Director Sudha Kongara Injured With Hand Fracture In Shooting - Sakshi
Sakshi News home page

స్టార్​ డైరెక్టర్‌కు ప్రమాదం.. నెల రోజులు రెస్ట్.. !

Published Sun, Feb 5 2023 2:43 PM | Last Updated on Sun, Feb 5 2023 3:13 PM

Director Sudha Kongara injured and fractures hand In Shooting - Sakshi

కోలీవుడ్ స్టార్​ డైరెక్టర్​ సుధా కొంగరకు ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ట్విట్టర్​ వేదికగా ఫోటోలను షేర్​ చేశారు. ప్రస్తుతం నెల రోజుల పాటు బెడ్​ రెస్ట్​ అవసరమని తెలిపారు. ప్రస్తుతం 'సూరరై పోట్రు' సినిమా హిందీ రీమెక్​ షూట్​లో జరిగిన ప్రమాదంలో చేతికి గాయమయ్యిందని సమాచారం.  గాయంతో విపరీతమైన నొప్పి ఉందని అందుకే విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపింది. ఆ ఫోటోలు చూస్తే చేతికి బలమైన గాయాలైనట్లు కనిపిస్తోంది. గురు', 'ఆకాశమే నీ హద్దురా' లాంటి సూపర్​హిట్​ మూవీస్​ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారామె.
 
ప్రస్తుతం 'సూరరై పోట్రు' సినిమా హిందీ రీమెక్​ తెరకెక్కిస్తుండగా అక్షయ్​ కుమార్​ లీడ్​రోల్​లో కనిపించనున్నారు. ఈ సినిమాలో రాధిక మదన్​ నటిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని ఆమె వెల్లడించలేదు. మరోవైపు ఈ స్టార్​ డైరెక్టర్​ తమిళ హీరో సూర్యతో మరో ప్రాజెక్ట్​ తీయడానికి రెడీ అయ్యారు. ఈ ప్రాజెక్ట్​కు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement