దసరాకి కంగువ Actor Suriya Kanguva is set to release on October 10th | Sakshi
Sakshi News home page

దసరాకి కంగువ

Published Fri, Jun 28 2024 12:21 AM | Last Updated on Fri, Jun 28 2024 11:50 AM

Actor Suriya Kanguva is set to release on October 10th

దసరా పండక్కి థియేటర్స్‌కు వస్తున్నాడు ‘కంగువ’. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్‌ అండ్‌ టైమ్‌ ట్రావెల్‌ మూవీ ‘కంగువ’. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్ గా నటించగా, బాబీ డియోల్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న సినిమా ఇది. 

తాజాగా ‘కంగువ’ సినిమాను ఈ  ఏడాది అక్టోబరు 10న విడుదల చేస్తున్నట్లుగా ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు సూర్య. రిలీజ్‌ డేట్‌ని బట్టి ‘కంగువ’ దసరా పండగ సందర్భంగా విడుదల అవుతుందని తెలుస్తోంది. ఇక ‘కంగువ’ సినిమా డిఫరెంట్‌ టైమ్‌లైన్స్ లో ఉంటుందని, సూర్య ఐదారు గెటప్స్‌లో కనిపిస్తారని, ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement