ఒక్కడి చావుతో యుద్ధం ఆగదు | Dhanush Vada Chennai Teaser Released | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 29 2018 11:00 AM | Last Updated on Sun, Jul 29 2018 1:52 PM

Dhanush Vada Chennai Teaser Released - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన చిత్రం వడ చెన్నై. ఆడుకాలం తర్వాత విలక్షణ దర్శకుడు వెట్రిమారన్‌ డైరెక్షన్‌లో ధనుష్‌ నటిస్తున్న చిత్రం కావటంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఉత్తర చెన్నై నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ తాజాగా విడుదలైంది. ఒక్క‌డి చావుతో ఈ యుద్ధం ఆగ‌దు....గెలుపైనా ఓటమైనా...యుద్ధం చేయ‌క త‌ప్ప‌దు....మ‌నం ప్ర‌తిఘ‌టించ‌క‌పోతే....వారు మ‌న‌ల్ని అణ‌గ‌దొక్కుతూనే ఉంటారు......ఇది మ‌న ఊరు....గుడిసెలైనా...చెత్త కుప్ప‌లైనా....వాటిని కాపాడుకోవ‌డం కోసం మనం పోరాడాల్సిందే....``అని ధ‌నుష్ సింపుల్ గా చెప్పిన డైలాగ్స్...చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉండి ఆక‌ట్టుకున్నాయి. మొత్తం మూడు గెటప్స్‌లో ధనుష్‌ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. క్యారమ్స్‌ ఛాంపియన్‌.. కత్తి పట్టి గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడు?.. ఆ తర్వాత పరిస్థితులేంటి అన్నదే కథ. ఐశ్వర్య రాజేష్‌, ఆండ్రియా, కిషోర్‌, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మొత్తం మూడు పార్టులుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement