Gliimpse
-
మరోసారి సూపర్ హిట్ కాంబినేషన్.. అదిరిపోయిన గ్లింప్స్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరో చిత్రానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే కంగువా షూటింగ్లో బిజీగా ఉన్న హీరో.. సూరారై పోట్రు(ఆకాశం నీ హద్దురా) ఫేమ్ సుధా కొంగరతో మరోసారి జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సూర్య 43 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: ఇంటర్నెట్లో అసలు ఏం నడుస్తోంది?.. ఆ డైలాగ్ ఒక్కటేనా!) గ్లింప్స్ చూస్తే తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగానే ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో 'సీతారామం' ఫేమ్ దుల్కర్ సల్మాన్, తమన్నా ప్రియుడు విజయ్ వర్మ, మలయాళ నటి నజ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. సుధా కొంగర, సూర్య కాంబినేషన్లో వచ్చిన సూరారై పోట్రు చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో జాతీయ అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఇదే సినిమాని సుధా కొంగర హిందీలో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తుండగా.. సూర్య అతిథిగా కనిపించనున్నారు. (ఇది చదవండి: అమలాపాల్ రెండో పెళ్లి.. కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా?) My next! With an awesome bundle of talents@Suriya_offl @dulQuer #Nazriya @MrVijayVarma @gvprakash #Jyotika @rajsekarpandian @meenakshicini #Suriya43 has begun! pic.twitter.com/6EBQNUL301 — Sudha Kongara (@Sudha_Kongara) October 26, 2023 -
పవన్ కల్యాణ్ ఓజీపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్..!
సాహో తర్వాత దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఓజీ(OG). పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్. పవన్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తే ఫుల్ యాక్షన్‌లో మోడ్‌లో గ్యాంగ్‌స్టర్‌గా పవన్ కల్యాణ్ లుక్ అదిరిపోయింది. గ్లింప్స్ అద్భుతంగా ఉందంటూ పలువురు ట్వీట్స్ చేస్తున్నారు. హంగ్రీ చీతా అనే పేరుతో వచ్చిన ఓజీ గ్లింప్స్ అద్భుతంగా ఉంది. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. (ఇది చదవండి: ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి సందడి.. ఫోటోలు షేర్ చేసిన రోజా) పవన్ కల్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ఆర్జీవీ చేసిన ట్వీట్ చేశారు. 'ఓజీ గ్లింప్స్ ప్రపంచాన్ని దాటేసింది.. నేను ఇప్పటి వరకు చూసిన పీకే ట్రైలర్స్‌లో ఇది అత్యుత్తమం. హే సుజిత్ మీరు చంపేశారు బ్రో అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఇది చూసిన పవన్ కల్యాణ్ అభిమానులు సైతం క్రేజీ పోస్టులు పెడుతున్నారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ ఊహించని ట్వీట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం ఓజీ గ్లింప్స్ ఆ రేంజ్లో అద్భుతంగా ఉందని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అర్జున్ దాస్ ఓయిస్ ఓవర్ తో గ్లింప్ల్ మొదలైంది. పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాను గుర్తుందా? అది మట్టి, చెట్లతో పాటు, సగం ఊరిని ఊడ్చేసింది. కానీ… వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. అలాంటి వాడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే..’ అంటూ పవన్ ఎంట్రీని చూపించారు. తమన్ నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌కి మరింత బలాన్ని చేకూర్చింది. (ఇది చదవండి: గోపీచంద్‌ని తిట్టడం తప్పే.. ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్) కాగా.. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌కు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. విలన్ పాత్రను బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. This has to be the HAPPIEST BIRTHDAY for @PawanKalyan #OGGlimpse is simply OUT OF THE WORLD ..This is the BESTEST among all P K trailers I have ever seen Hey #Sujeeth YOU KILLED IT 💪 https://t.co/yrcB6JMd9O — Ram Gopal Varma (@RGVzoomin) September 2, 2023 -
అర్జున్ బర్త్ డే.. అదిరిపోయిన గ్లింప్స్!
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ తాజాగా నటిస్తోన్న చిత్రం లియో. ఈ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. త్రిష, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, మిస్కిన్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో లియో మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. (ఇది చదవండి: విజయ్ 'లియో' కోసం మరోసారి కశ్మీర్‌కి!) అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ఆయన హరోల్డ్ దాస్ అనే క్యారెక్టర్లో అర్జున్ కనిపించనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ లోకేశ్ తన ట్విటర్లో షేర్ చేశారు. హ్యా బర్త్ డే అర్జున్ సార్ అంటూ.. థ్యాంక్యూ ఫర్ ఎక్స్ట్రార్డినరీ ఏఫర్ట్ అంటూ విషెస్ తెలిపారు. అయితే గ్లింప్స్ చూస్తే అర్జున్ ఫుల్ యాక్షన్ రోల్లో కనిపిస్తున్నారు. ప్రతి నాయకుడిగా ఓ రేంజ్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్ర దసరా సందర్భంగా అక్టోబర్ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. (ఇది చదవండి: రజినీకాంత్ 'జైలర్'.. సగం బడ్జెట్ ఆయనకే ఇచ్చేశారుగా!) And now meet #HaroldDas 🔥🔥 Thank you @akarjunofficial sir for the extraordinary efforts you’ve put in for this film! Wishing our #ActionKing a very happy birthday! 🤜🤛 #Leo🔥🧊#GlimpseOfHaroldDas#HBDActionKingArjun pic.twitter.com/DQnhxXbRkh — Lokesh Kanagaraj (@Dir_Lokesh) August 15, 2023 -
మరో స్టార్టప్ ను కొనుగోలు చేసిన ఆపిల్
న్యూయార్క్ : డిజిటల్ వైద్య సేవల విస్తరణ ప్రణాళికలో భాగంగా టెక్ దిగ్గజం ఆపిల్ మరో స్టార్ట్ అప్ కంపెనీని స్వాధీనం చేసుకుంది. ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వ్యవస్థాపకులు స్థాపించిన వ్యక్తిగత ఆరోగ్య డేటా కంపెనీ గ్లింప్స్ ను కొనుగోలుచేసింది. అనిల్ సేథీ, కార్తీక్ హరిహరన్ ఆధ్వర్యంలో నడుస్తున్న గ్లింప్స్ ను కొనుగోలు చేసింది. మీడియా నివేదికల ప్రకారం, ఈస్వాధీనం ఇంతకుముందే జరిగినప్పటికీ బహిరంగంగా ఇంకా ప్రకటించలేదు. అయితే ఆపిల్ ప్రతినిధి దీనిపై స్పందిచారు. చిన్నటెక్నాలజీ కంపెనీలను సంస్థ కొనుగోలు చేసినా, వాటిని సాధారణంగా బహిరంగ పర్చమని, చర్చించమని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రయోజనాలు, ప్రణాళికలను చర్చించడానికి లేదని పేర్కొన్నారు. అనిల్ సేథీ, కార్తీక్ హరిహరన్ 2013లో స్థాపించబడిన గ్లింప్స్ కంపెనీ వినియోగదారులు తమ వైద్య రికార్డులు, సమాచారం పంచుకోవడానికి ఉపయోగపడే ఒక సురక్షిత వేదికను అందిస్తుంది. కాగా ఇటీవల ఆపిల్ హెల్త్ కిట్, కేర్ కిట్ రీసెర్చ్ కిట్ లాంటి స్టార్ట్ అప్ కంపెనీలు కొనుగోలు చేసింది. ఆపిల్ ఐఫోన్ 6 వినియోగదారులు తమ వ్యక్తిగత ఆరోగ్య, ఫిట్నెస్ డేటా మానిటరింగ్‌లో సహాయపడేలా హెల్త్ కిట్ యాప్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.