అబ్బాయి చేతుల మీదుగా బాబాయ్ ఫస్ట్ లుక్ | Rana to unveil venkatesh new movie first look | Sakshi
Sakshi News home page

అబ్బాయి చేతుల మీదుగా బాబాయ్ ఫస్ట్ లుక్

Published Sat, Sep 17 2016 12:59 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

అబ్బాయి చేతుల మీదుగా బాబాయ్ ఫస్ట్ లుక్ - Sakshi

అబ్బాయి చేతుల మీదుగా బాబాయ్ ఫస్ట్ లుక్

బాబు బంగారం సినిమాతో ఆకట్టుకున్న సీనియర్ హీరో వెంకటేష్, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను మొదలు పెట్టనున్నాడు. అయితే కాస్త భిన్నంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవ్వటానికి ముందే ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. హిందీ, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన సాలా ఖద్దూస్ సినిమాను తెలుగులో గురు పేరుతో రీమేక్ చేస్తున్నాడు వెంకీ.

ఒరిజినల్ వర్షన్కు దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు. ఒరిజినల్ వర్షన్లో బాక్సింగ్ స్టూడెంట్గా నటించిన రితికా సింగ్, ఈ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వనుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ఈ రోజు( శనివారం) సాయంత్రం 5 గంటలకు యంగ్ హీరో రానా తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement