
తమిళ చిత్రం ‘శూరరైపోట్రు’ (‘ఆకాశం నీ హద్దురా’)తో బంపర్ హిట్ సాధించారు దర్శకురాలు సుధ కొంగర. ఈ చిత్రం ఓటీటీలో విడుదలైనప్పటికీ ఇటు వ్యూయర్స్ నుంచి అటు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన లభించింది. దీంతో సుధ తర్వాతి చిత్రంలో ఎవరు హీరోగా నటించనున్నారు? అనే విషయంపై ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే మహేశ్‌బాబు, తమిళ హీరో విజయ్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి.
తాజాగా ప్రభాస్ పేరు వినిపిస్తోంది. ఇటీవల ప్రభాస్‌కు ఓ కథ వినిపించారట సు«ధ. ఈ కథ ప్రభాస్‌కు నచ్చిందట. త్వరలో మరోసారి ఈ సినిమా గురించి ఇద్దరూ చర్చించుకోనున్నారని టాక్. ఇప్పటికే ‘రాధేశ్యామ్’, ‘సలార్’, ‘ఆది పురుష్’, నాగ్ అశ్విన్‌తో సినిమా.. ఇలా వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సమయంలో మరో కొత్త సినిమా కమిట్ అవుతారా? ప్రభాస్–సుధ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా? వేచి చూడాల్సిందే.