టైమ్‌ దగ్గరపడింది | Dhanush Vada Chennai Movie Release This June seventh | Sakshi
Sakshi News home page

టైమ్‌ దగ్గరపడింది

Published Mon, May 28 2018 8:09 AM | Last Updated on Mon, May 28 2018 8:09 AM

Dhanush Vada Chennai Movie Release This June seventh - Sakshi

వడచెన్నై చిత్రంలో ఓ దృశ్యం

తమిళ సినిమా: వడచెన్నై ఈ పేరు చాలా కాలంగా వార్తల్లో నానుతోందనే చెప్పాలి. నటుడు ధనుష్, దర్శకుడు వెట్ట్రమారన్‌ల సక్సెస్‌పుల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం వడచెన్నై. చిత్ర నిర్మాణం మొదలై చాలా కాలం అయ్యింది. ధనుష్‌ తన వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. నటి ఆండ్రియ, ఐశ్వర్యరాజేశ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం తొలి భాగం చిత్రీకరణ ఎట్టకేలకు ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు ముందుగానే వెల్లడించాయి. ఇందులో ధనుష్‌ క్యారమ్‌ ఆటగాడిగా నటిస్తున్నారు. ఆయన ప్రేయసిగా నటి ఐశ్వర్యరాజేశ్‌ నటిస్తోంది. ఆండ్రియా విభిన్న పాత్రలో కనిపించనుందట. గత మార్చిలో చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. చిత్ర తొలి భాగాన్ని జూన్‌లో విడుదల చేయాలని మొదట భావించారు.

అనివార్య కారణాల వల్ల రజనీకాంత్‌ కథానాయకుడిగా ధనుష్‌ నిర్మించిన కాలా చిత్రం విడుదల వాయిదా పడి ఆ చిత్రం జూన్‌ 7వ తేదీన విడుదల కావడంతో వడచెన్నై చిత్ర విడుదలను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొందని సమాచారం. ఇక వడచెన్నైకి టైమ్‌ దగ్గర పడ్డట్టు కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. దీన్ని ఆగస్ట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం తరువాత ధనుష్‌ నటిస్తున్న తాజా చిత్రం మారి–2 తెరపైకి రానుంది. అయితే మధ్యలో ఆయన నటించిన హాలీవుడ్‌ చిత్రం ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ  ఆఫ్‌ ది ఫకీర్‌ చిత్రం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ధనుష్‌ చిత్రం తెరపైకి వచ్చి ఏడాది దాటి పోయింది. వేల్‌లై ఇల్లా పట్టాదారి–2 చిత్రం తరువాత ఆయన చిత్రాలేవీ విడుదల కాలేదు. దీంతో ధనుష్‌ తాజా చిత్రం వడచెన్నై  కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ధనుష్, వెట్ట్రిమారన్‌ల కాంబినేషన్‌లో చిత్రం అంటే అంచనాలు భారీ స్థాయిలోనే ఉంటాయి. మొత్తం మీద చిన్న గ్యాప్‌ తరువాత ఆయన చిత్రాలు వరుసగా తెరపైకి రానున్నాయన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement