టాలెంటెడ్‌ లేడీ డైరెక్షన్‌లో శివకార్తికేయన్‌ | Sivakarthikeyan Upcoming Project With Sudha Kongara | Sakshi
Sakshi News home page

టాలెంటెడ్‌ లేడీ డైరెక్షన్‌లో శివకార్తికేయన్‌

Published Mon, May 27 2024 6:49 AM | Last Updated on Mon, May 27 2024 8:59 AM

Sivakarthikeyan Upcoming Project With Sudha Kongara

మహిళ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇంతకుముందు సుధా కొంగర సూర్య కథానాయకుడిగా సూరరై పోట్రు (ఆకాశం నీ హద్దురా) వంటి సూపర్‌ హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. 2020లో విడుదలైన ఈ చిత్రం పలు జాతీయ అవార్డులను గెలుచుకున్న విషయం విదితమే. కాక సుధా కొంగర తాజాగా సూర్య హీరోగా మరో చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమయ్యారు. దీనికి పురనానూరు అనే టైటిల్‌ కూడా నిర్ణయించారు. 

ఈ చిత్రాన్ని నటుడు సూర్య తన 2 డీ ఎంటర్‌ టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఈ చిత్ర నిర్మాణానికి చాలా సమయం అవసరం అవుతుందని అందువల్ల చిత్ర నిర్మాణాన్ని వాయిదా వేస్తున్నట్లు దర్శకురాలు సుధా కొంగర, నటుడు సూర్య కలిసి ప్రకటన చేశారు. అలాంటిది తాజాగా దర్శకురాలు సుధా కొంగర తన తాజా చిత్రాన్ని నటుడు శివ కార్తికేయన్‌ హీరోగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రసారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు. 

కాగా నటుడు శివ కార్తికేయన్‌ అమరన్‌ చిత్రాన్ని పూర్తిచేసి ప్రస్తుతం ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తన 23వ చిత్రాన్ని చేస్తున్నారు. అదేవిధంగా సుధా కొంగర సూరరై పోట్రు చిత్రానికి రీమేక్‌ అయిన సర్‌ఫరా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో సూర్య కథానాయకుడిగా నటించిన పురనానూరు చిత్రం పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement