నార్త్‌ చెన్నై కుర్రాడి కథ | Vada Chennai first look released | Sakshi
Sakshi News home page

నార్త్‌ చెన్నై కుర్రాడి కథ

Published Sun, Mar 11 2018 12:20 AM | Last Updated on Sun, Mar 11 2018 12:20 AM

Vada Chennai first look released - Sakshi

ధనుష్‌

‘ఆడుకలమ్‌’ వంటి సెన్సేషనల్‌ హిట్‌ తర్వాత దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘వడ చెన్నై’. మూడు పార్ట్స్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో నేషనల్‌ లెవల్‌ క్యారమ్‌ ప్లేయర్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు ధనుష్‌. నార్త్‌ చెన్నైలో 35 సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటనల సమాహారంగా ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం తెలిపింది.

ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, ఆండ్రియా హీరోయిన్లుగా కనిపించనున్నారు. సంతోశ్‌ నారాయణ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, ధనుష్, వెట్రిమారన్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘బెస్ట్‌ డైరెక్టర్, స్క్రీన్‌ ప్లే, హీరో’ విభాగాల్లో నేషనల్‌ అవార్డ్‌ సాధించిన ‘ఆడుకలమ్‌’ సినిమా తర్వాత ఆ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగా పెట్టుకున్నారు ధనుష్‌ అభిమానులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement