవార్డు దక్కించుకోలేకపోయింది. వడచెన్నై (2018).. డిఫరెంట్ టైమ్ లైన్లతో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా. క్యారమ్ ప్లేయర్ అయిన అన్బు(ధనుష్), అనుకోని పరిస్థితుల్లో లోకల్ గ్యాంగ్‌స్టర్స్‌తో చేతులు కలుపుతాడు. అయితే వాళ్ల వల్ల తన వాడ ప్రజలకే ముప్పు ఏర్పడుతుంది. సొంత వాళ్లను కాపాడుకునేందుకు అన్బు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది కథ. దీనికి సమాంతరంగా సాగే రాజన్ కథ.. సినిమాను మరింత పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేస్తుంది. హీరో ధనుష్‌కి ఇది తొలి భారీ కమర్షియల్ సక్సెస్. దీనికి సీక్వెల్స్ రావాల్సి ఉంది. అసురన్ (2019).. వెట్రిమారన్ జెట్ స్పీడ్‌తో తీసిన ఏకైక సినిమా ఇది. తమిళనాడులోని పంచమీ భూముల హక్కుల బ్యాక్ డ్రాప్‌తో ఈ స్టోరీ నడుస్తుంది. బ్రిటీషర్లు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్లకు ఇచ్చిన భూములవి. వాటిని దళితులు ఇతరులకు ఇవ్వడానికి, అమ్ముకోవడానికి వీల్లేదు. కానీ, శివసామి(ధనుష్) అనే వ్యక్తి భూములపై కొందరు కన్నేస్తారు. ఈ క్రమంలో శివసామి కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. చిన్నకొడుకును కాపాడుకునే క్రమంలో శివసామి ఎలాంటి కష్టాలు పడతాడనేది మిగతా కథ. రచయిత పూమణి ‘వెక్కై’ నవల ఇన్స్పిరేషన్తో ఈ సినిమా తెరకెక్కించాడు వెట్రిమారన్. సెన్సేషన్ హిట్ అయిన ఈ మూవీ తెలుగులో వెంకటేష్ హీరోగా ‘నారప్ప’ పేరుతో రీమేక్ అయ్యింది. ఈ ఐదు సినిమాలతో పాటు నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన పావా కదైగళ్ ఆంతాలజీలో ఊర్ ఇరవు(సాయి పల్లవి, ప్రకాష్ రాజ్ సెగ్మెంట్)ను డైరెక్ట్ చేశాడు. వెట్రిమారన్ అప్‌కమింగ్ మూవీలు విడుతలై(పరోటా సూరి లీడ్రోల్లో), వాడివాసల్(సూర్య హీరోగా). ధనుష్‌తోనే అటాచ్మెంట్ ధనుష్‌ను పర్ఫెక్ట్ హీరోగా మార్చేసింది, దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది వెట్రిమారన్ అనడం అతిశయోక్తేం కాదు. వెట్రిమారన్ ఫస్ట్ అనుకున్న ప్రాజెక్ట్ ‘దేస్యా నెడుంచలై 47’ ధనుష్‌తోనే తెరకెక్కాల్సింది. కానీ, నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయ్యింది. అదే టైంలో ధనుష్ సహకారంతోనే ‘పొల్లాదావన్’ సినిమా పట్టాలెక్కడం విశేషం. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మరింత బలపడింది. అయితే ధనుష్ తోనే సినిమాలన్నీ తీయడానికి కారణం ఆ ఫ్రెండ్షిప్ మాత్రం కాదని చెప్తుంటాడు వెట్రిమారన్. డైరెక్టర్‌గానే కాదు.. ప్రొడ్యూసర్‌గా కూడా వెట్రిమారన్ ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు నిర్మించాడు. ‘ఉదయం ఎన్‌హెచ్4, నాన్ రాజవగా పొగెరిన్, పొరియాలన్, కాక్క ముట్టై, విసారణై, కోడి, లెన్స్, అన్నానుక్కు జై, వడచెన్నై, మిగ మిగ అవసరం’ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. వీటిలో ధనుష్‌తో కలిసి కో–ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఉన్నాయి. -
ఆ వార్తల్లో నిజం లేదు
‘ఆకాశమే నీ హద్దురా!’ విజయంతో మంచి జోష్ మీద ఉన్నారు సూర్య, ఆయన అభిమానులు. పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా, వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యారు సూర్య. అయితే వెట్రిమారన్‌తో చేయాల్సిన సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.. ఆ వార్తల్లో ఎలాంటి నిజంలేదని చిత్రబృందం ప్రకటించింది. ‘వడివాసల్’ అనే నవల ఆధారంగా వెట్రిమారన్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుంది. కలైపులి యస్. థాను నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. ఇందులో సూర్య తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ‘‘వడివాసల్’ సినిమా ఆగిపోయిందని వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అసత్యపు వార్తలను నమ్మొద్దు. ఈ సినిమాను త్వరలోనే ప్రారంభిస్తాం. కచ్చితంగా విజయం సాధిస్తాం’’ అన్నారు థాను. ఇందులో ఆండ్రియా హీరోయిన్గా నటించనున్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో సినిమాను పూర్తి చేసిన తర్వాత ‘వడివాసల్’ సినిమా మొదలుపెడతారు సూర్య. -
ఆ రెండు పాత్రల్లో మూడోసారి
హీరో సూర్య మరోసారి తండ్రీ కొడుకుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇప్పటికే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘వారనమ్ ఆయిరమ్’ (సూర్య సన్నాఫ్ కృష్ణన్), విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘24’ చిత్రాల్లో సూర్య తండ్రీకొడుకు పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘వాడీ వాసల్’ అనే చిత్రంలోనూ తండ్రీకొడుకుగా నటించనున్నారట. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రారంభించనున్నారు. తమిళనాడులో ప్రతి ఏటా నిర్వహించే జల్లికట్టు ఆధారంగా ఈ చిత్రం నిర్మించనున్నారు. జల్లికట్టులో భాగంగా ఎద్దును మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తండ్రి పాత్ర తన ప్రాణాలు కోల్పోయే సన్నివేశం ఉందట. తండ్రి పాత్రకు సీనియర్ నటులు సత్యరాజ్, రాజ్కిరణ్లను అనుకున్నారట. అయితే ఫైనల్‌గా తండ్రి పాత్రని కూడా సూర్య చేయనున్నారట. -
చైనాకు అసురన్
చైనా థియేటర్స్‌లో ‘అసురన్’ కనిపించబోతున్నాడు. ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘అసురన్’. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్ సాధించింది. ఈ చిత్రం తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ అవుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటిస్తున్నారు. ‘అసురన్’ చిత్రం కన్నడ, హిందీ భాషల్లో కూడా రీమేక్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న ఈ చిత్రం చైనా భాషలో డబ్బింగ్ కానుందట. ఇందుకు తగ్గ కార్యక్రమాలపై ‘అసురన్’ చిత్రబృందం దృష్టి పెట్టిందని కోలీవుడ్ టాక్. ‘బాహుబలి’, ‘దంగల్’ వంటి చిత్రాలు చైనీస్ బాక్సాఫీసు వద్ద భారతీయ సినిమా సత్తా చాటాయి. మరి...‘అసురన్’ కూడా చైనాలో సక్సెస్ అవుతుందా? వెయిట్ అండ్ సీ. -
ఈ కాంబినేషన్ సూర్యను గట్టెక్కిస్తుందా?
తమిళంలో ఘన విజయాన్ని నమోదు చేసుకున్న ‘అసురన్’ చిత్ర దర్శకుడు వెట్రిమారన్ మరో సినిమాకు సిద్ధమైపోయాడు. అసురన్ హిట్‌తో మంచి ఫామ్‌లో ఉన్న ఈ దర్శకుడు తన తదుపరి సినిమా తమిళ స్టార్ సూర్యతో చేయబోతున్నాడని కోలీవుడ్ పరిశ్రమ కోడై కూసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్షరాలా అదే జరగబోతుంది. గత కొంతకాలంగా సరైన హిట్లు అందుకోలేకపోతున్న సూర్యతో వెట్రిమారన్ సినిమా చేయనున్నాడు. వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి ఎస్ థను ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ‘దర్శకుడు వెట్రిమారన్ తొలిసారి సూర్యతో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో నేను భాగస్వామినైనందుకు ఆనందంగా ఉంది’ అని నిర్మాత ఎస్ థను పేర్కొన్నాడు. కాగా ఇది సూర్యకు 40వ సినిమా కావడం విశేషం. సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మరి వీరి కాంబినేషన్ సూర్యకు కలిసొస్తుందో లేదో చూడాలి. కాగా సూర్య తాజాగా నటించిన ‘సూరరై పోట్రు’ వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో సూర్య తొలిసారిగా రాప్ సాంగ్ పాడాడు. ఇది తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా ద్వారానైనా సూర్య తన అభిమానులకు గిఫ్ట్ ఇస్తాడో, నిరాశ కలిగిస్తాడో వేచి చూడాలి. -
డిజిటల్ ఎంట్రీ
‘లస్ట్‌స్టోరీస్’ ఆంథాలజీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది ఆన్లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్. అదే ‘లస్ట్‌స్టోరీస్’తో టాలీవుడ్‌లోనూ అడుగుపెడుతోంది. తాజాగా కోలీవుడ్‌లోనూ నెట్‌ఫ్లిక్స్ ఓ ఆంథాలజీతో అడుగుపెట్టనుంది. నలుగురు దర్శకులు నాలుగు కథలను కలిపి ఓ చిత్రంగా మలచడమే ఆంథాలజీ. ఈ తమిళ ఆంథాలజీ పరువు హత్యలు ఆధారంగా ఉంటాయని తెలిసింది. తమిⶠదర్శకులు గౌతమ్ మీనన్, సుధా కొంగర, విఘ్నేశ్ శివన్, వెట్రిమారన్ ఈ ఆంథాలజీను తెరకెక్కిస్తారట. వెట్రిమారన్ రూపొందించే భాగంలో సాయిపల్లవి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. కాగా సాయి పల్లవికి తొలి డిజిటల్ ఎంట్రీ ఇదే కానుంది. సాయిపల్లవి, ప్రకాశ్ రాజ్ తండ్రీకూతుళ్లుగా నటించనున్న ఈ ఆంథాలజీ డిసెంబర్లో షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే అంజలి ప్రధాన పాత్రలో విఘ్నేశ్ శివన్ తన భాగానికి సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తి చేశారట. -
డిజిటల్ ఎంట్రీ
నెట్‌ఫ్లిక్స్ తమిళంలో ఓ వెబ్ యాంథాలజీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసింది. ఈ వెబ్ యాంథాలజీ (పలువురు దర్శకులు పలు కథలతో ఒక సినిమాగా రూపొందించడాన్ని యాంథాలజీ అంటారు) రూపొందించడం కోసం నలుగురు దర్శకులను కూడా సంప్రదించింది. గౌతమ్ మీనన్, సుధా కొంగర, వెట్రిమారన్, విఘ్నేష్ శివన్ ఒక్కో భాగాన్ని డైరెక్ట్ చేస్తారు. పరువు హత్యల నేపథ్యంలో ఈ యాంథాలజీ సాగు తుందని సమాచారం. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించే భాగం చిత్రీకరణ కూడా మొదలైందట. ఇందులో అంజలి, బాలీవుడ్ నటి కల్కీ కొచ్లిన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని తెలిసింది. ఇదే అంజలి డిజిటల్ ఎంట్రీ కావడం విశేషం. మిగతా దర్శకుల భాగాల్లో నటించే వారి వివరాలు తెలియాలి. -
హీరో సూరి
హీరోగానూ నిరూపించుకోవాలనే హాస్య నటుల ప్రయత్నాలు ఏ ఇండస్ట్రీలో అయినా సాగుతూనే ఉంటాయి. వడివేలు, సంతానం, వివేక్, యోగిబాబు వంటి తమిళ హాస్యనటులు హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. ఈ జాబితాలోకి మరో కమెడియన్ సూరి కూడా చేరారు. ‘పరోటా’ సూరిగా తమిళంలో సూరి ఫేమస్. ఇప్పుడు సూరి హీరోగా చేయనున్న చిత్రానికి ‘ఆడుకాలమ్, వడ చెన్నై, అసురన్’ వంటి విలక్షణ చిత్రాలను తెరకెక్కించిన వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నారు. కమెడియన్‌గా మంచి మార్కులు కొట్టేసిన సూరి హీరోగా ఎన్ని మార్కులు దక్కించుకుంటారో చూడాలి. -
అసురన్ మొదలెట్టాడు
ధనుష్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘అసురన్’. వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మంజు వారియర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శనివారం మొదలైంది. అలాగే ఈ సినిమా కొత్త లుక్స్‌ను కూడా విడుదల చేశారు చిత్రబృందం. ఇక్కడున్న తాజా పోస్టర్‌ను గమనిస్తే... బ్లాక్ అండ్ వైట్ కాలానికి తీసుకెళతారేమో అనిపిస్తోంది కదూ. సినిమాలో ఇది ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌గా వచ్చే అవకాశం ఉందని టాక్. ధనుష్–వెట్రిమారన్ కాంబినేషన్లో వస్తున్న ఈ నాలుగో చిత్రం ఇది. ఇంతకుముందు ‘ఆడుకాలమ్, పొల్లాదవన్, వడచెన్నై’ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సంగతి ఇలా ఉంచితే... సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలో ధనుష్ ఇటీవల రెండు సినిమాలు కమిట్ అయ్యారు. ఈ సినిమాలు కూడా ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్తాయన్నది కోలీవుడ్ టాక్. -
దేనికైనా టైమ్ రావాలి
బ్యాడ్ టైమ్‌లో బాధపడి లాభం లేదు. ఓపిక పట్టాలి. దేనికైనా టైమ్ రావాలి అంటున్నారు కథానాయిక ఆండ్రియా జెర్మియా. ఎప్పుడూ స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. ఏ విషయం గురించైనా ధైర్యంగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఇలా సడన్‌గా ఫిలసాఫికల్ టర్న్ ఎందుకు తీసుకున్నారు? అని ఆండ్రియాని అడిగితే... ‘‘బేసిగ్గా నాకు కాస్త ఓపిక తక్కువ. అన్నీ వెంట వెంటనే జరిగిపోవాలని ఆరాట పడతాను. ‘‘తారామణి’ సినిమాకు మంచి అప్రిషియేషన్ దక్కిన తర్వాత నాకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయని ఊహించుకున్నాను. కానీ అలా జరగలేదు. కాస్త దిగులు పడ్డాను. ‘ఇప్పుడు ఆఫర్స్ రావడం లేదని బాధపడకు. అందరూ ఇప్పుడే నీ కోసం పాత్రలు రాస్తూ ఉండొచ్చు. రానున్న రోజుల్లో పుల్ బిజీగా ఉంటావ్’ అని దాదాపు ఎనిమిది నెలల క్రితం దర్శకుడు వెట్రిమారన్ ధైర్యం చెప్పారు. ఎగ్జాట్లీ ఆయన చెప్పినట్లే ఇప్పుడు జరుగుతోంది. మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అప్పుడు అర్థం అయ్యింది.. దేనికైనా టైమ్ రావాలని. ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో ఏమాత్రం కంగారు పడటం లేదు. జాగ్రత్తగా ఆలోచించుకుని ఓర్పుతో నేర్పుగా ముందడుగు వేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. -
అన్బు అక్టోబర్‌లో వస్తున్నాడు
దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘వడ చెన్నై’. ‘పొల్లాదవన్’, ‘ఆడుకలమ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘వడ చెన్నై’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం రిలీజ్ డేట్ కోసం ధనుష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాటికి ఫుల్స్టాప్ పెడుతూ ‘‘అన్బు (ధనుష్ పాత్ర పేరు) మీ అందరి దగ్గరకు అక్టోబర్ 17న వస్తున్నాడు’’ అని సినిమా టీమ్ పేర్కొంది. వాస్తవానికి ‘వడ చెన్నై’ని రెండు భాగాలుగా తీస్తున్నారు. ఫస్ట్ పార్ట్ అక్టోబర్‌లో వస్తుంది. సెకండ్ పార్ట్ రిలీజ్‌ను ప్రకటించలేదు. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ధనుష్ క్యారమ్‌బోర్డ్ ప్లేయర్‌గా కనిపిస్తారట. ఆండ్రియా, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. -
బర్త్‌డే స్పెషల్
‘పొల్లాదవన్, ఆడుకుళం’ వంటి బ్లాక్బాస్టర్ హిట్స్ తర్వాత దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్ మూడోసారి ‘వడ చెన్నై’ సినిమా కోసం కలిశారు. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. రెండు పార్ట్స్‌గా రిలీజ్ కానున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ఆండ్రియా, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. వండర్‌బార్ ఫిల్మ్ బ్యానర్‌పై ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్ ఇవ్వనున్నారు ధనుష్. ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ ట్రైలర్‌ని బర్త్‌డే స్పెషల్‌గా జూలై 28న రిలీజ్ చేసి, సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం పేర్కొంది. -
నార్త్ చెన్నై కుర్రాడి కథ
‘ఆడుకలమ్’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘వడ చెన్నై’. మూడు పార్ట్స్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నేషనల్ లెవల్ క్యారమ్ ప్లేయర్ క్యారెక్టర్లో కనిపించనున్నారు ధనుష్. నార్త్ చెన్నైలో 35 సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటనల సమాహారంగా ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, ఆండ్రియా హీరోయిన్లుగా కనిపించనున్నారు. సంతోశ్ నారాయణ్ సంగీతం సమకూరుస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, ధనుష్, వెట్రిమారన్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘బెస్ట్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే, హీరో’ విభాగాల్లో నేషనల్ అవార్డ్ సాధించిన ‘ఆడుకలమ్’ సినిమా తర్వాత ఆ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగా పెట్టుకున్నారు ధనుష్ అభిమానులు. -
వెట్రిమారన్ దర్శకత్వంలో జీవీ
జీవీ.ప్రకాశ్‌కుమార్ ఈ పేరే ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌హాట్‌గా వినిపిస్తోంది. ఒక పక్క సంగీతదర్శకుడిగా, మరో పక్క కథానాయకుడిగా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే అరడజను చిత్రాల్లో నటిస్తున్న జీవీ కొత్త సంవత్సరంలో మరింత వేగం పెంచుతున్నారు. ఇటీవలే ఈటీ చిత్రం ఫేమ్ రవిఅరసు దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపిన ఈ యువ నటుడు తాజాగా మరో చిత్రానికి సై అన్నట్లు సమాచారం. దర్శకుడు వెట్రిమారన్ కు జీవీకి మధ్య మంచి ర్యాప్ ఉందని చెప్పవచ్చు. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన పొల్లాదవన్, ఆడుగళం, విచారణై చిత్రాలకు జీవీనే సంగీతదర్శకుడన్నది గమనార్హం. ఈ మూడు చిత్రాలు మంచి విజయాన్నే సాధించాయి. ఇక ఈ మూడు చిత్రాలతో నటుడు ధనుష్‌కు సంబంధం ఉంది. పొల్లాదవన్, ఆడుగళం చిత్రాల కథానాయకుడు ఈయనే. ఇక విచారణై చిత్రానికి నిర్మాత ధనుష్ అన్న విషయం తెలిసిందే. ధనుష్ జీవీ.ప్రకాశ్‌కుమార్‌ల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయని, ఇకపై తన చిత్ర యూనిట్‌కు సంబంధించిన వారెవరూ జీవీతో చిత్రాలు చేయరాదని ధనుష్ హుకం జారీ చేసినట్లు కోలీవుడ్‌లో జరుగుతున్న ప్రచారం. వెట్రిమారన్ కు నటుడు ధనుష్‌కు మధ్య సత్సంబంధాలున్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెట్రిమారన్ కోరిక మేరకు ఇటీవల ధనుష్ కొడి చిత్రాన్ని కూడా చేశారన్నది గమనార్హం. ప్రస్తుతం వెట్రిమారన్ ధనుష్ హీరోగా వడచెన్నై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్ ధనుష్ కోసం ఎదురు చూస్తోందని టాక్. ధనుష్ గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఇన్నై నోక్కి పాయుమ్ తోట, తాను ముఖ్య పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న పవర్ పాండి చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో వెట్రిమారన్ జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. దీన్ని శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. మార్చిలో సెట్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ధనుష్‌తో వరుసగా చిత్రాలు చేస్తున్న వెట్రిమారన్ ఇప్పుడు జీవీ.ప్రకాశ్ కుమార్ హీరోగా చిత్రం చేయడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. -
రెండు భాగాలు...రెండు వందల రోజులు!
ధనుష్, సమంత జంటగా ‘వడ చెన్నయ్’ అనే తమిళ చిత్రం రూపొందనుంది. రెండు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రానికి ధనుష్ ఏకంగా రెండు వందల రోజులు తేదీలు కేటాయించేశారు. ఓ గ్యాంగ్‌స్టర్ జీవితం ఆధారంగా నార్త్ మద్రాస్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో సమంత మురికివాడలకు చెందిన అమ్మాయిగా నటించనున్నారు. మేకప్ లేకుండా నటించడంతో పాటు ఈ చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోనున్నారామె. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభం కానుంది.