మరో స్టార్టప్ ను కొనుగోలు చేసిన ఆపిల్
న్యూయార్క్ : డిజిటల్ వైద్య సేవల విస్తరణ ప్రణాళికలో భాగంగా టెక్ దిగ్గజం ఆపిల్ మరో స్టార్ట్ అప్ కంపెనీని స్వాధీనం చేసుకుంది. ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వ్యవస్థాపకులు స్థాపించిన వ్యక్తిగత ఆరోగ్య డేటా కంపెనీ గ్లింప్స్ ను కొనుగోలుచేసింది. అనిల్ సేథీ, కార్తీక్ హరిహరన్ ఆధ్వర్యంలో నడుస్తున్న గ్లింప్స్ ను కొనుగోలు చేసింది. మీడియా నివేదికల ప్రకారం, ఈస్వాధీనం ఇంతకుముందే జరిగినప్పటికీ బహిరంగంగా ఇంకా ప్రకటించలేదు.
అయితే ఆపిల్ ప్రతినిధి దీనిపై స్పందిచారు. చిన్నటెక్నాలజీ కంపెనీలను సంస్థ కొనుగోలు చేసినా, వాటిని సాధారణంగా బహిరంగ పర్చమని, చర్చించమని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రయోజనాలు, ప్రణాళికలను చర్చించడానికి లేదని పేర్కొన్నారు. అనిల్ సేథీ, కార్తీక్ హరిహరన్ 2013లో స్థాపించబడిన గ్లింప్స్ కంపెనీ వినియోగదారులు తమ వైద్య రికార్డులు, సమాచారం పంచుకోవడానికి ఉపయోగపడే ఒక సురక్షిత వేదికను అందిస్తుంది.
కాగా ఇటీవల ఆపిల్ హెల్త్ కిట్, కేర్ కిట్ రీసెర్చ్ కిట్ లాంటి స్టార్ట్ అప్ కంపెనీలు కొనుగోలు చేసింది. ఆపిల్ ఐఫోన్ 6 వినియోగదారులు తమ వ్యక్తిగత ఆరోగ్య, ఫిట్నెస్ డేటా మానిటరింగ్లో సహాయపడేలా హెల్త్ కిట్ యాప్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.