
ఇండస్ట్రీలో అతికొద్ది మందే లేడీ డైరెక్టర్స్ ఉన్నారు. వారిలో వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుధా కొంగర కూడా ఒకరు. స్టార్ హీరో సూర్యతో తమిళంలో ఆమె చేసిన 'సురారైపోట్రు' తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సూర్యతో పాటు సుధా కొంగరకి కూడా మంచి పేరొచ్చింది. ఇప్పుడీ లేడీ డైరెక్టర్‌కు క్రేజీ ఆఫర్ దక్కింది.
కేజీఎఫ్, కేజీఎఫ్-2 లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ తమ కొత్త సినిమాని సుధా కొంగరతో చేస్తున్నట్టుగా అఫీషియల్‌గా ప్రకటించారు. ఈసారి కూడా వాస్తవ సంఘటనల ఆధారంగానే ఆమె కథను సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో హీరో ఎవరన్నది మాత్రం చెప్పలేదు. కానీ సూర్యనే ఈ ప్రాజెక్టులో నటించనున్నట్లు కోలీవుడ్ టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
𝐒𝐨𝐦𝐞 𝐭𝐫𝐮𝐞 𝐬𝐭𝐨𝐫𝐢𝐞𝐬 𝐝𝐞𝐬𝐞𝐫𝐯𝐞 𝐭𝐨 𝐛𝐞 𝐭𝐨𝐥𝐝, 𝐚𝐧𝐝 𝐭𝐨𝐥𝐝 𝐫𝐢𝐠𝐡𝐭.
— Hombale Films (@hombalefilms) April 21, 2022
To a new beginning with a riveting story @Sudha_Kongara, based on true events.@VKiragandur @hombalefilms @HombaleGroup pic.twitter.com/mFwiGOEZ0K
Comments
Please login to add a commentAdd a comment