Kollywood Hero Suriya Acts Again In Sudha Kongara Direction, Deets Inside - Sakshi
Sakshi News home page

Surya: సూపర్ హిట్‌ కాంబినేషన్‌లో సూర్య.. ఆ సీన్ రిపీట్ అవుతుందా?

Published Mon, Jun 12 2023 7:53 AM | Last Updated on Mon, Jun 12 2023 11:09 AM

Kollywood Hero Surya Acts Again In Sudha Kongara Direction - Sakshi

నటుడు సూర్య కథానాయకుడిగా నటించనున్న వాడివాసల్‌ చిత్రం సెట్‌పైకి వెళ్లడానికి మరింత జాప్యం కానుందనే ప్రచారం జరుగుతోంది. సూర్య హీరోగా వెట్రిమారన్‌ దర్శకత్వంలో కలైపులి ఎస్‌.థాను నిర్మించనున్న చిత్రం వాడివాసల్‌. జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఇంతకుముందే రిహార్సల్స్‌ నిర్వహించారు. షూటింగ్‌ ప్రారంభించడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో దర్శకుడు వెట్రిమారన్‌ హాస్యనటుడు సూరిని హీరోగా పరిచయం చేస్తూ విడుదలై చిత్రాన్ని చేయడానికి వెళ్లారు. ఈ చిత్రాన్ని ఆయన రెండు భాగాలుగా తెరకెక్కించారు. తొలిభాగం ఇప్పటికే విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

(ఇది చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న కాజల్‌.. కారణం ఇదేనా?)

తర్వాత సూర్య కథానాయకుడిగా నటించే వాడివాసల్‌ చిత్రాన్ని మొదలెడతారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా విడుదలై చిత్ర రెండవ భాగంపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి విడుదలై–2 చిత్రం చిన్నచిన్న ప్యాచ్‌ వర్క్‌ మినహా పూర్తయిందని చిత్ర వర్గాలు ప్రకటించాయి. విడుదలై చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో దాని సీక్వెల్‌ను ఇంకా బెటర్‌మెంట్‌ కోసం దర్శకుడు వెట్రిమారన్‌ పలు మార్పులు చేర్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

నాలుగైదు రోజులు అనుకున్నది మరో 40 రోజులు చిత్రీకరించ తలపెట్టినట్లు సమాచారం. తొలి భాగం సక్సెస్‌ కావడంతో నిర్మాత రెండవ భాగం చేర్పులు, మార్పులు చేయడానికి మరింత ఖర్చు భరించడానికి సమ్మతించినట్లు టాక్‌. ఇకపోతే ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువా చిత్రం చేస్తున్న సూర్య వాడివాసల్‌ చిత్రం సెట్‌పైకి వెళ్లాడానికి ఇంకా సమయం పట్టనుండడంతో, ఈలోపు మరో చిత్రం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో సుధాకొంగర దర్శకత్వంలో మరోసారి నటించనున్నట్లు తెలిసింది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకు సూరరై పోట్రు వంటి సూపర్‌హిట్‌ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.

(ఇది చదవండి:  సుశాంత్‌ ఆత్మహత్యపై కంగనా సంచలన ఆరోపణలు..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement