
సూర్య
ఒక సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను పట్టాలెక్కిస్తూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు సూర్య. ఆల్రెడీ సూర్య నటించిన పొలిటికల్ మూవీ ‘ఎన్‌జీకే’ రిలీజ్‌కు రెడీ అయింది. ‘కాప్పాన్’ అనే యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్‌ను దాదాపు పూర్తి చేసేశారు. ఇప్పుడు ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశారు. ఈ చిత్రం ముహూర్తం ఆదివారం జరిగింది. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. సూర్య సొంత బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమాలో మోహన్‌బాబు కీలక పాత్ర చేయనున్నారు. ‘సర్వం తాళ మయం’ ఫేమ్ అపర్ణ బాలమురళి హీరోయిన్. జీవీ ప్రకాశ్ స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment