బాబాయ్ సినిమా సీక్వల్లో అబ్బాయ్..! | venkatesh guru sequel with rana | Sakshi
Sakshi News home page

బాబాయ్ సినిమా సీక్వల్లో అబ్బాయ్..!

Published Thu, Apr 6 2017 12:07 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

బాబాయ్ సినిమా సీక్వల్లో అబ్బాయ్..! - Sakshi

బాబాయ్ సినిమా సీక్వల్లో అబ్బాయ్..!

సీనియర్ స్టార్ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా గురు. సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాకు సీక్వల్ను తెరకెక్కించే ప్లాన్లో ఉంది దర్శకురాలు సుధ కొంగర. ఇప్పటికే సీక్వల్కు సంబంధించి ఓ స్టోరి లైన్ కూడా రెడీ చేసుకుందట. ప్రస్తుతం పూర్తి స్క్రీప్ట్ రెడీ చేసే పనిలో ఉంది.

అయితే తొలి భాగాన్ని వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన దర్శకురాలు, సీక్వల్లో హీరోను మార్చాలని నిర్ణయించింది. గురు సినిమా సీక్వల్కు యంగ్ హీరో రానాను లీడ్ రోల్కు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే లైన్ విన్న రానా ఫుల్ స్క్రీప్ట్ రెడీ చేయమన్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్లో పాల్గొంటున్న రానా, బాహుబలి పార్ట్ 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాల తరువాత సుధ దర్శకత్వంలో సినిమా ఉండే ఛాన్స్ ఉంది. అయితే తొలి భాగంలో వెంకీ చేసిన పాత్రకు రానా పాత్రను ఎలా కనెక్ట్ చేస్తారో చూడాలి. బాబాయ్ ఆకట్టుకున్న కోచ్ పాత్రకు అబ్బాయి రానా ఎంత వరకు న్యాయం చేస్తాడో అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement