
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. అలానే తన తర్వాతి చిత్రం కోసం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబుతో కలిసి పనిచేయబోతున్నాడు. దీని తర్వాత చేయబోయే మూవీ కోసం లోకేశ్ కనగరాజ్ లాంటి దర్శకులు పేర్లు వినిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: డబ్బు చుట్టూ తిరుగుతున్న తెలుగు సినిమా.. ఎందుకు?)
ఇలా రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైనప్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి టైంలో తమిళ టాప్ డైరెక్టర్స్‌తో కలిసి రామ్ చరణ్ కనిపించాడు. దీనికి కారణం దర్శకుడు శంకర్ పుట్టినరోజు కావడం. 'గేమ్ ఛేంజర్' సెట్‌లో ఆల్రెడీ బర్త్ డే జరుపుకొన్న శంకర్.. చెన్నై స్పెషల్‌గా పార్టీ అరేంజ్ చేశారు.
ఈ పార్టీలో లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, వెట్రిమారన్, వెంకట్ ప్రభు, ఎస్‌జే సూర్య లాంటి దర్శకులు కనిపించారు. అయితే ఇది కేవలం పార్టీగా అయితే ఉండిపోదు. బహుశా ఈ దర్శకుల్లో చరణ్ తో సినిమా చేసే ప్లాన్ కూడా ఉండొచ్చు. కాబట్టి త్వరలో చరణ్-మరో తమిళ స్టార్ డైరెక్టర్ కాంబోలో ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
(ఇదీ చదవండి: మెగాస్టార్ కొత్త సినిమా.. హారర్ థ్రిల్లర్ కథతో!)
Comments
Please login to add a commentAdd a comment