వెంకీ కూడా సంక్రాంతికే వస్తున్నాడు | venkatesh guru on sankranti race | Sakshi
Sakshi News home page

వెంకీ కూడా సంక్రాంతికే వస్తున్నాడు

Published Wed, Oct 19 2016 1:45 PM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM

వెంకీ కూడా సంక్రాంతికే వస్తున్నాడు - Sakshi

వెంకీ కూడా సంక్రాంతికే వస్తున్నాడు

యంగ్ హీరోల జోరు పెరగటంతో కాస్త స్లో అయిన సీనియర్ హీరోలు సంక్రాంతినే టార్గెట్ చేస్తున్నారు. గత ఏడాది సంక్రాంతి బరిలో బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్ హీరోలు పోటి పడగా ఈ ఏడాది సంక్రాంతి పోటి మరింత రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే పోటిలో ఇద్దరు స్టార్ హీరోలు కాలు దువ్వుతుండగా తాజాగా  మరో సీనియర్ హీరో కూడా పోటిలోకి ఎంటర్ అయ్యాడు.

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150తో పాటు బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. నాగార్జున లీడ్ రోల్లో తెరకెక్కుతున్న ఓం నమోవేంకటేశాయ కూడా అదే సమయంలో రిలీజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తున్నా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.

ఇంతటి భారీ పోటి మధ్య మరో స్టార్ హీరో కూడా బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల బాబు బంగారం సినిమాతో ఆకట్టుకున్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సాలాఖద్దూస్కు రీమేక్గా తెరకెక్కుతున్న గురు సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను కూడా సంక్రాంతి బరిలోనే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల కాలం ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ముగ్గురు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు  కూడా ఈ పోటిని ఆసక్తిగా గమనిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement