Director Lokesh Releases Arjun's First Glimpse From Vijay's 'Leo' Movie - Sakshi
Sakshi News home page

Arjun: లియో మూవీ.. అదిరిపోయేలా యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ గ్లింప్స్

Published Tue, Aug 15 2023 6:15 PM | Last Updated on Wed, Aug 16 2023 10:05 AM

Vijay Movie Leo Director Lokesh Releases Arjun First Glimps In Movie - Sakshi

తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ తాజాగా నటిస్తోన్న చిత్రం లియో. ఈ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. త్రిష, ప్రియా ఆనంద్‌, గౌతమ్‌ మీనన్‌, మిస్కిన్‌, బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఇవాళ ఆయన బర్త్‌ డే కావడంతో లియో మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

(ఇది చదవండి: విజయ్ 'లియో' కోసం మరోసారి కశ్మీర్‌కి!)

అర్జున్ బర్త్‌ డే సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ఆయన హరోల్డ్ దాస్ అనే క్యారెక్టర్‌లో అర్జున్ కనిపించనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ లోకేశ్ తన ట్విటర్‌లో షేర్ చేశారు. హ్యా బర్త్ డే అర్జున్ సార్ అంటూ.. థ్యాంక్యూ ఫర్ ఎక్స్‌ట్రార్డినరీ ఏఫర్ట్ అంటూ విషెస్ తెలిపారు. అయితే గ్లింప్స్ చూస్తే అర్జున్ ఫుల్ యాక్షన్‌ రోల్‌లో కనిపిస్తున్నారు. ప్రతి నాయకుడిగా ఓ రేంజ్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది.  కాగా ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్ర దసరా సందర్భంగా అక్టోబర్ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. 
    

(ఇది చదవండి: రజినీకాంత్ 'జైలర్'.. సగం బడ్జెట్‌ ఆయనకే ఇచ్చేశారుగా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement