తాప్సీ లీడ్‌రోల్‌లో ‘గేమ్‌ ఓవర్‌’ | Taapsee Game Over Shoot Begins Today | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 11 2018 1:29 PM | Last Updated on Thu, Oct 11 2018 1:29 PM

Taapsee Game Over Shoot Begins Today - Sakshi

టాలీవుడ్, బాలీవుడ్‌లలో సత్తా చాటిన తాప్సి ప్రధాన పాత్రలో వై నాట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌ పై తెరకెక్కుతున్న సినిమా గేమ్‌ ఓవర్‌. గతంలో లవ్ ఫెయిల్యూర్, గురు సినిమాలను తెరకెక్కించిన ఈ సంస్థ ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో మరో చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘నయనతార’ ప్రధాన పాత్రలో తమిళ నాట ఘనవిజయం సాధించిన ‘మయూరి’ వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అశ్విన్ శరవణన్.. గేమ్‌ ఓవర్‌ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. 

ఈ సినిమా ఈ రోజు(గురువారం) చెన్నై  ప్రారంభమయింది. ఓ సరికొత్త కధ, కథనాలతో తెలుగు,తమిళ భాషలలో ఏక కాలంలో ఈ రోజు నుంచి ఏక ధాటిగా ఆంద్ర,తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాలలోని పలు ప్రదేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది అని నిర్మాత ఎస్.శశికాంత్ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement