ఈ కోచ్‌ చాలా స్టైల్ గురూ | Venkatesh's Guru gears up for a summer release | Sakshi
Sakshi News home page

ఈ కోచ్‌ చాలా స్టైల్ గురూ

Published Sat, Feb 11 2017 11:14 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

ఈ కోచ్‌ చాలా స్టైల్ గురూ

ఈ కోచ్‌ చాలా స్టైల్ గురూ

స్కూల్‌కి హాలీడేస్‌... చిన్నారులకు జాలీడేస్‌.... సమ్మర్‌ వస్తే పిల్లలకు మాంచి పండగ వచ్చినట్టే. స్కూల్‌లో గురువులు చెప్పే పాఠాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టి కాస్త రిలాక్స్‌ అయ్యే ఆ టైమ్‌లో మరో గురువు వాళ్ల దగ్గరకి వస్తున్నాడు. ఆయనే ‘విక్టరీ’ వెంకటేశ్‌. స్కూల్‌లో గురువులు క్లాస్‌ రూముల్లో పాఠాలు చెబితే... వెంకీ ప్లే– గ్రౌండ్‌లో క్లాస్‌ తీసుకుంటారు. సమ్మర్‌ స్పెషల్‌ క్లాస్‌తో ఈ గురువు రెడీ అవుతున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో వెంకటేశ్‌ బాక్సింగ్‌ కోచ్‌గా నటించిన సినిమా ‘గురు’. ఎస్‌. శశికాంత్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

ఈ నెల 17న ‘ఏయ్‌ సక్కనోడ..’ పాట లిరికల్‌ వీడియో విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ  కనిపించని సరికొత్త లుక్‌లో వెంకటేశ్‌ సై్టలిష్‌గా కనిపి స్తారు. ఈ ఎమోషనల్‌ స్పోర్ట్స్‌ డ్రామాను దర్శకురాలు మలచిన విధానం అద్భుతం. మార్చిలో పాటల్ని రిలీజ్‌  చేస్తాం’’ అన్నారు. రితికా సింగ్, ముంతాజ్‌ సర్కార్‌ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి మాటలు: హర్షవర్థన్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, శ్రీమణి, ఫైట్స్‌: ‘స్టన్నర్‌’ శామ్, ‘రియల్‌’ సతీశ్, కళ: జాకీ, కూర్పు: సతీశ్‌ సూర్య, కెమేరా: కేఏ శక్తివేల్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర, సంగీతం: సంతోశ్‌ నారాయణన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement