
ధనుష్
దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘వడ చెన్నై’. ‘పొల్లాదవన్’, ‘ఆడుకలమ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘వడ చెన్నై’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం రిలీజ్ డేట్ కోసం ధనుష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాటికి ఫుల్‌స్టాప్ పెడుతూ ‘‘అన్బు (ధనుష్ పాత్ర పేరు) మీ అందరి దగ్గరకు అక్టోబర్ 17న వస్తున్నాడు’’ అని సినిమా టీమ్ పేర్కొంది. వాస్తవానికి ‘వడ చెన్నై’ని రెండు భాగాలుగా తీస్తున్నారు. ఫస్ట్ పార్ట్ అక్టోబర్‌లో వస్తుంది. సెకండ్ పార్ట్ రిలీజ్‌ను ప్రకటించలేదు. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ధనుష్ క్యారమ్‌బోర్డ్ ప్లేయర్‌గా కనిపిస్తారట. ఆండ్రియా, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment