సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ఆర్‌ఐఐహెచ్‌ఎల్ (రిలయన్స్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్) భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. మీడియా స్టార్టప్ కంపెనీ న్యూజ్ (న్యూ ఎమర్జింగ్ వరల్డ్ ఆఫ్ జర్నలిజం)మీడియాలో గణనీయమైన వాటాలను కొనుగోలు చేసింది. ప్రాథమికంగా రూ 10.3 మిలియన్ల నగదు పెట్టుబడులకు ఒక ఒప్పందం చేసుకుంది. దీంతో న్యూజ్ మీడియా ఆర్‌ఐఐహెచ్ అనుబంధ సంస్థగా అవతరించనుంది.
మంగళవారం మార్కెట్ ముగిసిన తరువాత మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. 30 వేల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసినట్టు తెలిపింది. 10.3 మిలియన్ల రూపాయల విలువైన 125 కంపల్సరీ కన్వర్టిబుల్ డిబెంచర్లను సాధించినట్టు ఆర్‌ఐఐహెచ్‌ఎల్ తెలిపింది.
స్మార్ట్‌ఫోన్ ప్రియులుగా ఉన్న యువ భారతమే లక్ష్యంగా వీడియోలను రూపొందించి, అందించే స్టార్ట్‌ప్ కంపెనీ న్యూజ్ మీడియా. ఉపాధ్యాయ శలభ్ నేతృత్వంలో యువ వ్యాపారవేత్తల బృందం స్థాపించిన ఈ కంపెనీని వీడియో కంటెట్ మార్కెట్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో భారీ వాటాను సొంతం చేసుకున్నట్టు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment