
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరో చిత్రానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే కంగువా షూటింగ్‌లో బిజీగా ఉన్న హీరో.. సూరారై పోట్రు(ఆకాశం నీ హద్దురా) ఫేమ్ సుధా కొంగరతో మరోసారి జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సూర్య 43 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
(ఇది చదవండి: ఇంటర్నెట్‌లో అసలు ఏం నడుస్తోంది?.. ఆ డైలాగ్ ఒక్కటేనా!)
గ్లింప్స్ చూస్తే తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగానే ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో 'సీతారామం' ఫేమ్ దుల్కర్ సల్మాన్, తమన్నా ప్రియుడు విజయ్ వర్మ, మలయాళ నటి నజ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు.
కాగా.. సుధా కొంగర, సూర్య కాంబినేషన్‌లో వచ్చిన సూరారై పోట్రు చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో జాతీయ అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఇదే సినిమాని సుధా కొంగర హిందీలో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తుండగా.. సూర్య అతిథిగా కనిపించనున్నారు.
(ఇది చదవండి: అమలాపాల్ రెండో పెళ్లి.. కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా?)
My next!
— Sudha Kongara (@Sudha_Kongara) October 26, 2023
With an awesome bundle of talents@Suriya_offl @dulQuer #Nazriya @MrVijayVarma @gvprakash #Jyotika @rajsekarpandian @meenakshicini #Suriya43 has begun! pic.twitter.com/6EBQNUL301