అసురన్‌ మొదలెట్టాడు | dhanush asuran movie launch | Sakshi
Sakshi News home page

అసురన్‌ మొదలెట్టాడు

Published Sun, Jan 27 2019 2:07 AM | Last Updated on Sun, Jan 27 2019 2:07 AM

dhanush asuran movie launch - Sakshi

మంజు వారియర్, ధనుష్‌

ధనుష్‌ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘అసురన్‌’. వెట్రిమారన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మంజు వారియర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శనివారం మొదలైంది. అలాగే ఈ సినిమా కొత్త లుక్స్‌ను కూడా విడుదల చేశారు చిత్రబృందం. ఇక్కడున్న తాజా పోస్టర్‌ను గమనిస్తే... బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలానికి తీసుకెళతారేమో అనిపిస్తోంది కదూ. సినిమాలో ఇది ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌గా వచ్చే అవకాశం ఉందని టాక్‌. ధనుష్‌–వెట్రిమారన్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ నాలుగో చిత్రం ఇది. ఇంతకుముందు ‘ఆడుకాలమ్, పొల్లాదవన్, వడచెన్నై’ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సంగతి ఇలా ఉంచితే... సత్యజ్యోతి ఫిల్మ్స్‌ నిర్మాణ సంస్థలో ధనుష్‌ ఇటీవల రెండు సినిమాలు కమిట్‌ అయ్యారు. ఈ సినిమాలు కూడా ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్తాయన్నది కోలీవుడ్‌ టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement